For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిగ్‌బాస్‌లో చేయి కోసుకొని సెలబ్రిటీ ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..

|

బిగ్‌బాస్ తమిళ రియాలిటీ గేమ్ షో మరోసారి రచ్చ రచ్చగా మారింది. ఇంటిలోని సెలబ్రిటీ మధుమిత ఏకంగా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించడం సంచలనం రేపింది. అంతేకాకుండా బిగ్‌బాస్ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసింది. అలాగే సెలబ్రిటీల తీరుపై మండిపడింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడి పలు సంచలన విషయాలు వెల్లడించింది. తన ఆత్మహత్యాయత్నానికి మధుమిత వెల్లడించిన కారణాలు ఇవే..

టాస్క్ తెచ్చిన లొల్లి

టాస్క్ తెచ్చిన లొల్లి

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆగస్టు మూడో వారంలో సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ప్రకారం ఏదైనా విషయంపై స్పష్టంగా అభిప్రాయాలను వెల్లడించాలన్నారు. దాంతో నేను చెన్నైలోని తాగునీటి సమస్య గురించి మాట్లాడాను. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నా తమిళనాడు ఆ రాష్ట్రం నీటిని ఇవ్వడం లేదని కవితరూపంలో వెల్లడించాను. నేను మాట్లాడిన అంశం రాజకీయం అంటూ సభ్యులు వ్యతిరేకించారు. దర్శకుడు చేరన్, నటి కస్తూరి తప్ప అందరూ తన అభిప్రాయాన్ని తప్పుపట్టారు అని మధుమిత తెలిపారు.

తమిళుల సమస్యపై

తమిళుల సమస్యపై

తమిళులకు ఇబ్బందిగా మారిన తాగునీటి సమస్య గురించి మాట్లాడితే తనను తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ బిగ్‌బాస్‌కు ఓ లేఖ కూడా పంపారు. ఆ లేఖలో రాజకీయాలు మాట్లాడవద్దని పేర్కొన్నారు అని మధుమిత చెప్పింది. తన అభిప్రాయాన్ని ఎగతాళి చేశారు. ఓ గ్యాంగ్‌గా మారి తనను ర్యాగింగ్‌ చేసినంత పనిచేశారు అని మధుమిత పేర్కొన్నారు.

మానసికంగా హింసించారు

మానసికంగా హింసించారు

తమిళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను షో ద్వారా ఎలుగెత్తినందుకు తనను అవమానించారు. సూటి పోటి మాటలతో మానసికంగా హింసించారు. అందుకే తాను విసిగిపోయి చేయి కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డేందుకు ప్రయత్నించాను. ఇంట్లో చేరన్, కస్తూరి మినహా మరో ఎనిమిది మంది సెలబ్రిటీల తీరును తమిళ ప్రజలు చూశారు. వారిని తమిళులు ఎప్పుడూ గెలువనీయరు.. క్షమించరు అని మధుమిత చెప్పారు.

కమల్‌ తీరును తప్పుపట్టిన మధుమిత

కమల్‌ తీరును తప్పుపట్టిన మధుమిత

తమిళుల తాగునీటి సమస్యపై బిగ్‌బాస్‌లో చెలరేగిన వివాదంపై హోస్ట్ కమల్ హాసన్ పెదవి విప్పకపోవడంపై తప్పుపట్టింది. ఇంతటి తీవ్ర వివాదంపై స్పందించకపోవడం విచారకరం. తాగునీటి సమస్య ఎంత తీవ్రమైందో కమల్ తెలిసినా మాట్లాడకపోవడం దారుణం అన్నారు. కమల్ హాసన్ నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు. కానీ ఆయన అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అని మధుమిత అభిప్రాయపడ్డారు.

బిగ్‌బాస్‌పై ఫైర్

బిగ్‌బాస్‌పై ఫైర్

ఇక తమిళ బిగ్‌బాస్ నిర్వాహకులపై మధుమిత మండిపడ్డారు. తాను షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు చెల్లించాల్సిన పారితోషికాన్ని ఇవ్వలేదని ఆరోపణలు చేసింది. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌ను ఇవ్వకుండా తనపై కక్ష కట్టారు. ఈ విషయంపై త్వరలోనే సంచలన రేపే విధంగా చర్యలు తీసుకొంటాను అని మధుమిత ఫైర్ అయ్యారు.

English summary
Madhumitha, who was one among the strongest contestants of Bigg Boss Tamil 3, had a rather forgettable exit from the house since her attempt to harm herself landed her in trouble. Madhumitha's fans were shocked to see the bandage around her forearm during the time of her exit from the Bigg Boss house and now, they are left even more shocked to see a picture, which has been doing the rounds on social media. A picture of Madhumitha and the wrist area on which she had tried to inflict an injury, has been doing the rounds on social media.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more