Guppedantha Manasu April 16th: అనుపమ ఇల్లీగల్ రిలేషన్.. దేవయానికి వసు మాస్ వార్నింగ్!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో శైలేంద్ర తెగ సంతోషంగా ఫీల్ అవుతాడు. మను పరువు పోవడం తాను కళ్లారా చూడడం చాలా బాగా అనిపించిందని మనుసులో అనుకుంటాడు. అలాగే మనును కాలేజీకి తీసుకురమ్మని అంటారా.. వాడి మీద నేను గెలిచాను గెలిచాను అంటూ కళలు కంటాడు.. అప్పుడే అక్కడ విద్యార్థులు అంతా నిలబడి చూస్తూ షాక్ అవుతారు. మీరేంట్రా ఇక్కడున్నారని అనగానే.. ఆయన గాల్లో తేలితే మనకేంటి, వాగులో దూకితే మనకేంటని చెప్పి వెళ్లిపోతారు. ఆ తర్వాత శైలేంద్ర.. అసలు మనుయే తన కొడుకు అని బాబాయ్ ఎందుకు చెప్పారని అనుకుంటాడు. ఇక ఆ తర్వాత వసు, మహేంద్రలను చూపిస్తారు.

ఎందుకిలా చేశారు మామయ్యా అంటూ వసు అనగానే.. మను కోసమే చేశానని అంటాడు. అనుపమ ఫీల్ అవ్వడం, మనను మనోవేదన చూడలేకే అలా చేశానని వివరిస్తాడు. కానీ మీరిలా చేయడం చాలా తప్పు మామయ్యా... అప్పటి సమస్య తీరేందుకు ఇలా చెప్పడం బాగానే ఉన్నా, ఆ తర్వాత పర్యావసనాలు కూడా తట్టుకోవడం చాలా కష్టమని వసు అంటుంది. ఒకప్పుడు జగతి విషయంలోనూ ఇలాగే చేశానని.. ఇప్పుడు మను, అనుపమల కోసం నేనే తండ్రినని అబద్ధం చెప్పానని అంటుంది. అలాగే దీని వల్ల తనకు ఎలాంటి సమస్యలు ఎదురు అవవని మహేంద్ర వివరించాడు. వసు మాత్రం ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనగా.. ఏమనుకున్న సమస్య లేదని.. అనుపమ కోసమే ఇలా చేశానని అన్నారు.

Mahendra Said He is The Father of Manu on Guppedantha Manasu April 16th 2024 Episode 1051

మీరే తండ్రినని చెప్పడంతో అనుపమ, మనులు ఎలా రియాక్ట్ అవుతారో తనకు తెలియదని.. ఏం జరుగుతుందో చూడాలని అంటారు. ఆ తర్వాత అనుపమను చూపిస్తారు. ముఖ్యంగా మహేంద్రే మను తండ్రి అని చెప్పడాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే దేవయాని వచ్చి ఇదేంటి అనుపమ ఇన్ని ట్విస్ట్ లు ఇస్తున్నావేంటి అంటుంది. మను తండ్రి ఎవరో తెలీదని చెప్పి.. ఇప్పుడు మహేంద్రే తండ్రి అని చెప్పడం ఏంటంటూ అడుగుతుంది. మీకేమైనా ఇల్లీగల్ రిలేషన్ ఉందా అంటూ అడగ్గా.. మను పక్కనే ఉండి కోప్పడుతూ ఉంటాడు. అప్పుడే వసు వచ్చి మేడమ్ ఆగండి అంటూ ఆపుతుంది.

ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నారని అనగా.. దేవయాని నేనేమైనా తప్పు మాట్లాడుతున్నానా అని అంటుంది. నేనేం లేనిపోనివి కల్పించి మాట్లాడట్లేదు కదా అంటూ చెప్పుకొస్తుంది. నిజం ఏంటో చెప్పేస్తే ఇదంతా ఉండదు కదా అని అంటుంది. కావాలంటే నువ్వే నిజం తెలుసుకుని చెప్పు.. నా మీద అరవడం కాదు అంటూ వసును అంటుంది. ఆపై అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే మహేంద్రను చూపిస్తారు. అతడు కూడా తానే తండ్రినని చెప్పిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మను వస్తాడు. ఏంటి మను నేను చేసింది కరెక్టు కాదు అని చెప్పడానికి వచ్చావా అని అనగా.. నాకు తండ్రి అనే పదమే నచ్చదు సార్ అని అంటాడు మను. నేను అతడిని తెలుసుకోవడానికి కారణం అతడిని నేను నిలదీయాలని మాత్రమే అంటాడు.

నీ కళ్లల్లో నీళ్లు, అనుపమ మొహంలో బాధ చూడలేకే ఇలా చేశానని మహేంద్ర వివరించగా.. మేమివన్నీ చాలా రోజులుగా భరిస్తూనే ఉన్నామని మహేంద్ర చెప్పుకొస్తాడు. మా బాధ చూడలేక మీరే తండ్రినని చెప్పారు కానీ ఆ తర్వాత వచ్చే సమస్యల గురించి వివరించలేదేంటని అంటాడు. ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుందని.. మను అనగా.. అందుకే నేను నీ తండ్రి స్థానంలోకి వచ్చానని వివరిస్తాడు. నాకు తండ్రి అంటే కోపం, ధ్వేషం అని.. నా మనసులో తండ్రి స్థానం ఏంటో తెలిస్తే మీరు తట్టుకోలేరని అంటాడు. ఇక అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత శైలేంద్ర, దేవయానిలు కనిపిస్తారు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా అయిపోయిందని వివరిస్తాడు శైలేంద్ర.

Mahendra Said He is The Father of Manu on Guppedantha Manasu April 16th 2024 Episode 1051

మనును రెచ్చగొట్టి సమస్య ఇవ్వాలనుకోగా.. బాబాయ్ ఎంటర్ అయి తండ్రినని చెప్పి షాకిచ్చాడని అంటాడు. ఆ తర్వాత దేవయాని నాకేం తెలుసు.. ఇలా జరుగుతుందని అంటాడు. మరో ప్లాన్ వేసి మరీ.. మీ నాన్న ముందు బాబాయ్ విషయం పదే పదే తీసుకు రావాలని అంటుంది. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయని వెంటనే ఉపయోగించుకోవాలని చెబుతాడు. ఇంటికి వెళ్లిని అనుపమ దేవయాని అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ బాధ పడుతుంది. అప్పుడే మహేంద్ర అక్కడకు వస్తాడు. అనుపమను పిలిస్తే అస్సలే పలకదు. నా మీద కోపమా, నాతో మాట్లాడవా అంటూ అడుగుతాడు. నేనేం తప్పు చేయలేదు అనుపమ.. నువ్వు నాతో మాట్లాడకుండా ఉండడానికి అంటూ వివరిస్తాడు.

మనును నిజంగానే నా కొడుకులానే చూసుకున్నానని.. నా సమస్యలన్నీ తానే తీర్చాడని వివరిస్తాడు. అందుకే మనును నా కొడుకు అనుకున్నాని చెబుతాడు. కొడుకు అనుకోవడం వేరు, కొడుకుని చెప్పడం వేరని చెప్పుకొస్తాడు. అలాగే మీరు వేరే రకంగా సపోర్ట్ చేసుకోవచ్చు కానీ.. తండ్రి అనే పెద్ద బాధ్యతను నువ్వు తీసుకోవడం తప్పని చెబుతుంది. ఇంతటితో ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X