twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ గేయరచయిత చంద్ర‌బోస్‌కు కాళోజీ స్మార‌క పుర‌స్కారం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడెమీ సంయుక్తంగా ప్రతి సంవత్సరం అందించే మహాకవి కాళోజీ స్మారక పురస్కారం 2016 సంవత్సరానికిగాను ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడెమీ వ్య‌వ‌స్థాప‌కులు ద‌ర్శ‌క నిర్మాత నాగ‌బాల సురేష్ తెలిపారు.

    గ‌త సంవ‌త్స‌రం ఈ అవార్డును సినీ గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజాకు అందించిన‌ట్లు చెప్పారు. ఈ నెల 14న ర‌వీంద్ర భార‌తిలో జ‌రిగే కార్య‌క్ర‌మంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి, ప‌ర‌చూరి గోపాల‌కృష్ణ‌తో పాటు ప‌లువురు అధికారులు, క‌వులు, సాహితీవేత్త‌లు పాల్గొంటార‌ని సురేష్ వెల్ల‌డించారు.

    Maha Kavi Kaaloji memorial award for Chandrabose

    ఈ పురస్కారం క్రింద ప్రశంసాపత్రము, జ్ఞాపిక, శాలువాతో పాటు రూ. 10,116 నగదు అందిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం ఈ అవార్డును సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి అందించామని, 2014లో జె.కె.భారవి ఈ అవార్డు అందుకున్నారని సురేష్ వెల్లడించారు.

    English summary
    Telugu Television Writers' Association and Bharath Cultural Academy have jointly conferred Mahakavi Kaloji Smaraka Puraskaram on Tollywood's ace lyricist Sri Kanukuntla Chandrabose. This was announced by the president of the said bodies, Nagabala Suresh Kumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X