‘నా భార్యతో విడదీయాలని దారుణంగా... ఎంగేజ్‌మెంట్ రోజు అలా ఎస్కేప్’

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోలకు కొదవ లేదు. పలు ఛానెల్స్‌లో ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. వీటిలో బిగ్‌బాస్ టాప్ షోగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. 105 రోజులకు పైగా విభిన్న మనస్తత్వాలు ఉన్న వారిని ఒకే గదిలో ఉంచి వినోదాన్ని అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. తెలుగులో 9 సీజన్ల పాటు బిగ్‌బాస్ అలరించింది. తాజాగా బిగ్‌బాస్ తరహాలో మరో రియాలిటీ షోకు స్టార్ మా ప్లాన్ చేసింది.

అయితే బిగ్‌బాస్ మాదిరిగా సింగిల్స్ పాల్గొనే షో కాదు.. జంటలు పాల్గొనే షో. అది కూడా పెళ్లయిన వారికి మాత్రమే ఎంట్రీ. 10 వారాల పాటు 10 జంటలని ఒక మ్యాన్షన్‌లో ఉంచుతారు. చివరి వరకు ఏ జంట అయితే ఉంటుందో వారే మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో విజేతగా నిలుస్తారు. స్టార్ యాంకర్ శ్రీముఖి ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అలాగే స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, సీనియర్ నటి రాధ, లయలు జడ్జీలుగటా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోలను స్టార్ మా వరుసపెట్టి వదులుతోంది.

Made For Each Other Bigg Boss Fame Vasanthi and Pawan Kalyan Reveal Interesting Details

ఇక మేడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో పాల్గొనే జంటల వివరాల్ని కూడా రివీల్ చేసింది స్టార్ మా. ప్రియాంక జైన్ - శివకుమార్, నూకరాజు - ఆసియా, వాసంతి- పవన్ కళ్యాణ్, జాను - భాను, బ్రిట్టో- సంధ్య, సోనియా - సిద్ధూ, సాండ్రా - మహేశ్, నీతూ- నటరాజ్, హరిత- హరీష్‌, అంజలి - పవన్‌లు ఎంట్రీ ఇచ్చారు. మార్చి 15న ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి- పవన్ కళ్యాణ్ జంట ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

తిరుపతికి చెందిన వాసంతి.. నటనపై ఆసక్తితో తొలుత కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అదృష్టం పరీక్షించుకుంది. ఆ తర్వాత సిరిసిరి మువ్వలు, గోరింటాకు తదితర సీరియల్స్‌తో పాపులర్ అయ్యింది. ఈ దశలో సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన కాలీఫ్లవర్, గేమ్ ఆన్, భువన విజయం తదితర సినిమాల్లోనూ నటించింది. బిగ్‌బాస్ తెలుగులో అవకాశం దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన అందంతో హౌస్‌కి గ్లామర్ తీసుకొచ్చింది. అనంతరం బీబీ జోడీలో తన డ్యాన్సింగ్ స్కిల్స్‌ను బయటపెట్టి ప్రేక్షకులకు షాకిచ్చింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన వాసంతి.. అదే పేరున్న పవన్ కళ్యాణ్ అనే కుర్రాడితో ప్రేమలో పడి పెళ్లి 2024 ఫిబ్రవరి 21న చేసుకుంది. అప్పటి నుంచి భర్తతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న వాసంతి.. తాజాగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో పాల్గొనేందుకు సిద్ధమైంది. నిఖిల్ విజయేంద్ర సింహకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ దంపతులు పాల్గొని కీలక విషయాలు వెల్లడించారు.

పెళ్లి అవ్వగానే వాసంతి నా దగ్గర లేదు. నేను లేచినప్పుడు, పడుకున్నప్పుడు తను నా పక్కన ఉండదు. అది నా జీవితంలో బిగ్ పెయిన్. అప్పుడు బీబీ జోడీ కోసం వెళ్లిపోయింది. పెళ్లయిన తర్వాత ఎంజాయ్‌మెంట్ లేకుండా వెంటనే వర్క్‌లో జాయిన్ అయిపోయింది అని పవన్ తెలిపారు. 15 రోజులకే షూటింగ్‌లోకి వెళ్లిపోయిన పవన్ నాకు అండగా నిలిచారు. పవన్ కానీ.. మా అత్తమ్మ, మావయ్యలు కానీ సపోర్ట్ చేశారని వాసంతి అన్నారు. ఫస్ట్ వన్ ఇయర్ మొత్తం నేనే ఇంట్లో వంట చేసిపెట్టాను.. బీబీ జోడీ చేసేటప్పుడు ఉదయం 2 గంటలకు ఇంటికి తిరిగొచ్చేది. తను వచ్చేసరికి భోజనం రెడీ చేసి పెట్టేవాడిని. నాన్ వెజ్ బాగా వండేవాడిని అని పవన్ అన్నారు.

ఇప్పుడు నా కంటే తనకి జిమ్ ఎక్కువైపోయింది... నాకు టైం ఇవ్వడం లేదని వాసంతి ఆవేదన వ్యక్తం చేసింది. నేను ఫిజికల్‌గా కష్టపడి ఫిట్‌గా ఉన్నానంటే నా భార్య వల్లేనని పవన్ తెలిపారు. మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టడానికి చాలామంది ట్రై చేశారు. తన గురించి నాకు, నా గురించి తనకు చెప్పుడు మాటలు చెప్పేవారు. అది కూడా పెళ్లికి ముందే చాలా మంది ఇలాంటి పనులు చేశారు. చివరికి ఉంగరాలు మార్చుకునే ముందు కూడా కింద ఉన్న కొందరు జాగ్రత్త మరి చూసుకోండి అంటూ గట్టిగట్టిగా అన్న మాటలు నేను చెవులారా విన్నా. అప్పటికే నేనంటే ఏంటో తనకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. 8 నెలలు కలిసి ట్రావెల్ అయ్యాం.. పెళ్లి తర్వాత మూడేళ్లు కలిసే ఉన్నాం. నా గురించి చెప్పడానికి ఏం ఉంటుంది.. జిమ్, ఆఫీస్ ఇదే నా బతుకు అని పవన్ పేర్కొన్నారు. ప్రస్తుతం వీరిద్దరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వాసంతి - పవన్ మధ్య పుల్లలు పెట్టడానికి ప్రయత్నించింది ఎవరు? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: bigg boss vasanthi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X