Mahesh babu: బుల్లితెర ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న మహేష్.. స్పెషల్ షోలో సితారతో సందడి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే రోజుల్లో అతిపెద్ద ప్రాజెక్టులతో బిజీ కానున్న విషయం తెలిసిందే. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ ఒక విభిన్నమైన ప్రాజెక్టును స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. అయితే రాబోయే మరి కొన్ని రోజుల్లో మహేష్ బాబు తన కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు కూడా వైరల్ గా మారుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

త్రివిక్రమ్ తో సినిమా
మహేష్ బాబు ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన విషయం తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ కూడా పూర్తిస్థాయిలో అయితే అభిమానులను మెప్పించలేకపోయింది. ఇక మహేష్ ఎలాగైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే మళ్లీ ఫామ్ లోకి రావాలి అని అనుకుంటున్నాడు. ఆ ప్రాజెక్ట్ సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ కాబోతోంది.

బుల్లితెరపై మహేష్
అయితే మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ మొదలుపెట్టే కంటే ముందే బుల్లితెరపై గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ షో మంచి క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అందులో మహేష్ బాబు ఒక ఎపిసోడ్లో దర్శనమివ్వబోతున్నట్లు సమాచారం.

సితార కూడా
మహేష్ బాబు మాత్రమే కాకుండా ఆయన కూతురు సితార కూడా ఆ డాన్స్ షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా మహేష్ బాబు ఈ తరహా రియాలిటీ షోలలో కనిపించింది లేదు. ఇక ఇప్పుడు ఈ డాన్స్ షోలో ఏ విధంగా కనిపిస్తారు అనేది వైరల్ గా మారుతుంది. అలాగే సీతార ఏదైనా స్పెషల్ డాన్స్ తో ఆకట్టుకుంతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

వచ్చే ఏడాది సమ్మర్ లో..
ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ షూటింగ్ ను ఈ ఏడాది చివరిలోపు ఫినిష్ చేసి సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే విడుదలపై కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తప్పకుండా అనుకున్న సమయానికి వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము అని అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చారు

బిగ్గెస్ట్ ప్రాజెక్ట్
మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అనంతరం మళ్లీ వెంటనే రాజమౌళి సినిమాతో బిజీ కానున్నాడు. ఆ ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్ లో మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరపైకి రాబోతోంది. దాదాపు 300 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా సినిమాలో మరొక ప్రముఖ హీరో ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తాడని కూడా టాక్ అయితే వస్తోంది. మరి రాజమౌళి మహేష్ బాబును ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











