మహా సముద్రం, ఆరడుగుల బుల్లెట్.. టీవీల్లో కూడా అంతే దారుణం.. TRP ఎంతంటే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు థియేటర్స్ లో అంతగా ఆడకపోయినా కూడా టీవీలో మాత్రం మంచి టిఆర్పీ అందుకుంటున్నాయి. కొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలకు కూడా బుల్లితెర ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండడం విశేషం. ఇక కొన్ని సినిమాలలు పేరుకు మాత్రమే భారీ స్థాయిలో విడుదల అవుతున్నాయి. కానీ బాక్సాఫీస్ మాత్రం కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి తీసుకు రావడం లేదు. ఇక అదే తరహాలో ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు బుల్లితెరపై కూడా దారుణమైన టిఆర్పీని అందుకోవడం ఆశ్చర్యం.

అందులో మొదట తలైవి సినిమా గురించి చెప్పుకోవాలి. బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న కంగనా రనౌత్ తన కెరీర్ లో మొదటి సారి ఒక భారీ ప్రయోగం చేసి తలైవి సినిమాను తెరపైకి తీసుకువచ్చింది. ఆ సినిమా కోసం ఆమె చాలా హార్డ్ వర్క్ చేసినట్లు చాలా క్లారిటీ గా అర్థమైంది. ఈ సినిమాకి ఏఎల్. విజయ్ దర్శకత్వం వహించాడు.

mahasamudram aaradugula bullet movies latest TRP ratings

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది. కేవలం హిందీ తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా భారీగానే విడుదల చేశారు. కానీ దారుణమైన కలెక్షన్స్ అందుకుంది. కనీసం తమిళంలో కూడా క్లిక్కవ్వలేదు. ఇక బుల్లితెరపై కూడా అనుకున్నంతగా TRP ఏమీ రాలేదు. ఈటీవీ లో ఇటీవల ప్రసారమైన తలైవి సినిమా 2.51 TRP మాత్రమే అందుకుంది.

గోపీచంద్ ఎంతో సంతోషంగా మొదలుపెట్టిన ఆరడుగుల బుల్లెట్ సినిమా చాలా నిరాశ మిగిల్చింది. ఈ సినిమా 10 ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకొని చాలా ఇబ్బందులు పడింది. ఎట్టకేలకు గత ఏడాది థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమా అనుకున్నంతగా ఏమీ సక్సెస్ కాలేకపోయింది. ఒక విధంగా గోపీచంద్ మార్కెట్ కూడా ఆ సినిమాపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపినట్లు తెలిసింది. మొత్తంగా ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ ఏమీ రాలేదు. ఇక స్టార్ మా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను అందుకుంది. ఇక 2.7 TRP మాత్రమే వచ్చినట్లు సమాచారం.

mahasamudram aaradugula bullet movies latest TRP ratings

ఇక ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఎంతో కష్టపడి దర్శకుడు అజయ్ భూపతి తెరపైకి తీసుకొచ్చిన మహాసముద్రం సినిమా కూడా ఇటీవల జెమిని టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు చేసిన హడావుడికి తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని అందరు అనుకున్నారు. అంతేకాకుండా సిద్ధార్ధ్ చాలా కాలం తర్వాత ఒక డైరెక్ట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా శర్వానంద్ తో కూడా ఈ సినిమాలో కలిసి నటించడం సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. జెమినీ టీవీలో ఇటీవల ప్రసారమైన ఈ సినిమాకు కేవలం 4.46 టిఆర్పీ మాత్రమే దక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X