Guppedantha Manasu May 15th: శైలేంద్రను ప్రశ్నలతో ఆటాడుకున్న వసుధార.. మను బయటకు రావడం ఫిక్స్!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో శైలేంద్ర.. మహేంద్ర, వసుధార, మనులతో కలిసి ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ముఖ్యంగా ఓ బాండ్ పేపర్ తీసుకు వచ్చి మరీ తనకు ఎండీ పదవి ఇవ్వబోతున్నట్లు సంతకం పెట్టమంటాడు. కానీ వసుధార మాత్రం అస్సలే పెట్టను అంటూ మొండికేస్తుంది. తనకే ఎండీ పదవి కావాలంటుంది. మహేంద్ర కూడా ఏమీ అనలేకపోతాడు.
అప్పుడే మను నీకు ఎండీ పదవి ఇవ్వబోతున్నట్లు సంతకం పెట్టాలంటే.. రాజీవ్ ను నువ్వు కచ్చితంగా తీసుకొస్తావనే నమ్మకం మాకేంటి అంటూ ప్రశ్నిస్తాడు. అంటే రాజీవ్ బతికేఉన్నాడని అర్థం కదా అంటూ అడుగుతాడు. అదంతా నీకెందుకు.. నిన్ను జైలు నుంచి నేను బయటకు తెప్పిస్తానంటూ చెప్పుకొస్తాడు. కానీ రాజీవ్ బతికే ఉన్నాడని మాత్రం అనడు. అప్పుడు వసు కావాలి అంటూ చెప్పుకొస్తాడు.

అప్పుడే వసుధార మేము 50 కోట్లు ఇస్తాం అని అంటుంది. వాళ్లు ఇచ్చిన వెంటనే ఆ 50 కోట్లు నీకు ఇచ్చేస్తానని మను అంటాడు. కావాలంటే ఇంకా కూడా ఇస్తానంటూ చెప్పుకొస్తాడు. అప్పుడు శైలేంద్ర నా గురించి మీరేం అనుకుంటున్నారు అసలు.. నాకు ఈ డబ్బు కాదు.. ఎండీ పదవి నా ఎన్నో ఏళ్ల కళ అని అంటాడు. కాపాడతాను అని చెప్పలేదు.. కాబట్టి నాదేం తప్పులేదని మను అంటాడు. నీవు జీవితాంతం ఊచలు లెక్కబెట్టాల్సిందేనని వివరిస్తాడు.
అప్పుడే మను నేను సంతకం పెట్టేస్తానని అంటాడు. వెంటనే దా పెట్టు పెట్టు అనగా.. మను సంతకం పెట్టేస్తాడు. శైలేంద్ర తెగ సంతోష పడిపోతాడు. ఇక వసు, మహేంద్రలను కూడా సంతకం పెట్టమంటాడు. కానీ వసు మాత్రం పెట్టనంటూ మొండికేస్తుంది. మను కాలేజీ కాపాడతానని అని.. ఇప్పడేమో చేతులెత్తేశాడు.. ఇక శైలేంద్ర కూడా అంతేనంటూ చెప్పుకొస్తుంది.
అయినా అతడికి కాలేజీ గురించి ఏమీ తెలియదనా నీ ఉద్దేశం అని మహేంద్ర.. వసుతో అనగా.. కాలేజీలో మొత్తం ఎంత మంది విద్యార్థులు ఉన్నారో చెప్పమనండి అంటుంది. కానీ దానికి శైలేంద్ర సమాధానం చెప్పడు. ఆ తర్వాత వసు పోనీ మన కాలేజీలో ఎన్ని కోర్సులు ఉన్నాయో చెప్పండి అనగా.. చివరకు 10 అంటాడు.
కరెక్ట్ అని మహేంద్ర అనగా.. వాటి పేర్లు కూడా చెప్పమని వసు అంటుంది. ఇలాంటోడికి కాలేజీ అప్పజెప్పడం ఏంటంటూ ఫైర్ అవ్వగా.. మనం నేర్పిద్దాం అని మహేంద్ర అంటాడు. ఇప్పుడు తెలియకపోయినా.. ముందు ముందు తెలుసుకుంటాడని.. ఈ వెదవకి తాను నేర్పిస్తానంటూ వివరిస్తాడు. ఎందుకు మామయ్యా మీరు సపోర్ట్ చేస్తున్నారని అనగా.. మహేంద్ర బయట వాళ్ల కంటే మనవాడు శైలేంద్ర బెటర్ కదా అంటూ చెప్పుకొస్తాడు.
మా అన్నయ్య కడుపున చెడి పుట్టి ఉండవచ్చని అనగా.. మను, వసులు నవ్వుకుంటారు. కానీ మహేంద్ర మాత్రం తనకు శైలేంద్ర మీద నమ్మకం ఉందని... రిషి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వప్పుడు సంతకం పెట్టాల్సిందేనని అంటాడు. దాంతో ఏమీ చేయలేక వసు సంతకం పెడుతుంది. అంతలోపే వన్ సకెండ్ అంటూ మను ఆపుతాడు.
మేడమ్ సంతకం పెట్టాకా నువ్వు నన్ను ఎలా బయటకు తీసుకు వస్తావంటూ అడగ్గా.. ముందు నన్ను బయటకు తీసుకురా అంటాడు. అప్పుడే వసుతో సంతకం పెట్టించి మరీ నీకు కాలేజీ అప్పగిస్తానని అంటాడు. నీకు ఇలా కాలేజీ సొంతం చేసుకునే అవకాశం వచ్చింది.. కానీ నీకు ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు, జీవితంలో నీవు ఎండీ సీట్లో కూర్చోలేవు అంటూ భయపెడతాడు. దీంతో సరేనని చెప్పిన శైలేంద్ర.. నిన్ను బయటకు తీసుకు వస్తానని అంటాడు.
కానీ నిన్ను బయటకు తీసుకు వచ్చేందుకు వసు నేను చెప్పినట్లు చేయాలంటాడు. అలా ఆ బాండ్ పేపర్లు తీసుకుని వెళ్లిపోతాడు. పదండి బాబాయ్ అంటూ అడుగుతాడు. మీ ఆవేశం అతడిపై వెళ్లగక్కి బయటకు రండి అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మహేంద్ర.. మనుకు సారీ చెబుతాడు. తను నిన్ను నిజంగానే బయటకు తీసుకు వస్తాడా లేదా అని అడుగుతాడు.
ఆ తర్వాత శైలేంద్ర ఇంటికి వెళ్తూ కనిపిస్తాడు. మమ్మీ, మమ్మీ అంటూ కేకలు వేయగా.. స్వీటు తనిపిస్తాడు. అలాగే భార్య ధరణికి కూడా స్వీట్ పెడతాడు. డాడీ ఎక్కడ అనగానే.. ఎక్కడికో బయటకు వెళ్లారా శైలేంద్ర అంటుంది తల్లి. శైలేంద్ర కాదు.. శైలేంద్ర భూషణ్ ఎండీ అని చెప్పుకొస్తాడు. ఎండీ అంటే ఏంటనగా.. బీబీఎస్టీ కాలేజీకి ఎండీ అని చెప్పుకొస్తాడు.
అంతలోనే ధరణి తన భర్తకు ఏదో అయిందంటూ ఏడుస్తుంది. అత్తయ్యా అంటూ సోకం పెట్టగా.. ఏమీ లేదు.. నేను బాగానే ఉన్నానంటూ శైలేంద్ర చెప్పుకొస్తాడు. ఒకసారి కోపంగా, మరోసారి నవ్వుతూ.. ఇలా ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తున్నారేంటండి అంటూ ధరణి అంటుంది. ఆ తర్వాత తల్లికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి మరీ.. త్వరలోనే నాకు పట్టాభిషేకం జరుగుతుందని.. నువ్వు కచ్చితంగా రావాలంటూ కోరుతాడు. ఆ తర్వాత భార్యను కూడా రమ్మని చెబుతూ వెళ్లిపోతుంది. అప్పుడే దేవయాని.. వీడేదో వెధవ పని చేస్తున్నాడంటూ చెప్పుకొస్తుంది. అంతలోనే ధరణి ఈయనను ఏదైనా ఆస్పత్రిలో చూపిద్దామా అంటూ అడుగుతుంది.


Click it and Unblock the Notifications











