Guppedantha Manasu April 18th: కాలేజీ నుంచి వెళ్లిపోయిన మహేంద్ర.. మను దత్తత.. టెన్షన్‌లో దేవయాని!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో వసుధార, మహేంద్రలు బోర్డు మీటింగ్ లో పాల్గొంటారు. మిగిలిన వాళ్లంతా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పెట్టి కూడా ఉపయోగం లేకుండా పోయిందని... మనం అనుకున్నది వేరు, జరిగింది వేరని చెప్పుకొచ్చారు. మీటింగ్ సక్సెస్ అవ్వలేదు ఓకే మళ్లీ అదే మీటింగ్ పెట్టుకోవచ్చు కదా అని మహేంద్ర అడగ్గా.. గొడవ జరిగింది కదా అంటారు. గొడవ జరిగిందని నేనిప్పుడు మెల్లిగా మాట్లాడాలా అని అంటాడు. వెటకారం చేయకండి, కాలేజీ అంతా ఈ న్యూస్ బ్యాడ్ గా వెళ్తోందని అంటారు. మీరు సైలెంట్ గా ఉండి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదని మీటింగ్ లో పాల్గొన్న మిగతా వాళ్లు ఉంటారు.

ఈక్రమంలోనే శైలేంద్ర.. మంచి మనసుతో స్పందించే మా బాబాయి అలా చేశారని అనగా.. మరొకతను మాత్రం ఏమో అందులో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చని చెబుతారు. ఇలా చర్చ సాగుతుండగా... శైలేంద్ర రెచ్చగొడుతూనే ఉంటాడు. అంతోలనే మహేంద్ర స్పందించి.. నేను కాలేజీ నుంచి వెళ్లిపోతానని వివరిస్తాడు. తన వల్ల అంతా ఇబ్బంది పడుతునంటే తాను ఇక్కడ ఉండలేనని అంటాడు. లేవబోతుండగానే అక్కడకు మను వచ్చి వద్దు అని చెబుతాడు. సమస్య తన వలల కాబట్టి తాను వెళ్లిపోతానని అంటాడు. మీరు ఇక్కడే ఉండాలని చెప్పుకొస్తారు. కానీ మహేంద్ర మాత్రం మనుయే ఇక్కడ ఉండాలని.. చెప్పి తాను వెళ్లిపోతాడు.

Mahendra Decided to Adopt Manu on Guppedantha Manasu April 18th 2024 Episode 1053

ఇక ఆ తర్వాత అనుపమ ఇంట్లో ఉండగా.. మహేంద్ర వెళ్లి కూర్చుంటాడు. తాను కాలేజీ నుంచి వైదొలిగినట్లు చెప్పిందే గుర్తు చేసుకుంటాడు. అప్పుడే వసు ఇలా చేసిండకూడదు మామయ్యా అంటుంది. తాను ఏ తప్పూ చేయలేదని, తాను కరెక్టుగానే చేశానని అంటాడు మహేంద్ర. ఇప్పుడే వసు అది మీ నాన్నగారు మీకు ఇచ్చిన బాధ్యత, ఇలా మధ్యలోంచి వైదొలగడం మంచిది కాదని చెబుతుంది. కానీ మహేంద్ర మాత్రం జగతి, రిషి, నువ్వు.. ఇలా ఎవరో ఒకరు కాలేని బాగానే చూసుకుంటున్నారని చెప్పుకొస్తాడు. అప్పుడే అనుపమ మా కోసం నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతుంది. మా గురించి నువ్వు ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదని వివరిస్తుంది.

కానీ మహేంద్ర మాత్రం.. మిరి నువ్వు ఎందుకు రిషి, జగతి విషయంలో ఎమోషనల్ అయ్యావని అంటాడు. అప్పుడు అనుపమ.. జగతి నా బెస్ట్ ఫ్రెండ్ అని, తన కొడుకు కూడా నా కొడుకే అని చెబుతుంది. మహేంద్ర మరి నా పరిస్థితి కూడా అంతే కదా నా స్నేహితురాలికి సమస్య వస్తే నాదే కదా అంటాడు. జరిగిందేదో జరిగిపోయింది.. ఇక వదిలెయ్ మా సమస్యలు ఏవో మేము పడతాము అంటూ తెలుపుతుంది. కానీ మహేంద్ర మాత్రం ఈ సమస్యకు పూర్తి పరిష్కారం చూపుతానంటాడు. ఎలా అని అనుపమ, వసులు అడగ్గా.. మహేంద్ర మనును దత్తత తీసుకుంటానని అంటాడు. అయినా నేనొప్పుకోను, మనును నువ్వు దత్తత తీసుకోవడం ఏంటని అనుపమ అంటుంది.

ఇది తప్ప వేరే మార్గం లేదు, ఇది మంచి పరిష్కారం అని మహేంద్ర చెబుతాడు. ఇలా చేయొద్దని అనుపమ అన్నా వినకుండా.. తాను మనును దత్తత తీసుకుని తనకు న్యాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతాడు. అప్పుడే దేవయాని అనుపమకు ఫోన్ చేస్తుంది. ఆమె ఫోన్ లేపిన వెంటనే బూతులతో రచ్చ చేస్తుంది. నా మరిదిని కాలేజీ నుంచి వెళ్లగొట్టడానికే ఇక్కడకు వచ్చావా, సిగ్గు, చీము, నెత్తురు ఏమైనా ఉందా అని అడిగాడు. పెళ్లి చేసుకుని ఆమె వదిలేసి కొన్నాళ్లు నరకం చూపించిందని, ఆమె చనిపోయాక అయినా ఆయన సంతోషంగా ఉంటాడని అనుకుంటే ఇప్పుడు నువ్వొచ్చావా అంటూ అడుగుతుంది. అసలు మీ తల్లి, కొడుకుల సమస్యల్లోకి మహేంద్రను ఎందుకు లాగుతున్నారని అంటుంది.

Mahendra Decided to Adopt Manu on Guppedantha Manasu April 18th 2024 Episode 1053

ఇక అప్పుడే మహేంద్ర వచ్చి ఫోన్ తీసుకుని ఏంటి వదినగారు అంటూ ఏం మాట్లాడుతున్నారంటూ అంటాడు. నువ్వు వాళ్ల మాయలో పడొద్దని దేవయాని చెప్పగా.. ఏవరేం చేసినా నేను చేసేది నేను చేస్తాను కదా అంటాడు. కాసేపాగండి.. మీ ఇంటికొచ్చి ఓ ఇన్విటేషన్ ఇస్తానని చెబుతాడు. ఆపై ఫోన్ పెట్టేయగా.. దేవయాని ఫణీంద్రకు ఆ విషయం చెబుతుంది. ఓ ఇన్విటేషన్ తీసుకుని మహేంద్ర ఇక్కడకు వస్తానన్నాడని అనగా... అంతా ఆ ఇన్విటేషన్ ఏంటని తెగ ఆలోచిస్తూ ఉంటారు. కాలేజీ నుంచి వెళ్లిపోయేందుకు ఆ ఇన్విటేషన్ ఏమో అని శైలేంద్ర అనగా.. అందుకేరా నిన్ను బుర్రతక్కువ వెధవా అనేది అంటూ ఫణీంద్ర అంటాడు. ఇంతటితో ఆ సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X