Mahesh Babu-Sitara: బుల్లితెరపై మహేశ్ బాబు.. సితారతో కలిసి ఆ డ్యాన్స్ షోలో..! వీడియో వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన మహేశ్ బాబు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హిట్లు, ఫట్లు అని ఆలోచించకుండా ప్రయోగాత్మక సినిమాలను ఎంకరేజ్ చేస్తుంటాడు. ఎలాంటి వివాదాలు లేకుండా తన పని తాను చూసుకుంటూ పోయే హీరోగా ముద్ర వేసుకున్నాడు. అలాగే సినిమాలతోపాటు ఫ్యామిలీ లైఫ్‌ను కూడా బ్యాలెన్స్‌గా మెయింటేన్ చేయడంలో మహేశ్ బాబు తనకు తనే సాటి. ఇక మహేశ్ బాబుకు తన గారాల పట్టి సితార, కొడుకు గౌతమ్ అంటే ఎంత ప్రేమో చెప్పనవసరం లేదు. తాజాగా తన కుమార్తె సితారతో బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు టాలీవుడ్ అందగాడు.

సినిమాలతో బిజీ..
సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస పెట్టి సనిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల సర్కారు వారి పాట చిత్రంతో మంచి విజయం అందుకున్న ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా, దర్శక ధీరుడు రాజమౌళితో ఓ చిత్రం తీయనున్నాడనే విషయం తెలిసిందే.

కాస్త దూరంగా..
ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తాడు మహేశ్ బాబు. ప్రతి సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని కుటుంబంతో కలిసి సరదాగా ఫారెన్ టూర్లు వేస్తుంటాడు మహేశ్ బాబు. అయితే సినిమాలు, ఫ్యామిలీతో గడిపే మహేశ్ బాబు బుల్లితెరకు కాస్త దూరంగానే ఉంటాడని చెప్పాలి.

అన్‌స్టాపబుల్ షోలో..
ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ షోలో మహేశ్ బాబు పాల్గొన్నాడు. ఆయన మాటలతో, పలు ఆసక్తికర విషయాలతో ఆద్యంత సందడిగా సాగింది ఆ ఎపిసోడ్. తాజాగా మళ్లీ ఓ టీవీ షోలో తళుక్కున మెరిశారు మహేశ్ బాబు.

సితారతో మహేశ్..
ఓ ఛానెల్ నిర్వహిస్తోన్న డ్యాన్స్ షోకి మహేశ్ బాబు అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా మహేశ్ బాబుతో పాటు ఆయన గారాల కూతురు సితార కూడా ఈ షోలో కనిపించనుంది. మహేశ్‌తో పాటు సితార కనిపించడంతో టాపిక్ స్పెషల్‌గా మారింది.

వీడియో వైరల్..
దీనికి సంబంధించిన షూటింగ్లో పాల్గొనెందుకు మహేశ్ బాబు తన కూతురు సితారతో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సితార చేయి పట్టుకుని మహేశ్ నడిపించడం మనం చూడొచ్చు.
ఫ్రాక్‌లో సితార..
ఇందులో మహేశ్ బాబు స్టైలిష్ అవుట్ ఫిట్ ధరించగా, సితారా కూడా గ్లిట్టర్ ఫ్రాక్ వేసుకుని ఆకట్టుకునేలా ఉంది. మరి మహేశ్ బాబు, సితార పాల్గొన్న ఈ షో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో వేచి చూడాలి. కాగా మహేశ్ బాబు 28వ చిత్రం (SSMB 28) వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











