Guppedantha Manasu April 2nd: తండ్రి గురించి తెలియకపోవడం మను లోపమే.. షాకిచ్చిన మహేంద్ర!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో.. శేలేంద్ర మను తండ్రి ఎవరని అడుగుతూ రచ్చ చేస్తాడు. ఈక్రమంలోనే మహేంద్ర కల్గజేసుకుని తన తండ్రి ఎవరో తెలియకపోవడం తన లోపమే అంటాడు. దీంతో వసు, శైలేంద్ర, మనులు షాక్ అవుతారు. వెంటనే తేరుకున్న మహేంద్ర.. మనుకు సారీ చెబుతాడు. నా తండ్రి గురించి నాకు తెలియకపోవడం నా లోపమా అంటాడు. అది నా లోపం కాదంటూ గట్టిగా అరుస్తాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత శైలేంద్ర కాలర్ పట్టుకోగా ఏంటి బాబాయ్ ఇది అంటాడు. పిల్లలు తప్పు చేసి ఒకరి మీద ఒకరు నెట్టుకున్నట్లుగా మీరు నా మీద తోశారేంటని శైలేంద్ర అంటాడు.
ఇక ఆ తర్వాత మహేంద్ర, వసులు.. శైలేంద్రను తిట్టి మరీ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక మనును ఆడుకోవడానికి నాకు మంచి ప్లాన్ దొరికిందంటూ శైలేంద్ర మురిసిపోతాడు. మధ్యలో కారు ఆపుకున్న మను.. శైలేంద్ర అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నా తండ్రి ఎవరో తెలియక పాతికేళ్లుగా ఇలాగే ఉంటున్నానంటూ.. ఏడుస్తాడు. తండ్రి గురించి అడిగితే తల్లి కూడా వదిలేసింది.. నా తండ్రి ఎక్కడ అంటూ మరింత ఫైర్ అవుతాడు. బాధతో కూడిన ఆగ్రహంతో ఊగిపోతుంటాడు. నా తండ్రి ఎవరు అంటూ గట్టి గట్టిగా అరుస్తాడు.

ఆ తర్వాత శైలేంద్ర ఇంటికి వెళ్తాడు. వెంటనే తన తల్లిని పిలుస్తాడు. ఆనందంతో తల్లిని తిప్పేస్తూ.. నీ ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయిందని చాలా సంతోషంగా ఉన్నానని చెబుతాడు. మను తండ్రి గురించి అడిగి వాడిని ఇబ్బంది పెడితే.. వాడు పడే కోపానికి చాలా సంతోషంగా అనిపించిదని అన్నాడు. అక్కడ జరిగిందంటా చెప్పి దేవయానిని చాలా సంతోషపరిచాడు. ముఖ్యంగా మహేంద్ర చెప్పన మాటలు కూడా మరోసారి వివరిస్తూ... తెగ సంతోషపడిపోతారు. అంతలోనే ధరణి వచ్చి ఏంటని అడుగుతుంది. భర్త, అత్తలను మాటలతో నొప్పిస్తుంది. ఇంతలోనే దేవయాని వెళ్లు అనగా వెళ్లిపోతుంది. మనును ఇక నుంచి బాగా ఆడుకో అంటూ సూచిస్తుంది.
మహేంద్ర తాను అన్న మాటలు గుర్తు చేసుకుంటూ చాలా బాధ పడిపోతాడు. వసు కూడా ఎందుకు మామయ్యా అంత గిల్టుగా ఫీల్ అవుతున్నారని అంటుంది. నేను చేసింది తప్పే కదమ్మా.. నా సొంత కొడుకు అని భావించి, చివరకు ఇలా అనేశానంటూ బాధ పడతాడు. శైలేంద్ర వల్ల నేను మనును అంత పెద్ద మాట అనాల్సి వచ్చిందని, మను తండ్రి ఎవరో తెలుసుకుని.. ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సిందేనని అంటాడు. ఇప్పుడే వెళ్లి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుంటానని అంటూ అనుపమ వద్దకు వస్తాడు. వెనకాలే వసు కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది.

అనుపమ పెద్దమ్మ.. మనుకు కట్టు కడుతుంది. నొప్పిగా ఉందా అనగా, నీ మనసుకే ఎక్కువ నొప్పి కల్గింది కదా అంటూ చెప్పుకొస్తుంది. నా తండ్రి గురించి అడుగుతూ.. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారని, తండ్రి పేరు కూడా తెలియదా అంటూ తల్లిని అవమానిస్తున్నారని అంటాడు. లోకం తీరు అంతేనంటూ అనుపమ పెద్దమ్మ చెబుతుంటే.. మను అలాగే చూస్తూ ఉంటాడు. ఎవరి దగ్గర ఏదైతే ఉండదో.. దాని గురించి మాట్లాడుతూ.. జనాలను చాలా మంది ఇబ్బంది పెడుతూ రాక్షసానందం పొందుతారని వివరిస్తుంది. నిన్ను నువ్వు గాయ పరుచుకోవద్దు.. ఇంతకాలం నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావంటూ అంటుంది.
నా మంచి కోరుకునే వాళ్లు కూడా నా తండ్రి ఎవరో తెలియకపోవడం నా లోపమే అంటున్నారని అంటూ బాధ పడతాడు. ఈ సమస్యకు పరిష్కారం తెలియాల్సిందేనని కన్నీరుపెట్టుకుంటాడు. ఆ తర్వాత దేవయాని అనుపమకు ఫోన్ చేస్తుంది. ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుంది. ఆ తర్వాత ఈరోజు కాలేజీలో ఏదో అద్భుతం జరిగిందట కదా అంటూ.. మనుకు జరిగిన అవమానం గురించి వివరిస్తుంది. ఇదంతా విన్న అనుపమ తెగ టెన్షన్ పడిపోతూ కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











