‘సర్కారు వారి పాట’లో హైలైట్ సీన్ అదే: మహేశ్ బాబు కెరీర్‌లో తొలిసారి అలా!
'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం దీన్ని తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో 'మహానటి' ఫేం కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. 'సర్కారు వారి పాట' మూవీలో ఇంటర్వెల్‌కు ముందు అదిరిపోయే యాక్షన్ సీన్‌ను క్రియేట్ చేశారట. దివ్యాంగుల కోసం హీరో మహేశ్ బాబు చేసే ఈ ఫైట్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. దాదాపు పదిహేను నిమిషాల పాటు ఉండే ఈ యాక్షన్ సీక్వెన్స్ ఎంతో కొత్తగా డిజైన్ చేస్తున్నారట ప్రముఖ ఫైట్ కొరియోగ్రాఫర్స్. గతంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సుప్రీమ్' సినిమాలోనూ ఇదే తరహా ఫైట్ ఉంటుంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ కారణంగానే మహేశ్ సినిమాలోనూ ఇది ట్రై చేస్తున్నాడట దర్శకుడు పరశురాం.

ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి మహేశ్ బాబు గైర్హాజరు అవగా.. ఆయనకు బదులు భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితార దానికి వచ్చారు. ఇక, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జనవరి మూడో వారం నుంచి ప్రారంభం కాబోతుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుందని తెలుస్తోంది. ఇది పూర్తయిన వెంటనే మరో లాంగ్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ అమెరికా పయనం అవుతుందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











