బిగ్‌బాస్ తరహాలో మరో రియాలిటీ షో.. ఒకే విల్లాలో 10 జంటలు.. 70 రోజులు డ్రామా!

బుల్లితెర ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్ అందుస్తున్న రియాలిటీ గేమ్ షో బిగ్‌బాస్. కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషాల్లో ఈ రియాలిటీ షో కొనసాగుతోంది. ఈ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రేక్షకుల నుంచి కూడా ఎనాలేని ఆదరణ వస్తోంది.దీంతో ఇలాంటి రియాలిటీ షోలకి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఒకే ఇంట్లో కంటెస్టెంట్లు, టాస్కులు, గొడవలు, ఎమోషన్స్, ఎలిమినేషన్స్... ఈ ఫార్మాట్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవల్. ఇప్పుడు అదే స్టైల్‌లో కానీ పూర్తిగా కొత్త ట్విస్ట్‌తో స్టార్ మా మరో బిగ్ రియాలిటీ షోను తీసుకొస్తోంది. ఈసారి సింగిల్స్ కాదు... జంటలతో.. ఇంతకీ ఆ రియాలిటీ షో ఏంటీ?

తెలుగు రియాలిటీ షో ప్రేక్షకులకు మరో భారీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ సిద్ధమవుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగుతో టీఆర్పీ రికార్డులు క్రియేట్ చేసిన స్టార్ మా (Star Maa) ఇప్పుడు అదే తరహాలో కానీ పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో మ్యాడ్ ఫర్ ఇచ్ అదర్ (Mad For Each Other)పేరుతో ఓ సరికొత్త కపుల్స్ రియాలిటీ షోను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ షో టెలివిజన్‌లో స్టార్ మా ద్వారా ప్రసారం కానుండగా, డిజిటల్ స్ట్రీమింగ్‌ను జియో హాట్ స్టార్ (JioHotstar) అందించనుంది.

Mad For Each Other Telugu Reality Show Bigg Boss Style Couples Game on Star Maa amp amp JioHotstar

photo courtesy jio hotstar

ఈ షో ప్రత్యేకత ఏమిటంటే... ఇందులో సింగిల్ కంటెస్టెంట్స్ ఉండరు. పూర్తిగా జంటలే పోటీ పడతారు. పెళ్లయిన భార్యాభర్తలు, అలాగే లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న పార్ట్‌నర్లు కలిపి మొత్తం 10 జంటలు ఒక భారీ విల్లాలోకి అడుగుపెడతారట. దాదాపు 70 రోజుల పాటు ఒకే రూఫ్ కింద ఉంటూ, ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకోవడం, ఈగో, గొడవలు... అన్నింటినీ పరీక్షించే టాస్కుల్లో పాల్గొనాల్సి ఉంటుందని టాక్.

ప్రతి వారం జంటలకు ప్రత్యేక టాస్కులు ఇస్తారు. వాటిలో గెలిచినవారు సేఫ్ జోన్, ఓడిపోయినవారు డేంజర్ జోన్లోకి వెళ్తారు. అయితే బిగ్‌బాస్‌లా ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ ఉండదట. డేంజర్ జోన్‌లో ఉన్న జంటల్లో ఎవరు బయటకు వెళ్లాలన్నది... సేఫ్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు, అలాగే షో జడ్జీల నిర్ణయంతో తేలనుంది. ఇలా ప్రతివారం ఒక జంట ఎలిమినేట్ అవుతుందట.

ఈ షోకి హోస్ట్‌గా యాంకర్ శ్రీముఖి (Sreemukhi) వ్యవహరించనున్నట్టు సమాచారం. ఆమె ఎనర్జీ, ప్రెజెంటేషన్ స్టైల్ వల్ల షో మరింత ఆసక్తికరంగా మారనుందని అభిమానులు భావిస్తున్నారు. వీకెండ్స్‌లో మాత్రమే జడ్జీలు ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. ఓ జడ్జ్‌గా సీనియర్ హీరోయిన్ రాధ పేరు వినిపిస్తుండగా, మిగతా జడ్జీల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.

ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమో షూట్ పూర్తైనట్లు టాక్. అలాగే తర్వలోనే ఈ షో ప్రారంభమవుతుందనీ, పది జంటలు విల్లాలోకి అడుగుపెట్టారని సమాచారం. పాల్గొంటున్న జంటల్లో వాసంతి కృష్ణన్ - పవన్ కళ్యాణ్, అంజలి - పవన్, హరిత - హరీష్, సోనియా సింగ్ - సిద్ధు, ప్రియాంక జైన్ - శివ్, శుభశ్రీ - అజయ్, నూకరాజు -ఏంజెల్ ఏషియా, నటరాజ్ మాస్టర్ - నీతూ, మహేష్ బాబు - సాండ్రా, నాని - పింకీ వంటి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న 'BB జోడి 2' ముగిసిన వెంటనే మ్యాడ్ ఫర్ ఇచ్ అదర్ (Mad For Each Other) ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మార్చి మధ్యలో, అంటే సుమారు మార్చి 14 నుంచి ఈ షో టెలికాస్ట్ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ షోలో ఎవరు పాల్గొంటారు? పూర్తి కాన్సెప్ట్ ఏంటీ? ఈ షో ఎలా ఉండబోతుంది? అన్నది తెలుసుకోవాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X