‘ద్రౌపది’ పాత్రకు హీరోయిన్ దొరికింది...
ముంబై : భారీ ప్రొడక్షన్స్ ప్రారంభించేటప్పుడు ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా మహాభారతం వంటి ఎపిక్స్ తీసేటప్పుడు అందరి దృష్టీ వాటిపై ఉంటుంది కాబట్టి కాస్టింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ద పెడ్తూంటాయి ప్రొడక్షన్ కంపెనీలు. తాజాగా 'స్వస్తిక్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'మహాభారత్' టీవీ సీరియల్ నిర్మిస్తున్నారు. ఈ సీరియల్ లో 'ద్రౌపది'గా నటించేందుకు ప్రముఖ మోడల్ పూజా శర్మ ఎంపికైంది.
అత్యంత కీలకమైన ద్రౌపది పాత్ర కోసం ఈ సీరియల్ నిర్మాతలు సుదీర్ఘ కాలంగా చేస్తున్న అనే్వషణ ఎట్టకేలకు ఫలించింది. యువికా చౌదరి, అనుప్రియ కపూర్ వంటి ఎందరో యువ నటీమణులు ద్రౌపది పాత్ర కోసం ఎంతో ప్రయత్నించారు. నిర్మాతలు కూడా తగిన నటి కోసం నెలల తరబడి అనే్వషించి చివరకు పూజా శర్మను ఎంపిక చేశారు. ఢిల్లీకి చెందిన ఈమె మోడలింగ్ చేస్తూనే, సినీ నటిగా తన సత్తా చాటుకునేందుకు ఇటీవలే ముంబై చేరుకుంది.

మోడలింగ్‌తో పాటు కొన్ని సినిమాల్లో నటించిన అనుభవం ఉన్నందున పూజా శర్మను ద్రౌపది పాత్ర వరించింది. ద్రౌపది పాత్రకు తగ్గట్లు ఆకర్షణీయమైన దుస్తులు, నగలను ఎంపిక చేసే బాధ్యతలను భాను అథైయా (ఆస్కార్ అవార్డు విజేత), నిధి యషా వంటి ప్రముఖ సాంకేతిక నిపుణులకు నిర్మాతలు అప్పగించారు.
పూజా శర్మ ధరించే నగలను బెంగాల్, గుజరాత్, కొన్ని దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. 'మహాభారత్'పై వీక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నందున వారిని మెప్పించే విధంగా పూజా శర్మ నటించగలదని నిర్మాతలు భావిస్తున్నారు. 'స్టార్ ప్లస్' చానల్‌లో ఈ సీరియల్ ప్రసారమవుతుందని నిర్మాతలు ప్రకటించారు. సెప్టెంబర్ 16, సెప్టెంబర్ 2013 నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఈ విషయాన్ని పూజ శర్మ ఖరారు చేసింది.


Click it and Unblock the Notifications











