Guppedantha Manasu May 30th: మనుతో స్టోర్ రూంలో వసు.. శైలేంద్ర ప్లాన్ తిప్పికొట్టిన ఏంజెల్.. బావను భలే కాపాడిం
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో మను, ఏంజెల్ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. నా విషయంలో నువ్వు అలా ఉండాలనుకుంటే తప్పేం కాదు కానీ.. నా జీవితంలో ఇలా ఉండలేనంటూ చెప్పుకొస్తాడు. కానీ ఏంజెల్ మాత్రం నీ జీవితం కూడా సరదాగా ఉండకూడదని కాదు.. అందరూ చాలా సంతోషంగా ఉండాలి, సమస్యలు ఉన్నప్పటికీ అంటూ వివరిస్తుంది. ఆ తర్వాత మను మాట్లాడుతూ.. నా గురించి నీకు క్లారిటీ ఇస్తాను అర్థం చేసుకో అంటాడు. నేను ఎవరికైతే దగ్గర అవుతానో వాళ్లు నాకు దూరం అవుతారు అంటూ చెప్పగా.. ఏంజెల్ వెంటనే నా గురించి బాధ పడుతున్నావా అంటుంది. లేదు సీరియస్ గా మాట్లాడుతున్నానంటాడు మను. నా గురించి నీ మనసులో ఉన్నది తీసెయ్ అంటాడు. మన పరిచయాన్ని పరిచయం లాగే ఉంచు.. ఎలాంటి బంధంగా, రిలేషన్ గా మార్చాలని చూడకంటాడు.
నేను ఇలాగే ఉంటాను, నన్ను మార్చకు అంటూ మను చెప్పుకొస్తాడు. ఏంటి హెచ్చరిస్తున్నావా అంటే రిక్వెస్ట్ చేస్తున్నానంటూ చెబుతాడు. ఇప్పుడు నీవు చెప్పిన జీవన సూత్రాలు ఒకప్పుడు రిషి కూడా చెప్పాడంటుంది. ఏంజెల్ ఎందుకు నేను చెప్పింది అర్థం చేసుకోవట్లేదని అంటాడు. ఎప్పుడూ నీకు ఎందుకు కోపం వస్తుందని అంటాడు. కానీ ఏంజెల్ మాత్రం నేను నిన్ను వదలను, అన్నీ భరిస్తానంటుంది. ఇకమీదట ఇలాంటివి చెప్పొద్దు నేను వినను అంటూ చెప్పుకొస్తాడు. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అంటూ వివరిస్తాడు. నేను నిన్ను కాదు.. నువ్వే నన్ను అర్థం చేసుకోవాలంటుంది ఏంజెల్. ఇక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత శైలేంద్రను చూపిస్తారు. తనను మోసం చేసిన మను, వసు, మహేంద్రలను కాలేజీలో ఉండకుండా చేయాలంటూ ఆలోచిస్తుంటాడు. ఏదో ప్లాన్ కూడా వేస్తాడు. అలా చేస్తే మను కాలేజీకి దూరం అవుతాడని వెంటనే ఎవరికో ఫోన్ చేసి తన ప్లాన్ గురించి చెబుతాడు.

ఇక ఆ తర్వాత వసును చూపిస్తారు. రిషి తనకు ఇచ్చిన గిఫ్టును చూసుకుంటూ అతడిని గుర్తు చేసుకుంటుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను సార్ అంటూ చెప్పుకొస్తుంది. అప్పుడే ఎవరో ఫన్ చేసి స్టోర్ రూంలో విద్యార్థులు గొడవ పడుతున్నారని చెబుతాడు. వెంటనే రమ్మని చెప్పగా.. వసు వెళ్తుంది. అక్కడ వెతికినా ఏం కనిపించరు. అప్పుడే లోపల ఎవరైనా ఉన్నారా అని స్టోర్ రూంలోకి వెళ్లగా.. వెనకాలే ఓ వ్యక్తి కనిపిస్తాడు. వసుకు మత్తు మందు ఇచ్చి ఆమె స్పృహ తప్పేలా చేస్తాడు. ఆ తర్వాత మనుకు మెసేజ్ పెడతారు. ఆమె ఫోన్ నుంచే.. నేను ట్రబుల్ లో ఉన్నానంటూ మెసేజ్ రాగా.. అతడు కూడా స్టోర్ రూంకు వెళ్తాడు. అక్కడే వసును చూసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మేడమ్ మేడమ్ అంటూ పిలుస్తాడు.

వాళఅలు లోపల ఉండగానే.. శైలేంద్ర వచ్చి బయట నుంచి గడియ పెట్టేస్తాడు. తీయమంటూ పిలవగా శైలేందర మాత్రం డోర్ తీయడు. మేడమ్ మేడమ్ అంటూ మళ్లీ పిలుస్తాడు. వసుకు మత్తు మందు ఇచ్చిన వాడే.. విద్యార్థుల వద్దకు వెళ్లి స్టోర్ రూం వద్ద ఏదో జరుగుతుందని... వసు, మను మేడమ్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటూ చెబుతాడు. అప్పుడే శైలేంద్ర, ఆ తర్వాత మహేంద్రలు ఎంట్రీ ఇస్తారు. మనమే అక్కడకు వెళ్లి చూద్దాం పదండి అంటూ వివరిస్తాడు. అలా వాళ్లంతా స్టోర్ రూం వద్దకు వెళ్లగా.... తలుపు తీసి చూడండి అంటూ అంటాడు. అప్పుడే లోపలి నుంచి ఏంజెల్ బయటకు వస్తుంది. ఎవర్రా డోర్ వేసింది అంటూ ఫైర్ అవుతుంది. ఎవర్రా డోర్ వేసిందని గట్టిగా అరవగా.. ఎవరిక్కడ గొడవ జరుగుతుందని చెప్పారంటూ మరింత గొడవ చేస్తుంది.
అసలు డోర్ వేసింది ఎవరు, ఇప్పుడు తలుపు తీసింది ఎవరని అనగా.. వేసినోడే కదా తీసేది అంటూ ఏంజెల్ చెబుతుంది. ఇక అక్కడి నుంచి ఏంజెల్ వెళ్లిపోగానే.. విద్యార్థులు కూడా వెళ్లిపోతారు. కొంపదీసి నా మీద డౌట్ పడుతున్నారా అనగానే.. మహేంద్ర కూడా చప్పుడు చేయకుండా వెళ్లిపోతాడు. అప్పుడే శైలేంద్ర లోపల చూస్తుండగా... మను వచ్చి శైలేంద్ర భుజంపై చేయి వేస్తాడు. నువ్వే ఈ ప్లాన్ చేశావని నాకు తెలుసంటూ మను అనగా.. ప్రూఫ్ ఏమైనా ఉందా అంటాడు. ఆధారాలు కావాలిగా తప్పని గొడవ చేస్తే సరిపోతుందా అంటూ రెచ్చిపోతాడు. అయినా నేను ఇలా చిల్లరగా ప్లాన్ చేయనని చెబుతాడు. సూటేసినంత మాత్రానా పోటుగాడిలా ఫీల్ అవ్వకంటాడు. మొన్నే ఎవరు బఫూన్ అయ్యారో తేలిందిగా అంటాడు మను. అంతకు పదింతలు కలి తీర్చుకుంటానంటాడు శైలేంద్ర.

అలాగే నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టనని.. మీ అందరికీ చుక్కలు చూపిస్తానంటూ వార్నింగ్ ఇస్తాడు. ఈ క్షణం నుంచి నేను ఏం చేస్తానో కూడా నీ ఊహకు అందదు అంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత వసును లేపే ప్రయత్నం చేస్తుంటుంది ఏంజెల్. నీళ్లు మొహంపై చల్లగానే ఆమె లేస్తుంది. బానే ఉన్నావు కదా అనగా.. ఓకే అంటుంది. ఆ తర్వాత ఎవరో ఫోన్ చేసి గొడవ జరుగుతుందని చెప్పారని.. అందుకే తాను స్టోర్ రూంకు వెళ్లినట్లు వివరిస్తుంది. తనపై మత్తు మందు చల్లారని.. అలా తాను పడిపోయినట్లు చెప్పుకొస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మను వివరిస్తాడు.


Click it and Unblock the Notifications











