Just In
Don't Miss!
- News
యూఎస్ క్యాపిటల్ కాంప్లెక్స్ తాత్కాలిక మూసివేత: జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి రెండ్రోజుల ముందు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సినీ గేయరచయిత చంద్రబోస్‌కు కాళోజీ స్మారక పురస్కారం
హైదరాబాద్: తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడెమీ సంయుక్తంగా ప్రతి సంవత్సరం అందించే మహాకవి కాళోజీ స్మారక పురస్కారం 2016 సంవత్సరానికిగాను ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ను ఎంపిక చేసినట్లు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడెమీ వ్యవస్థాపకులు దర్శక నిర్మాత నాగబాల సురేష్ తెలిపారు.
గత సంవత్సరం ఈ అవార్డును సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజాకు అందించినట్లు చెప్పారు. ఈ నెల 14న రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, పరచూరి గోపాలకృష్ణతో పాటు పలువురు అధికారులు, కవులు, సాహితీవేత్తలు పాల్గొంటారని సురేష్ వెల్లడించారు.

ఈ పురస్కారం క్రింద ప్రశంసాపత్రము, జ్ఞాపిక, శాలువాతో పాటు రూ. 10,116 నగదు అందిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం ఈ అవార్డును సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి అందించామని, 2014లో జె.కె.భారవి ఈ అవార్డు అందుకున్నారని సురేష్ వెల్లడించారు.