Guppedantha Manasu March 18th: అనుపమ సీక్రెట్స్ రివీల్ కాబోతున్నాయా.. అందుకే మను చెంపలు వాయించిందా?
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో మహేంద్ర, వసు, అనుపమలను చూపిస్తారు. వసు వీరిద్దరికీ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. మహేంద్ర కాఫీ తాగుతుండగా.. అనుపమ అలాగే ఉంటుంది. ఏమైంది అనుపమ అలా ఉన్నావంటూ మహేంద్ర అంటాడు. ఆ తర్వాత వసుతో మాట్లాడుతూ... నాకో స్నేహితురాలు ఉంది, తాను ఎందుకు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుందని చెబుతాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావని అనుపమ అడగ్గా.. నువ్వు కాదులే మహాతల్లి అంటాడు. ఆ తర్వాత మహేంద్ర.. ఈ మను బర్త్ డే ఎప్పుడో తెలుసుకుని చెప్పాలి వసు నువ్వే అంటాడు.
వెంటనే అనుపమ అతడు చెప్పట్లేదుగా అంటుంది. అందుకేగా వసుకు, నీకు చెప్పేది అని మహేంద్ర అంటాడు. వెంటనే మీరిద్దరూ చెప్పాలని అంటారు. ఆ తర్వాత మను బర్త్ డే తెలుసుకోవడానికి నువ్వు లిస్టు తయారు చేసి ఇస్తావా లేదా అనగా.. మహేంద్ర నేను కాలేజీకి వెళ్తానంటూ వెళ్లిపోతుంది. ఆ తర్వాత వసు, మహేంద్రలు మను మంచితనం గురించి మాట్లాడుకుంటారు. శైలేంద్ర ఎండీ సీటు లాక్కోవాలని అనుకోగా.. మను వచ్చి మనకు సపోర్ట్ గా నిలిచాడని మహేంద్ర చెప్పగా వసు కూడా అవునని అంటుంది. రిషిని వెతికేందుకు కూడా సాయం చేస్తామని చెప్పగా తెగ ఎగ్జైట్ అవుతారు. అయిన వాళ్ల మనల్ని నాశనం చేస్తుండగా.. ఏమీ కానీ మను సాయం చేస్తున్నాడంటూ మురిసిపోతారు.

ఆ తర్వాత నువ్వు కాలేజీకి వెళ్లమ్మా.. నేను తర్వాత వస్తానని అంటాడు. అలా వసు వెళ్లిపోగానే జగతి ఫొటో వద్దకు వెళ్లి ఐ లవ్ యూ చెబుతాడు. ప్రాణంగా ప్రేమించుకుని, ఎన్నో కష్టాలు పడి పెళ్లి చేసుకున్నాం.. ఒకరికొకరు 20 ఏళ్లు దూరంగా ఉన్నాం.. ఆ తర్వాత కలిశాం.. రిషి కూడా నిన్న అర్థం చేసుకున్నాడు.. ఆ తర్వాత నిన్ను దేవును నాకు దూరం చేశాడంటూ బాధ పడతాడు. నీ చావు తర్వాత నేను తాగుడుకు అలవాటు అయి బాధతో ఏడుస్తుంటే... వసు, రిషిల కోసం మద్యం మానేశానని.. ఇప్పుడు రిషి కనిపించకుండా పోయానని చెబుతాడు. ఆ తర్వాత మను గురించి వివరిస్తాడు. అంత మంచి మనసు ఉన్న మనుకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని అడుగుతాడు.
ఇక ఆ తర్వాత రిషి దగ్గరకు వెళ్లిన మహేంద్ర.. తనతో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. ఓ కంకణం చూపించి.. ఇది నీకోసం చేయించానని అంటాడు. కానీ నువ్వెక్కడున్నావో తెలీదని.. ఇప్పుడు మను వచ్చి మా జీవితాలను మార్చాడని చెబుతాడు. మను వచ్చి మా అపోహలు పోగొట్టాడని.. నీలాగే అచ్చం మను కూడా ఉన్నాడని తెలుపుతాడు. ఆ తర్వాత అనుపమ కాలేజీకి వచ్చి మను గురించి మాట్లాడాలి అనుకుంటుంది. అసలు మను కాలేజీకి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలని అనుకుంటుంది. వెంటనే మను వద్దకు అతడు కనిపించడు. కానీ కొత్త ప్రేమ జంట అనే పోస్టర్లు చూసి షాక్ అవుతుంది.
ఆ తర్వాత అక్కడకు వసు వ్చచి వాటిని చూసి మరింత ఫీల్ అవుతుంది. అంతలోనే మను రాగా ఆ పోస్టర్లు చూసి అలాగే నిలబడతాడు. ఆ తర్వాత అనుపమ అతడిని ఒకటే కొడుతుంది. ఇవన్నీ ఎందుకు చేశావు అనగా.. నీకసలు బుద్ధి లేదా ఏదనిపిస్తే అది చేసేస్తావా అంటూ ఫైర్ అవుతుంది. పోస్టర్లను చించేస్తుంది. నా మాటోసారి వినండి అనగా.. కూడా అనుపమ గట్టిగా వాదిస్తూనే ఉంటుంది. నీ బిహేవియర్ ఏంటో ఈ పోస్టర్లు చూస్తేనే అర్థం అవుతుంది అనగా.. మను మాత్రం అలా చూస్తూనే ఉంటాడు. ఇలా చేసేటప్పుడు ఒక్కసారి నీ కన్నవాళ్ల గురించి ఆలోచించవా.. ఎందుకురా నీకిలాంటి బుద్ధి వచ్చిందంటూ రెచ్చిపోతుంది.
మీరు చూసిందంతా నిజం కాదు.. అన్నా వినకుండా అనుపమ అరిచేసరికి మను చాలా హర్ట్ అవుతాడు. ఇంత జరిగాకా నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీళ్లేదని అంటుంది. చాటునుంచి శైలేంద్ర ఇదంతా వింటూ కనిపిస్తాడు. మను ప్లీజ్ మేడం ఒక్కసారి నా మాట వినండి అంటాడు. నేను చెప్పింది వింటే తప్పు ఎలా జరిగిందో అర్థం అవుతుందని అనగా.. లేదు నువ్వెళ్లిపో అంటూ ఫైర్ అవుతుంది. నువ్వెళ్లకపోతే నా శవాన్ని చూస్తావు అంటావు అనేస్తుంది. దీంతో మను కన్నీళ్లు పెట్టుకుంటాడు. నేను వెళ్లిపోతానంటూ.. మీ కోసం మాత్రమే నేను వెళ్లిపోతానంటూ చెప్పేస్తాడు.
నేను తప్పు చేయకపోయినా వెళ్తాను అంటూ... నిందలు మోయడం, మాటలు భరించడం నాకలవాటు అయిపోయిందని.. నేను వెళ్లే ముదం మీకో క్లారిటీ ఇవ్వాలి మేడమ్ అంటూ వసుతో అనగా ఆమె కూడా వద్దని అంటుంది. రిషితో నన్ను కలుపుతావని అనుకుంటూ నువ్విలా చేశావని అంటుంది. ఆ తర్వాత అనుపమ, మనులు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు.


Click it and Unblock the Notifications











