Naga Panchami 7th February: కరాళీని భయపెడ్తున్న మహంకాళి.. మోక్ష, మేఘనల పెళ్లి జరుగుతుందా?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. ఎవరూ ఊహించని రీతిలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ చిత్ర పాము ఫణీంద్రగా మారడం, చిత్ర చూస్తోందని తెలిసి మళ్లీ పాముగా మారడాన్ని చూపిస్తారు. ఇదంతా చూసిన చిత్ర భయంతో వణికిపోతుంది. పాము పాము అని అరుస్తూనే.. సోఫాపైకి ఎక్కగా పాము కూడా అక్కడికే వస్తుంది. ఆ తర్వాత చిత్ర దాన్నుంచి తప్పించుకుని ఇంట్లోకి పరుగులు పెడుతుంది. ఫుల్ గా కేకలు వేస్తుంది. పాము, పాము అంటూ అరుస్తుంది.

పాము మనిషిగా, మనిషి పాముగా మారడం చూసాను అంటూ జ్వాలకు చెప్పగా... అంతేగా నేను ఎప్పుడో చూశాను భయపడకు అంటుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అంతా పరిగెట్టుకు వస్తారు. ఏమైంది, ఏమైంది అనగా పాము మనిషిగా, మనిషి పాముగా మారడం చూశానని వివరిస్తుంది. ఇంతలోనే అక్కడకు వైదేహి వచ్చి ఆ దరిద్రం మళ్లీ వచ్చిందిగా.. ఇలాంటివే జరుగుతాయని పంచమిపై కోప్పడుతుంది. పంచమి, మోక్షలు ఇంకా ఎంత సేపు మాట్లాడుకుంటారు రమ్మను అంటూ ఫైర్ అవుతుంది. శబరి వద్దని చెప్పినా వినకుండా వాదిస్తూనే ఉంటుంది.

Mahankali Cautions Karali on Naga Panchami February 7th Episode

ఆ తర్వాత అక్కడకు పంచమి, మోక్షలు వస్తారు. నేను వెళ్లిపోతాను.. మోక్షకు మరో పెళ్లి చేయడం తనకు ఇష్టమేనని పంచమి అంటుంది. అది విన్న శబరి అదేంటమ్మా.. మీ జీవితాలే నాశనం అవుతాయని అనగా.. లేదు బామ్మా ఈ పెళ్లి వల్లే మా జీవితాలు బాగవుతాయని పంచమి అంటుంది. తాను వెళ్లిపోతానని అంటుంది. వెంటనే మోక్ష.. మా పెళ్లి అయ్యే వరకు నీవు ఇక్కడే ఉండాలి పంచమి, అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలని చెబుతాడు. అలా అయితేనే తాను ఈ పెళ్లి చేసుకుంటానని లేకపోతే చేసుకోనని అంటాడు. దీనికి పంచమి ఒప్పుకుంటుంది.

పంచమి పెళ్లి అయ్యే వరకు ఉంటానని వివరిస్తుంది. కానీ వైదేహి మాత్రం శుభమా అని పెళ్లి చేస్తుంటే మళ్లీ ఈ దరిద్రం ఇక్కడ ఎందుకు అని అంటుంది. అలాగే ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి పంపించండి అని పేర్కొంటుంది. నేను డబ్బుల కోసం ఈ పెళ్లి చేసుకోలేదని.. మోక్ష పెళ్లి జరిపిస్తానని వివరిస్తుంది. ఇక ఆ తర్వాత మేఘన మహాంకాళిని ఆవాహనం చేసుకుంటుంది. ప్రత్యక్షం అయిన అమ్మవారు... కరాళీ నువ్వు అనుకున్నవి అన్నీ జరగవు అని చెబుతుంది. నువ్వు మంచి పనులు తలపెడితేనే దైవం సహకరిస్తుందని.. లేదంటే సహకరించదని చెబుతుంది.

Mahankali Cautions Karali on Naga Panchami February 7th Episode

సృష్టికి నష్టం తలపెట్టే పనులు జరగవు అంటూ కరాళీని హెచ్చరిస్తుంది. నేను మహామంత్రగత్తెను కావాలనుకుంటున్నానని కరాళీ చెప్పగా... ఇలాంటి పనులకు దైవం తోడుగా ఉండదని మరోసారి మహాంకాళి వివరిస్తుంది. దీంతో మేఘన కంగారు పడుతుంది. ఇక తర్వాత మేఘన తన అన్న ఆత్మని రప్పించి మహాంకాళి తనను భయపెడుతుందని.. నంబూద్రీ సాయం కావాలని కోరుతుంది. అందుకు నంబూద్రీ సాయం చేస్తానని చెబుతాడు. ఇక ఆ తర్వాత పంచమి ఓ చోట ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటే మోక్ష అక్కడకు వెళ్తాడు. నీకు నా మీద ఉన్న ప్రేమ.. నా పెళ్లిని జరగనివ్వదు పంచమి.. అని అంటాడు.

Mahankali Cautions Karali on Naga Panchami February 7th Episode

నువ్వు ప్రేమను, బాధను ఆపుకుంటూ మా పెళ్లి జరిపించాలనుకుంటున్నావు కానీ చివరి నిమిషంలో అయినా సరే నువ్వే నీ చేతులతో ఆ పెళ్లి ఆపేస్తావని అంటాడు. మనకు పిల్లలు వద్దు, ఏం వద్దు చివరి వరకు ఒకరికొకరు తోడుగా ఉందామని అంటుంది. మనం మధ్యలో కలిశాం.. మధ్యోలేనే నేను వెళ్లిపోతాను... మీకు పెళ్లి అయితే అన్నీ మర్చిపోతారు అంటూ పంచమి మోక్షతో చెప్పగా ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X