మానసిక మానభంగమా? కౌశల్‌ను బ్లేమ్ చేయొద్దు: గీత మాధురిపై మాధవి లత
Recommended Video

చర్చించడం, ప్రశ్నించడం, ఫైట్ చేయడం మానసిక అత్యాచారం కాదు. మానసిక అత్యాచారం అనే పదాన్ని చాలా విలువతో ఉపయోగించాలి. అమ్మాయిల మీద జరిగే సెక్సువల్ హరాస్మెంట్, అమ్మాయిలను నిజంగా మానసికంగా మానభంగం చేసే సిచ్యువేషన్స్‌లో ఇలాంటి వర్డ్స్ ఉపయోగిస్తారు. నేను చాలా సార్లు చెప్పాను అమ్మాయిల మీద ఇలాంటివి ఉన్నాయని. బిగ్‌బాస్ ఇంట్లో గీత మాధురి దయచేసి ఇలాంటి పదాలు మళ్లీ మళ్లీ వాటం ఇకనైనా ఆపాలి అంటూ.... హీరోయిన్ మాధవిలత ఫైర్ అయ్యారు.

కౌశల్ నుండి నువ్వు సేఫ్‌గా ఉన్నావు కదా..
బయట అమ్మాయిల మీద నిజంగా అన్యాయాలు జరుగుతున్నాయి. నువ్వు కౌశల్ నుండి చాలా సేఫ్‌గా ఉన్నావు. అమ్మాయి. దయచేసి అలాంటి పదాలు వాడొద్దు. సెక్యూర్‌గా ఉన్నపుడు ఏ అమ్మాయి ఇలాంటి వర్డ్స్ వాడకూడదు... అని మాధవి లత సూచించారు.

ఇదేమైనా కామెడీనా?
బిగ్ బాస్ నిర్వాహకులు కూడా హౌస్‌లో ఇలాంటి పదాలు వాడే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది కామెడీ వర్డ్ కాదు. ఇలాంటి వాటి విషయంలో వేలాకోలం చేయడమంటే నాకు అసహ్యం.

ప్రేమ పేరుతో మోసం చేసినపుడు
ప్రేమ పేరుతో అమ్మాయిలను వాడుకుని మోసం చేయడం కూడా ఎమోషనల్ అత్యాచారమే. గేమ్ షోలో నిజంగా గీతాని అలా చేసి ఉంటే తప్పు కానీ అలాంటి దేమీ జరుగలేదు. సిల్లీ కారణాలతో అలాంటి వర్డ్స్ ఉపయోగించవద్దు... అని మాధవి లత తెలిపారు.

అమ్మాయిలు నిజంగా సఫర్ అవుతున్నారు
చాలా మంది అమ్మాయిలు నిజంగా సఫర్ అవుతున్న విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ‘మానసిక మానభంగం' అనే పదం ఎక్కడ వాడాలో తెలుసుకోండి... అంటూ మాధవి లతన తన సోషల్ మీడియా పేజీ ద్వారా గీతా మాధురికి క్లాస్ పీకింది.


Click it and Unblock the Notifications











