Guppedantha Manasu March 23rd: మన తండ్రి ఎవరు.. సూటిగా అడిగేసిన మహేంద్ర.. అనుపమ ఏం చెప్పనుంది?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో మహేంద్ర అనుపమకు మెడిసిన్స్ వేసుకోవాలని అంటాడు. ఈ క్రమంలోనే మెడిసన్స్ కార్లో ఉన్నాయని.. నేను వెళ్లి తీసుకు వస్తానని ఏంజెల్ అంటుంది. కానీ వసు మాత్రం ఆగు అని మనం అందరికీ కాఫీ పెడదాం పదా అంటూ తీసుకు వెళ్తుంది. మను ట్యాబ్లెట్స్ తీసుకు రా అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మను వెళ్లి కారులోంచి మెడిసిన్స్ తీసుకురమ్మంటుంది. ఆ తర్వాత మహేంద్ర రూం అరేంజ్ చేసేందుకు వెళ్తుంది.

అంతలోనే మను ట్యాబ్లెట్స్ తీసుకు వచ్చి అనుపమకు ఇస్తాడు. ఆమె వేసుకోగానే ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేయండి నేను వెళ్తానని అంటాడు. అవసరం రాదు అని అనుపమ అనగా కోపంగా మను వెళ్లిపోతాడు. ఆలోపే వసుధార వచ్చి పిలిచినా వినిపించుకోకుండా వెళ్తాడు. కారులో ఉండగా.. తన తల్లి తన కోసం ప్రాణాలకు తెగించి కాపాడినా ఆమెను చూసుకోకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఫీల్ అవుతాడు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇలా నన్ను ఎందుకు దూరం పెడుతుంది అంటూ బాధ పడతాడు. ఆ తర్వాత మహేంద్ర రూం సర్దేసి అనుపమను తీసుకు రమ్మంటాడు.

Mahendra Asked Anupama About Mano Past on Guppedantha Manasu March 23rd 2024 Episode 1032

అప్పుడే మను లేకపోవడం చూసి అతనెక్కడ అని అడుగుతాడు. మను లేడు.. వెళ్లిపోయాడు అని అనుపమ చెబుతుంది. తనే వెళ్తా అన్నాడు అని అనుపమ అనగా.. నువ్వు అతడిని చాలా బాధ పెడతున్నావు అంటాడు. అసలెందుకు నువ్వు నీ కొడుకును దూరం చేసుకున్నావు అంటూ ప్రశ్నిస్తాడు. జగతి, రిషిలు కూడా చాలా బాధపడేవాళ్లు అని.. మీ ఇద్దరూ ఇలా దూరంగా ఉంటున్నారంటే ఏదో పెద్ద సంఘటనే జరిగి ఉంటుందని అంటాడు. అసలేం జరిగిందో చెప్పమని అంటాడు. మను విషయంలో నువ్వు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నావని అంటాడు. మీ గొడవలకు కారణం ఏంటి, నువ్వెందుకు ఇలా ఉంటున్నావని అనగా.. మను ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు వేని అంటుంది అనుపమ.

ఆ తర్వాత వసు మాట్లాడుతూ.. మీకు నచ్చని పని ఏదైనా మను చేస్తే సర్ది చెప్పాలి కానీ ఇలా కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నావని అడుగుతుంది. మా మధ్య ఈ బంధం, మా మధ్య ఈ దూరం అంతా విధి ఆడించే నాటకం అంటూ అనుపమ అనగా.. మహేంద్ర కారణం చెప్పాలి కదా అంటూ అడుగుతాడు. నువ్వే అమ్మా అని పిలవకూడదని మను వద్ద మాట తీసుకున్నావట కదా అని అనుపమను అడుగుతాడు. ఏ తల్లి అయినా అలా కొడుకు దగ్గర ఒట్టు వేయించుకుంటుందా అని అంటాడు. ఇలా అమ్మా అని పిలవకూడదని అనడం వెనుక కారణం ఏంటని, మను కోసం ప్రాణాలకు తెగించిన నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని పదే పదే అడుగుతాడు.

మహేంద్ర ఇలా మాట్లాడుతుంటే.. కడుపు నొప్పితో అనుపమ విలవిల్లాడుతుంది. ఆ తర్వాత ఏంజెల్ అనుపమను చూసుకుంటుంది మనం కాలేజీకి వెళ్దాం రండి అంటు అని అడుగుతుంది. కానీ మహేంద్ర నేను కాసేపయ్యాక వస్తానని అంటాడు. సరేనని వసు అనగా.. మహేంద్ర మనసులో నేను అనుపమతో ఈరోజు కచ్చితంగా మాట్లాడి నిజం తెలుసుకోవాలి అనుకుంటాడు. ఆ తర్వాత శైలేంద్ర, రాజీవ్ లు కలిసి కనిపిస్తారు. ఎందుుకు రమ్మన్నావు అని రాజీవ్ అడగ్గా.. అనుపమ నోరు విప్పితే మన గురించి మొత్తం తెలుస్తుందని... మన గురించి బయటకు వస్తుందని అంటాడు.

ఇక ఆ తర్వాత వసు కాలేజీలో పని చేసుకుంటూ కనిపిస్తుంది. అప్పుడే వసుకు అనుపమ మనును తిట్టడం.. పోస్టర్ల విషయంలో జరిగిన గొడవ గుర్తుకు వస్తుంది. మనును తప్పుగా అనుకుంటున్నానని తెగ బాధ పడిపోతూ ఉంటుంది. ఒకసారి తనతో మాట్లాడాలని బయటకు వెళ్తుంది. కానీ అప్పడికే మను కాలేజీకి రాకపోవడం చూసి అటెండర్ ను పిలచి వసు అడుగుతుంది. మను సార్ లీవ్ లో ఉన్నాడని చెప్పగా.. వసు ఫోన్ చేస్తుంది. ఆతర్వాత మహేంద్ర అనుపమ వద్దకు వెళ్తాడు. పెయిన్ ట్యాబ్లెట్ వేసుకోమని అంటాడు. గతం గాయం చేస్తుందని తెలుసు కానీ మరీ ఇంతలా చేస్తుందని అంటాడు.

ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎందుకు దాచావు అనుపమ అంటూ అడుగుతాడు. నా విషయాలన్నీ అడిగి తెలుసుకున్నావు కదా.. మరి ఈ విషయం ఎందుకు చెప్పలేకపోయావు అంటూ అంటాడు. నన్ను కూడా పరాయి దానిలాగా చూశావుగా అందుకే అంటుంది. కొన్ని విషయాలు చెప్పకపోవడమే బెటర్ అని.. దాని వల్ల నా అనుకున్న వాళ్లు, నా దగ్గరి వాళ్లు అంతా బాధ పడతారని అంటుంది. పది మంది ఉండే అనుపమ వేరు, మహేంద్ర ముందు ఉండే అనుపమ వేరు, అలాగే అనుపమ మనసులో ఉండే నేను మరింత వేరని అంటుంది. ఇక చివర్లో నువ్వు మను తల్లి అయితే మను తండ్రి ఎవరు అని అడుగుతాడు. దీంతో అనుపమ తెగ టెన్షన్ పడిపోతూ కనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X