కౌశల్ పొజిషన్‌లో నేనుంటే ఒక్కొక్కరిని చితక్కొట్టేదాన్ని.. కుట్రతో ఎలిమినేట్ చేయాలని.. మాధవీలత!

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. కొన్ని రోజుల వరకు చాలా సహనం పాటించిన కౌశల్ కూడా కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీనితో హౌస్ లో విజేత ఎవరనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం ఫైనల్స్ లో స్థానం కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. బిగ్ బాస్ 2 పై ఆడియన్స్ లోనే కాక సెలెబ్రిటీలలో కూడా ఆసక్తి నెలకొంది. హౌస్ లో జరుగుతున్న పరిణామాలపై నటి మాధవి లత స్పందించింది. కౌశల్ కు మద్దత్తు తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 102 Highlights
గొడవ పెట్టుకుంటే

గొడవ పెట్టుకుంటే

మాధవిలతా మాట్లాడుతూ.. గొడవ పెట్టుకునే సమయంలో కానీ, ప్రశ్నించే సమయంలో కానీ ఒక్కొక్కరుగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి శాంతంగా మాట్లాడుతారు. కానీ కౌశల్ ఒక్కడిని చేసి మిగిలిన ఐదుగురు ఒక్కసారిగా అతడిపై పడి గొడవ క్రియేట్ చేశారు. అలాంటి సమయంలో ఎవరైనా సహనం కోల్పోతారని మాధవీలత తెలిపింది.

నేనైతే చితక్కొట్టేదాన్ని

నేనైతే చితక్కొట్టేదాన్ని

అందరిలో ఎమోషన్స్ ఉంటాయి. హద్దులు దాటినా సమయంలో మనలో దాగున్న ఎమోషన్స్ బయటకు వస్తాయి. సాధారణంగా ఆడవారికి సహనం ఎక్కువని అంటారు. కౌశల్ కు అంతసహనం ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం కావడంలేదు. అతడి స్థానంలో నేనుంటే హౌస్ లో ఒక్కొక్కరిని చితక్కొట్టేదాన్ని అని మాధవిలతా అభిప్రాయం పడింది. కౌశల్ సహనానికి బాహుబలిలో దండాలయ్యా సాంగ్ వేయాలి.

అతడి ఏడుపు కామెడీ

అతడి ఏడుపు కామెడీ

కౌశల్ కుక్క అని అనగానే రోల్ రైడ వెక్కి వెక్కి ఏడ్చాడు. అతడి ఏడుపు కామెడీగా అనిపించింది. కోపం వచ్చినప్పుడు ఎవరైనా కుక్కని అని, పంది అని, రాబందులా ఉన్నావు అని సహజంగానే తిడుతుంటారు. అంత మాత్రానికే రోల్ రైడకి ఏడుపు ఎందుకు వచ్చిందో అర్థం కావడంలేదు.

 ఆ పరిస్థితి వేరు

ఆ పరిస్థితి వేరు

కౌశల్ ఏడ్చినప్పుడు నేను ఓదార్చా అని రోల్ రైడ అంటున్నాడు. ఇక్కడ కౌశల్ ఏడ్చిన సందర్భం వేరు, రోల్ రైడ ఏడ్చిన సందర్భం వేరు. కౌశల్ ఫ్యామిలీ ఎమోషన్ తో ఏడ్చాడు. అప్పుడు ఎవరైనా ఓదారుస్తారు. నీకు కౌశల్ కు మధ్య గొడవ జరిగి ఏడిస్తే కౌశల్ వచ్చి నిన్ను ఓదార్చాలా అని మాధవీలత ప్రశ్నించింది.

గేమ్ ఆడింది కౌశల్ ఒక్కడే

గేమ్ ఆడింది కౌశల్ ఒక్కడే

ఇసుక టాస్క్ ని గమనించా. టాస్క్ మొత్తం గేమ్ సరిగ్గా ఆడింది కౌశల్ మాత్రమే. దీప్తి, గీత మాధురి సైలెంట్ గా కూర్చున్నారు. తనీష్, సామ్రాట్ రోల్ కి సపోర్ట్ చేయడంతో సరిపెట్టుకున్నారు. కౌశల్ ఒక్కడే గేమ్ సరిగ్గా ఆడాడని మాధవిలత తెలిపింది. వాళ్ళ తీరు చూస్తుంటే నాకు బూతులు వస్తున్నాయి అంటూ మాధవి లతా ఘాటుగా స్పందించింది.

 కుట్రతో ఎలిమినేట్ చేయాలని

కుట్రతో ఎలిమినేట్ చేయాలని

కౌశల్ ఎమోషన్ ని ఏదో విధంగా రెచ్చగొట్టి కుట్రతో అతడిని ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు అర్థం అవుతోందని మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. హౌస్ లో ఐదుగురు కలసిపోయారు. కౌశల్ ఒక్కడే మిగిలిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X