వీజే సన్నీకి మాధవీలత వార్నింగ్.. అమ్మాయిలు ఎన్ని మాటలు పడ్డారు? కనిపిస్తే చెంప పగలగొడతా అంటూ ఫైర్!

ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 ఘనంగా ముగిసింది కానీ ఇప్పటికీ కంటెస్టెంట్ల హడావిడి మాత్రం కొనసాగుతూ ఉంది. సీజన్ విన్నర్ గా నిలిచినా సన్నీ మాత్రమే కాక టాప్ 5 కంటెస్టెంట్స్ గా ఉన్న సిరి, షన్ను, శ్రీ రామ్, మానస్ లు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారారు. అయితే సన్నీ మాత్రం తనకు అందంగా నిలబడ్డ ఫ్యాన్స్ ను కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అతని మీద నటి మాధవీ లత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

హాట్ టాపిక్ గా

హాట్ టాపిక్ గా

బిగ్ బాస్ టాప్ 5 లో నిలిచిన సన్నీ, షణ్ముఖ్, శ్రీ రామ్, మానస్, సిరి వరుసగా మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ, గెట్ టు గెదర్, ఫ్యాన్స్ మీట్, పార్టీ అంటూ ఏదోరకంగా ట్రెండింగ్ లో ఉంటున్నారు. వీరి క్రేజ్ ను వాడుకోవడానికి వ్యాపార సంస్థలు సహా, సినిమా వాళ్ళు కూడా ప్రమోట్ చేయించు కుంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ విన్నర్ సన్నీ కూడా తెలుగు మీడియా ఛానెల్స్ లో లైవ్ సెషన్స్ కి వెళ్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

తీవ్ర విమర్శలు కూ

తీవ్ర విమర్శలు కూ

అయితే సన్నీ మీద కొన్ని తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే పెద్ద ఛానెల్స్ కి టైం ఇస్తూ.. చిన్న ఛానెల్స్, యూట్యూబ్, సోషల్ మీడియాకి అస్సలు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదని, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు.. అతనికి అండగా నిలబడ్డ ఫ్యాన్స్ ని అయితే అస్సలు పట్టించుకోవటం లేదని.. సన్నీకి ఓట్లు వేయమని అడిగిన ఎన్నో యూట్యూబ్ ఛానెల్స్ కి కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు.

కష్టాన్ని వదిలేసి

కష్టాన్ని వదిలేసి

అయితే ఈ క్రమంలో సన్నీకి ముందు నుంచి వన్ సైడ్ సపోర్ట్ చేసిన హీరోయిన్ మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేసింది. విన్నర్ అవ్వగానే సన్నీకి కళ్ళు నెత్తిమీదకి ఎక్కాయని, సన్నీని తప్పుదోవ పట్టిస్తున్న పీఆర్ చెంప పగలకొడతానని కూడా ఆమె సంచలన కామెంట్స్ చేసింది. సన్నీ కోసం సపోర్ట్‌ చేసిన ఫ్యాన్‌ పేజీలను వదిలేసి, రివ్యూయర్లను వదిలేసి, ఓట్లు వేయడానికి వాళ్ళు పడ్డ కష్టాన్ని వదిలేసి, ఓట్లు వేయండి అని మొత్తుకున్న వాళ్లను వదిలేసి బడా టీవీ ఛానళ్లకు.. ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్‌ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడని విమర్శించింది.

కళ్లు నెత్తికెక్కాయా?

కళ్లు నెత్తికెక్కాయా?

కనీసం తనకు ఓట్లేయమని చెప్పనివాళ్లకు, ఓట్లు వేసిన వాళ్ళకి అసలు ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదన్న ఆమె బిగ్‌బాస్‌ షోలో సన్నీ నిజాయితీ మెచ్చి ఎంత ప్రమోట్‌ చేశానో.. ఇప్పుడు తప్పు చేస్తున్న సన్నీని అంతే విమర్శిస్తానని, సన్నీ తప్పు చేస్తున్నాడు. కృతజ్ఞతాభావం లేని వాళ్లంటే నాకు చిరాకు. తన గురించి గొప్పగా చెప్పుకొచ్చిన యూట్యూబ్‌ రివ్యూయర్ల పేర్లయినా మెన్షన్‌ చేశాడా? నీ తనకు తెలీకపోతే అతడి ఫ్రెండ్స్‌కి తెలీదా? కళ్లు నెత్తికెక్కాయా? అని ఆమె ప్రశ్నించింది.

తిక్కలేస్తే తాట తీసి ఆరేస్తా

తిక్కలేస్తే తాట తీసి ఆరేస్తా

అసలు తొలి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? నీ ఫ్యాన్‌ పేజెస్‌ మెయింటెన్‌ చేసిన వాళ్లను కలవాలి, నీకోసం మామూలు అమ్మాయిలు ఎన్ని మాటలు పడ్డారు? నీ విజయం వాళ్లదని ఫీలయ్యారు. నీ పీఆర్‌ ఫ్రెండ్‌ కనిపిస్తే చెంప పగలగొడతాను. నచ్చితే నెత్తిన పెట్టుకుంటాను, తిక్కలేస్తే తాట తీసి ఆరేస్తా' అని వార్నింగ్‌ ఇచ్చింది మాధవీలత. మరి దీనిపై సన్నీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X