Guppedantha Manasu May 20th: పగ తీర్చుకునేందుకు వచ్చిన రాజీవ్.. భార్య కాళ్లు పట్టుకున్న శైలేంద్ర, ఆనందంలో అనుప
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో అనుపమ, వసు, మహేంద్ర, మనులు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అయితే జైలు నుంచి వచ్చిన మనుతో మాట్లాడమని వసు అనుమపకు చెబుతుంది. కానీ మను మాత్రం ఆమె మాట్లాడకపోయినా.. ఆమె మనసు మాట్లాడుతోందని అది తనకు వినిపిస్తుందని అంటాడు. తన గుండెకు అనుమప ప్రేమ, ఆవేశం, బాధ, కోపం తెలుస్తాయని.. కానీ ఒకే ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదని అంటాడు. ఆ ప్రశ్న తన తండ్రి ఎవరు అన్నదేనని అంటాడు. తను నోరు తెరిచి చెప్పదని.. నా గుండె చప్పుడుకు అది అర్థం కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. మేడమ్ మీరు నా గురించి వర్రీ అవ్వకుండి.. నేను బానే ఉన్నాను, మీ ఆశీస్సులు ఉన్నంత వరకు బానే ఉంటానని చెప్పుకొస్తాడు.
ఆ తర్వాత వసుతో మాట్లాడుతో.. నాకు ఇంత చేసిన మీకు థాంక్స్ అంటాడు. ఇప్పటి వరకు తనకోసం ఎవరూ ఏదీ చేయలేరని.. కానీ మీరు నాకోసం చేయడాన్ని నేను జీవితాంతం మర్చిపోలేనని అంటాడు. నేనేం చేయలేనని మీ నాన్న చేయడం వల్లే నేను సపోర్టింగ్ గా నిలిచానంటూ వసు అంటుంది. అప్పుడే మహేంద్ర కల్గజేసుకుని నువ్వేం తప్పు మాట్లాడలేదు.. ఆరోజు తప్పిపోయింది.. కానీ మళ్లీ దత్తత కార్యక్రమం జరిపించుకుందామని అంటాడు. కానీ మను మాత్రం మీరు నా తండ్రి స్థానంలోకి రావొద్దంటూ చెప్పుకొస్తాడు. నాక తండ్రి మీద ఎలాంటి ఉద్దేశం ఉందో మీకు తెలుసు.. అందుకే మీరు ఆ స్థానంలోకి రావద్దని అంటాడు. మీలాంటి తండ్రి ఉంటే ఎలాంటి వాడైనా సరే ఏదైనా సాధించగలడని మను అంటాడు. మీరు అలాంటి భరోసా, ధైర్యం ఇస్తారని చెప్పుకొస్తాడు. ఆ తర్వాత మనుకు నచ్చిన వంట చేయమనగా.. అనుపమ వెళ్తుంది.

ఇక ఆ తర్వాత రాజీవ్.. శైలేంద్ర వద్దకు వస్తాడు. నువ్వు అలా పట్టుబడతావని నేను కళలో కూడా అనుకోలేదంటూ శైలేంద్ర చెప్పుకొస్తాడు. నాకంతా తెలిసిపోయిందని.. నువ్వు నాటకాలు ఆపు అంటూ రాజీవ్ చెప్పుకొస్తాడు. మోసగాన్ని, మరో మోసాగాడు మోసం చేయడం ఏంటంటూ ఫైర్ అవుతాడు. ఎండీ పదవి కోసం.. వసును ఎరగా వేసి నన్ను పోలీసులకు పట్టించి మనును బయటకు తీసుకు వచ్చావా అంటూ ఫైర్ అవుతాడు. నువ్వు మిత్ర ద్రోహివని, నా వెనకే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచావని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత చంపేస్తానంటూ గన్ తీసి శైలేంద్రకు గురి పెడతాడు రాజీవ్. ఎండీ పదవిపై ఆశతో మాత్రమే ఇలా చేశానని శైలేంద్ర అనగా.. తప్పైంది నన్ను క్షమించు అంటూ రాజీవ్ కాళ్లపై పడతాడు. కానీ ఇదంతా కళ కాగా.. భార్య ధరణి కాళ్లపై పడతాడు శైలేంద్ర.

అక్కడే ఉన్న ఫణీంద్ర చూసి.. రేయ్ శైలేంద్ర అనగా... కళ్లు తెరిచి చూస్తాడు. తండ్రి పైకి లేవమని ఏం తప్పు చేశావురా, కాళ్లు ఎందుకు పట్టుకున్నావు అంటూ అడుగుతాడు. శైలేంద్ర చప్పుడు చేయకపోగా.. ధరణిని అడుగుతాడు. దానికి ధరణి నాకేం తెలియదు మామయ్యా.. ఆయన నా కాళ్లు ఎందుకు పట్టుకున్నారో కూడా అర్థం కావట్లేదని చెబుతుంది. దేవయాని నీకేమైనా తెలుసా అనగా తెలీదంటుంది. ఎందుకురా ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చి మరీ ఫణీంద్ర వెళ్లిపోతాడు. ఆ తర్వాత దేవయాని కూడా భార్య కాళ్లు పట్టుకోవడం.. ఏంట్రా నువ్వసలు నా కొడుకువేనా అని తిడుతూ వెళ్లిపోతుంది. ఇక ధరణి మీరు చాలా మంచి వాళ్లండీ.. నా కాళ్లు పట్టుకోవడం నాకు బాగా నచ్చిందంటూనే... మళ్లీ పట్టుకోవాలనిపించినా పట్టుకోండంటూ చెప్పి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత అనుపమ వసుకు థాంక్స్ చెబుతుంది. ఎందుకని వసు అడగ్గా.. మనును బయటకు తీసుకు వచ్చావని అంటుంది. ఆ తర్వాత నేను రెండో రెండు సార్లు గుండెలవిసేలా రోదించానని.. ఒకటి మనును అమ్మా అని పిలవొద్దని చెప్పినప్పుడు, రెండు తనను పోలీసులు తీసుకెళ్లినప్పుడు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. నీ ప్రాణాలకు తెగించి తనను కాపాడడం.. నేను జీవితాంతం మర్చిపోలేనని అంటుంది. ఇన్నాళ్లూ నేను మనుకు దూరంగా ఉన్నాను, ఉంచాను.. కానీ వాడెప్పుడూ బాగుండాలనే ప్రతీ క్షణం కోరుకున్నానని అంటుంది. కానీ జైలుకి వెళ్తే జీవితాంతం ఒంటరిగా ఉండాల్సి వస్తుందనుకున్నానంటూ ఏడుస్తుంది. ఇంత బాధను ఎలా దాచుకున్నారని వసు అడగ్గా.. ఇన్నాళ్లూ తండ్రెవరో తెలియక కుమిలిపోయాడు, ఇప్పటికీ కుమిలిపోతూనే ఉన్నాడని అంటుంది. కానీ తండ్రి పేరు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ మళ్లీ కన్నీరు పెట్టుకుంటుంది.

చాటు నుంచి ఇదంతా వింటున్న మను.. బాధ పడుతూ ఉంటాడు. వసు కూడా మను గురించి చెబుతుంది. తనకు కూడా మీరంటే చాలా ప్రేమ అని కానీ.. తండ్రి ఎవరో తెలియకనే ఇన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని అంటుంది. ఆ తర్వాత శైలేంద్రను చూపిస్తారు. ధరణి కాళ్లు పట్టుకోవడం గుర్తు చేసుకుని తెగ బాధ పడిపోతాడు. ఆ తర్వాత మనుకు ఓసారి ఫోన్ చేసి మాట్లాడదాం... ఎండీ సీటు కోసం అంటూ అడుగుతాడు. ఫోన్ చేసిన వెంటనే బ్రదర్ అనగా.. బ్రదరా ఏంటంటూ మను అడుగుతాడు. ఆ తర్వాత నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవని అంటూనే.. నిన్ను బయటకు తీసుకు వచ్చినందుకు కనీసం థాంక్స్ కూడా చెప్పలేదేంటని అంటాడు. అప్పుడే మను థాంక్స్ చెబుతాడు. ఆ తర్వాత శైలేంద్ర మన డీల్ గుర్తుందా అనగా.. అవునంటాడు.

మీరు ఎక్కడ ఉన్నారని అనగా.. మహేంద్ర గారి ఇంట్లో అని చెబుతాడు. ఎందుకెళ్లావు మీ అమ్మను చూడడానికి అంటే అవునంటాడు. వసు, మహేంద్రలతో మాట్లాడొద్దని వెంటనే తన ఇంటికి వెళ్లిపోమని అంటాడు. ఈరోజు అసలు వాళ్లను కాంటాక్ట్ అవ్వొద్దంటూ చెప్పుకొస్తాడు. కానీ మను మాత్రం ఎందుకు అంటూ అడుగుతూనే ఉంటాడు. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











