Guppedantha Manasu March 22nd: అనుపమ పని పట్టేందుకు దేవయాని మరో ప్లాన్.. మహేంద్ర అడ్డుకోగలడా?
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో మహేంద్రతో ఆయన వదిన దేవయాణి ఫోన్ మాట్లాడుతుంది. అనుపమ ఆరోగ్యం గురించి ఆరా తీస్తుంది. జ్యూస్ తాగిందా, ట్యాబ్లెట్లు వేసుకుందా అంటూ అడుగుతుంది. తను బాగుంటే నాకు అంతే చాలు అంటూ చెప్పుకొస్తుంది. అలాగే తనను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారని అడగ్గా.. నాకు తెలీదు అంటాడు. ఆ తర్వాత ఆయన ఫోన్ పెట్టేయగా దేవయాని మహేంద్రను తప్పు పడుతుంది. తను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని అనగా.. మీరేమైనా చేశారా అంటూ అడుగుతాడు.
ఆ తర్వాత ఫణీంద్ర... రిషి కాలేజీ వదిలి వెళ్లేలా చేశారు, ఆ తర్వాత జగతిని చంపారు, రిషిని కనిపించకుండా చేశారు, ఇప్పుడు కాలేజీకి సాయం చేస్తున్న మనును చంపాలనుకున్నారు... ఎవరో కానీ ఇదంతా కాలేజీ కోసమే చేస్తున్నారనిపిస్తుందని ఫణీంద్ర అంటాడు. వారెవరో నువ్వే త్వరగా కనిపెట్టాలని శేలేంద్రకు చెబుతాడు. అప్పుడు వాళ్ల సంగతి చెప్తానని అంటాడు. కాలేజీలో నువ్వు చేసే పనేం లేదని.. కనీసం మన శత్రువులు ఎవరో అదైనా కనిపెట్టు అని అంటాడు. వాళ్లని సాక్ష్యాధారాలతో పట్టుకుని నా ముందుకు తేవాలని అంటాడు.

ఆ తర్వాత ఆస్పత్రిలో మను కూర్చుని బాధ పడుతూ ఉంటాడు. అప్పుడే ఏంజెల్, వసు వచ్చి ఆయనకు సాండ్ విచ్ ఇస్తారు. నాకొద్దు, ఆకలి వేయట్లేదు అంటూ మన అంటాడు. మనసు బాలేకపోవడం వల్ల ఆకలిగా లేదని మను చెబుతుండగా.. ఏంజెల్ మాత్రం తిను అంటుంది. అత్తయ్య నీ దగ్గర ఉంటే నీ కడుపు నింపకుండా ఉంటుందా అని అంటూ.. తన తల్లిని చిన్నప్పుడే దూరం చేసుకుని ఎన్నో సమస్యలు పడినట్లు తెలిపింది. ఆ తర్వాత వసు, ఏంజెల్ లు కలిసి సాండ్ విచ్ తీసి చేతిలో పెడతారు. తనిడం కాదు అంటే నేనే తినిపిస్తాను అనగానే ఆయన తింటాడు.
ఆ తర్వాత మనుకు పొలమారగా.. వసు నీళ్లు తీసుకు వస్తుంది. ఆలోపే ఏంజెల్ నీళ్లు తీసుకు వచ్చి తాగిస్తుంది. నిజంగానే నీకు తినడం రాదంటూ మనుపై జోక్ చేస్తుంది.. ఆ తర్వాత ఏంజెల్ మహేంద్ర సార్ ఎక్కడ అని అంటుంది. ఆ తర్వాత డాక్టర్ వచ్చి అన్ని టెస్టులు చేశాం.. ఎలాంటి సమస్యా లేదు... ఈ ఒక్కరోజు అబ్జర్వేషన్ లో ఉంచుతామని చెబుతుంది. రేపు మార్నింగ్ డిశ్చార్జి చేస్తామని వివరిస్తుంది. ఆ తర్వాత ఏంజెల్, మహేంద్రలు మా ఇంటికి తీసుకెళ్తామంటే, మా ఇంటికి తీసుకెళ్తామని అంటారు. ఆ తర్వాత తల్లి ప్రేమ పొందని నాకు అత్త ప్రేమ అయినా దొరకాలి అంటూ వివరిస్తుంది.
ఆ తర్వాత వసు నువ్వు అయినా చెప్పు అనగా.... మను,, అనుపమ కొడుకు. ఆయ నిర్ణయమే ఫైనల్ అంటుంది. అంతా ఆలోచించిన మను... నా నిర్ణయంతో పనేముందండి.. ఆమెకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడికి వెళ్తుందని అంటాడు. ఆ తర్వాత మహేంద్ర.. వసు నువ్వే అనుపమను తీసుకు రావాలి ఇంటికి అని చెబుతుంది. ఇక ఆ తర్వాత దేవయాని శైలేంద్రకు కాఫీ తీసుకు వచ్చి ఇస్తుంది. సిట్యువేషన్ ఏంటి నువ్వు చేసేదేంటి మమ్మీ అనగా.. జ్యూస్ తేవాలా వేసవి కాలం కదా.. గుర్తులేక కాపీ తెచ్చానని అంటుంది. ఆ తర్వాత కోప్పడ్డ శైలేంద్ర ఇంత కూల్ గా ఎలా ఉంటున్నావు మమ్మీ అని అడుగుతాడు.
ఆ తర్వాత దేవయాని శైలేంద్ర ఏం చేయాలో చెబుతుంది. ముఖ్యంగా అనుపమ భర్త ఎవరు, మను తండ్రి ఎవరు అని అడుగుతుంది. ముందు ఆ సీక్రెట్ తెలుసుకో.. దాన్ని బట్టి వాళ్లిద్దరినీ ఓ ఆట ఆడుకోవచ్చు అంటూ చెబుకొస్తాడు. ఏమాత్రం తొందర పడకుండా చూడాలి అంటూ చెబుతారు. ఆ తర్వాత అనుపమ, నాకో రసవత్తర సన్నివేషం పడాలి అనగా.. అయితే ఆస్పత్రికి వెళ్లు అంటుంది. కానీ ఆమె వద్దు ఇంటికెళ్లాకే వెళ్దాం అంటుంది. ఇక ఆ తర్వాత అనుపమను ఇంటికి తీసుకు వస్తారు. ముందుగా కారు దిగిన అనుపమ కింద పడిపోతుండగా.. మను పట్టుకుంటాడు.
జాగ్రత్త అనుపమ అంటూ మహేంద్ర చెప్పగా.. చూస్కోవడానికి తన కొడుకు ఉన్నాడు కదా మామయ్యా అంటూ వసు అంటుంది. అలా ఇంట్లోకి వచ్చిన అనుపమ మా ఇంటికి వెళ్లేదాన్ని కదా అంటుంది. అక్కడ చూస్కోడానికి ఎవరున్నారు అంటే.. ఇన్నాళ్లు ఎవరైనా ఉంటేనే నేనిలా ఉన్నానా అంటూ అడుగుతుంది. ఆ తర్వాత మెడిసిన్ కార్లోనే ఉన్నాయి అని మహేంద్ర అనగా.. నేను వెళ్లి తీసుకు వస్తానని ఏంజెల్ అంటుంది. కానీ వసు మాత్రం ఆగు అనగా.. మను షాక్ అవుతాడు.


Click it and Unblock the Notifications











