బిగ్ బాస్ ని మించిన షో.. ఒకే విల్లాలో కపుల్స్ అందరూ ..కంటెస్టెంట్స్ ఎవరంటే?
బిగ్‌బాస్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్ స్టార్ (JioHotstar) ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో కొత్త రియాలిటీ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. గతంలో ఎప్పుడు చూడని విధంగా సరికొత్త విధంగా రియాలిటీ గేమ్ షోను ప్లాన్ చేశారు. దాదాపు బిగ్ బాస్ గేమ్ షో తరహాలో రియల్ షో ప్లాన్ చేస్తున్నారు. ఈ షోలో ఒంటరిగా కాకుండా కేవలం జంటలుగా మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ షో కోసం ఎంపికైన కంటెస్టెంట్లు ఒక రిసార్ట్‌లో ఉండాల్సి వస్తుంది. ఇంతకీ ఆ గేమ్ షో ఎంటీ? ఇందులో పాల్గొనే కపుల్స్ ఎవరు? అనే వివరాల్లోకెళ్తే...
ఈ కపుల్ రియాలిటీ షో పేరు 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' (Mad For Each Other Couple Show). ఈ షో పూర్తి స్థాయిలో జంటలపై ఆధారపడిన కాన్సెప్ట్‌తో రూపొందింది. ముఖ్యంగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు , టీవీ సెలబ్రిటీ కపుల్స్ ఇందులో పాల్గొనడం విశేషం. ఈ షోకు ప్రముఖ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ రియాలిటీ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది.

photo courtesy jio hotstar
కాన్సెప్ట్ ఏంటి?
ఈ షోలో మొత్తం 10 సెలబ్రిటీ జంటలు ఒక లగ్జరీ విల్లాలో 10 వారాల పాటు కలిసి ఉండాల్సి ఉంటుంది. బిగ్‌బాస్ తరహాలోనే టాస్కులు, రిలేషన్‌షిప్ టెస్టులు, ఎమోషనల్ ఛాలెంజ్‌లు ఉండనున్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. కంటెస్టెంట్లు ఒంటరిగా కాకుండా జంటలుగా ప్రవేశిస్తారు. పెళ్లైన వారు, లాంగ్‌టర్మ్ రిలేషన్‌లో ఉన్న వారు కలిసి పాల్గొంటారు. ఈ షో ప్రతిరోజూ ఒక గంటపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. టీవీ కంటెంట్‌తో పోలిస్తే కాస్త బోల్డ్, రియలిస్టిక్ కంటెంట్ ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి.
పాల్గొనే జంటలు
తాజా విడుదలైన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోమో ప్రకారం.. ఈ షోలో హరిత-హరీష్ (బిగ్‌బాస్ ఫేమ్), నటరాజ్ మాస్టర్ -నీతు, వాసంతి కృష్ణన్-పవన్ కళ్యాణ్, ప్రియాంక జైన్-శివకుమార్, జబర్దస్త్ నూకరాజు-సోనియా సింగ్, శుభశ్రీ రాయగురు తన భర్తతో పాటు మరికొంతమంది పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. అయితే.. కొందరూ ఇప్పటికే వివాహితులు కాగా, మరికొందరు రిలేషన్‌లో ఉన్న జంటలు కూడా ఉన్నాయి.
ప్రొమో ప్రారంభం శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి.. ఈ ప్రపంచంలో చాలా రకాల రిలేషన్స్ ఉంటాయ్.. కొన్ని ప్రేమతో నడుస్తాయ్.. మరికొన్ని నమ్మకంతో.. ఇంకొన్ని అడ్జస్ట్‌మెంట్స్‌తో.. అంటూ తనదైన స్టైల్ లో షో గురించి వివరించింది. మా రిలేషన్‌షిప్ మొత్తం నమ్మకం మీదే నడుస్తుందని సోనియా సింగ్ తన ప్రియుడు కనిపించారు. మేము చాలా అడ్జస్ట్ అవుతాం.. అదే మా బలం అంటూ ప్రియాంక జైన్ శివకుమార్ చెప్పడం, వాసంతి తన భర్త పవన్ కళ్యాణ్ లు 'నిజం చెప్పాలంటే మేమే బెస్ట్ కపుల్' అని స్టేట్ మెంట్ ఇస్తారు. అన్ని రిలేషన్స్ బయటి నుంచి పర్ఫెక్ట్‌గానే కనిపిస్తాయ్.. కానీ, అని శ్రీముఖి సెలెంట్ కావడంతో డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కపుల్స్ అందరూ కాస్త కంగరూ పడుతారు. ప్రోమోలో ఈ అంశాలు హైలెట్ గా నిలిచాయి.
బిగ్‌బాస్ మాదిరిగానే ఈ షో కూడా రిలేషన్‌షిప్‌లలో నమ్మకం, ప్రేమ, అడ్జస్ట్‌మెంట్స్ వంటి అంశాలను టెస్ట్ చేయబోతోంది. 'ఏ రిలేషన్ బెస్ట్?' అన్న కోణంలో ఈ రియాలిటీ గేమ్ డిజైన్ చేసినట్లు ప్రోమో చెబుతోంది. ముఖ్యంగా ప్రియాంక-శివకుమార్ వంటి జంటలు తమ భవిష్యత్తుపై ఏదైనా ప్రకటన చేస్తారా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఇలా బిగ్‌బాస్ స్టైల్ డ్రామా, కపుల్స్ ఎమోషన్స్ కలయికగా రాబోతున్న 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











