Naga Panchami: మోక్షకు తప్పిన ప్రాణగండం.. కరాళీపై శివాలెత్తిన పంచమి.. ప్రాణాలు తీస్తుందా?
నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో దూసుకెళ్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సినిమాలకు ఏమాత్రం మించకుండా ట్విస్ట్ లు ఇస్తూ పిచ్చెక్కిస్తోంది. ఒక్కరోజు ఎపిసోడ్ కూడా మిస్ అవకుండా చూసేలా చేస్తున్న ఈ సీరియల్ టీం నిర్వాహకులు.. సఫలం అవుతున్నారు. ముఖ్యంగా ఈసారి పౌర్ణమికి కూడా మోక్ష బతికాడు. పంచమి పాము భారీ నుంచి అతడిని మహా మృత్యుంజయ యాగం కాపాడింది. అలాగే పంచమి కూడా తన యథా రూపానికి వచ్చేసింది. అయితే మోక్ష లోచేలోపే.. కరాళీ వచ్చి తన మంత్ర శక్తితో అతడిని వశం చేసుకునే ప్రయత్నం చేసింది.
తన వశీకరణ శక్తిని అతడిలోకి పంపించి.. తన వెంట తీసుకెళ్లింది. అయితే మధ్యలోనే అది గుర్తించిన పంచమి... కరాళీపై ఫైర్ అయింది. శివంగిలా ఆమెతో ఫైట్ చేసింది. ఓ పెద్ద కర్ర చేత పట్టుకుని వచ్చి ఆమెపై దాడి చేసింది. పంచమి కట్టలు తెంచుకున్న ఆవేశం చూస్తుంటే... కచ్చితంగా కరాళీని చంపే వరకూ వదిలేలా కనిపింట్లేదు. అలాగే ఓ పెద్ద బండరాయిని తీసుకొచ్చి.. కరాళీ తలపై కొట్టి చంపబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా రేపటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు.

ఈ రోజుటి ఎపిసోడ్ లో ముందుగా.. ఫణీంద్ర, ఇద్దరు నాగులను చూపించారు. మహా మృత్యుంజయ యాగాన్ని చెడగొట్టేందుకు వాళ్లు ప్రయత్నాలు చేస్తూ కనిపిస్తారు. అయితే దీన్ని ఆపలేకపోతున్నామని.. మరో ఇద్దరు నాగలు తాము నాగ దేవత ఆగ్రహానికి గురై చావడం కంటే ఇక్కడే మంటల్లో దూకి చావడం నయం అనుకుంటారు. కానీ ఫణీంద్ర మాత్రం యాగం పూర్తయ్యే వరకు ఇక్కడే వేచి చూద్దాం.. ఏ చిన్న అవకాశం వచ్చిన దాన్ని నాశనం చేద్దామంటూ చెబుతాడు. అందుకు వాళ్లు కూడా ఓకే చెబుతారు.
ఇక ఆ తర్వాత మోక్ష, కరాళీలు కలిసి పంచమిని వెతుకుతూ వెళ్తారు. ఆమె ఉన్న చోటుకు చేరుకుంటారు. అయితే పంచమి ఐదు తలల పాముగా మారడం చూసి షాకవుతారు. కానీ ఆ పామును బంధించేందుకు కరాళీ చాలానే ప్రయత్నాలు చేస్తుంది. కానీ అవేవీ ఫలించవు. పంచమి పాము వాళ్లను చంపేందుకు దూసుకు రాగా.. ఇద్దరూ పారిపోతారు. మధ్యలోకి వెళ్లాకా.. నువ్వు వెళ్లిపో మోక్ష.. పంచమి నిన్ను చంపేందుకే వస్తుందని అంటుంది. లేదు నువ్వు కూడా రా అంటే నేను బంధించే ప్రయత్నం చేస్తా నువ్వెళ్లు అనగానే వెళ్లిపోతాడు. ఈక్రమంలోనే కరాళీ పంచమిని బంధించే ప్రయత్నం చేయగా.. పంచమి పాము ఆమెను ఫుల్ హింసిస్తుంది. తోకతో చుట్టేసి చెట్లకు కొడుతుంది.

అయితే ఆ సమయంలో కరాళీ మహాకాళిని బతికించమని కోరగా... ఆ తల్లే ఈమెను కాపాడుతుంది. ఇక ఆ తర్వాత పంచమి మోక్షను వెతుక్కుంటూ వెళ్లి దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు మహా మృత్యుంజయ యాగం చేస్తూ సప్త రుషులు కనిపిస్తారు. మీరు ఈ పంచ ద్రవ్యాలు స్వామి వారికి సమర్పిస్తే యాగం పూర్తవుతుందని రుషులు చెప్పగా.. కుటుంబ సభ్యులు అంతా కలిసి యాగాన్ని పూర్తి చేస్తారు. ఇక ఆ తర్వాత సప్త రుషులు అంతా కలిసి సుబ్బు వద్దకు వెళ్తారు. మీరు చెప్పడం వల్లే ఈ యాగం విజయవంతంగా పూర్తి చేశామని అంటారు. అయితే దానికి సుబ్బు వారికి థాంక్స్ చెబుతాడు. మరోసారి పంచమి జన్మ గురించి వారికి వివరిస్తాడు. ఆ తర్వా సప్త రుషులు స్వామి వారికి దండం పెట్టి వెళ్లిపోతారు.
ఇదయ్యాకా పంచమి పాము మోక్షపై దాడి చేయబోతుంది. ఈక్రమంలోనే ఓ చెట్టు వద్ద ఉండగా.. తనలోని విషాన్ని శక్తి రూపంలో అతడిపైకి చిమ్ముతుంది. కానీ అప్పుడే శివయ్య కృపతో అతడికి చెట్టు దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోతాడు. పంచమి పాము చిమ్మని విషం అంతా ఆ చెట్టుపై పడుతుంది. ఇలా మోక్ష గండం నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత పంచమి పాము కూడా పడిపోతుంది. తర్వాత ఆమె కూడా పడిపోతుంది.


Click it and Unblock the Notifications











