Mahesh Babu: ’బిగ్‌బాస్‘ రోహిణితో మహేశ్ బాబు ఫన్​.. సూపర్ స్టార్ పంచ్​ మాములుగా లేదుగా!

సూపర్ స్టార్ మహేశ్​ బాబు కామెడీ టైమింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. దూకుడు, ఖలేజా సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్​ సూపర్ పాపులర్ అయింది. ఇదిలా ఉంటే నిజ జీవితంలో కూడా మహేశ్​ బాబుకు మంచి సెన్సాఫ్​ హ్యూమర్ ఉందని విన్నాం. ఆయన వేసే పంచ్​లకు పడి పడి నవ్వాల్సిందే అని అనేక మంది హీరోయిన్లు చాలా సందర్భాల్లో తెలిపారు. తాజాగా ఆయన తన పంచ్​లతో ప్రేక్షకులను నవ్వించారు. ఇటీవల ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్​ షోలో మహేశ్​ బాబు పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన విడుదల చేసిన ప్రొమోలో ఆయన ఆద్యంతం నవ్వించారు.

సినిమాల్లో యాక్షన్​, ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించే సూపర్ స్టార్ మహేశ్​ బాబు కామెడీతో కూడా తెగ నవ్విస్తాడు. ఆయన ఆద్యంతం కామెడీ పండించిన ఖలేజా, దూకుడు చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మహేశ్​ బాబు రియల్ లైఫ్​లో కూడా పంచ్​లతో ఎంటర్​టైన్​ చేస్తారని తెలిసిన విషయమే.

బుల్లితెరపై..

బుల్లితెరపై..


మహేశ్ బాబు వేసే పంచ్​లకు కచ్చితంగా నవ్వాల్సిందేనని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లతోపాటు హీరోలు కూడా అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కొన్ని ఈవెంట్లు, మీడియా మీట్​లతో మహేశ్​ బాబు మాట్లాడే విధానం చూస్తే ప్రేక్షకులకు సైతం అర్థమైపోతుంది. ఇక మరోసారి తన కామెడీ టైమింగ్​ను, పంచ్​లను బుల్లితెరపై చూపించాడు మహేశ్​ బాబు.

తనదైన స్టైల్​లో నవ్వులు..

తనదైన స్టైల్​లో నవ్వులు..

జీ తెలుగు టీవీ ఛానెల్ నిర్వహిస్తోన్న డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షోలో మహేశ్​ బాబు తన కూతురు సితారతో కలిసి సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది జీ తెలుగు. ఇందులో తనదైన స్టైల్​లో నవ్వులు పూయించాడు మహేశ్​ బాబు.

పూరిలా గెటప్​..

పూరిలా గెటప్​..

ఈ షోలో జబర్థస్త్​ లేడి కమెడియన్​ రోహిణి అతడు మూవీలో త్రిష పాత్ర పూరిలా గెటప్​ వేసుకొని వచ్చంది. మహేశ్ బాబు పూరి అని పిలవగానే రోహిణి వచ్చింది. అలా చూడకండి, మీ చూపులు నా వీపును గుచ్చుకుంటున్నాయి అని నవ్వించింది రోహిణి. తర్వాత హీరోయిన్​ అవ్వాలంటే ఏం చేయాలి అని మహేశ్​ బాబుని రోహిణి అడగ్గా.. సినిమాలు చేయాలని పంచ్ వేశాడు మహేశ్​ బాబు.

రోహిణితో మహేశ్​ కామెడీ..

రోహిణితో మహేశ్​ కామెడీ..

ఆ తర్వాత ఇలా బుగ్గలు వచ్చేస్తున్నాయి.. బాగుండాలి అంటే ఏం చేయాలి అని రోహిణి అడగ్గా.. బాగున్నారండీ అని మహేశ్ బాబు అనడంతో సిగ్గుతో పక్కనున్న యాంకర్​ను గుద్దేస్తుంది రోహిణి. ఇలా రోహిణి, మహేశ్ బాబు కలిసి షోలో కామెడీ పండించారు. అలాగే ఈ షోలో ఇద్దరు డ్యాన్సర్లకు సినిమాలో అవకాశం ఇస్తానని మహేశ్ బాబు మాట ఇచ్చిన విషయం తెలిసిందే.

వారికి ఫిదా..

వారికి ఫిదా..

ఈ షోలో బాబు అండ్​ కుమార్​ చేసిన డ్యాన్స్​కు ఫిదా అయిన మహేశ్ బాబు ''మీకు హ్యాట్సాఫ్​. మీరు నటించలేదు. జీవించేశారు. నేను చేసే సినిమా గానీ, నేను తీసే సినిమాలో గానీ మీకు కచ్చితంగా అవకాశం ఇస్తాను'' అని తెలిపాడు. ఈ ఒక్క మాటతో స్టేజ్​ అంతా చప్పట్లో మారుమోగిపోయింది.

సితార కామెంట్​..

తమకు అవకాశం ఇస్తా అన్న మహేశ్ బాబు కాళ్లపై బాబు అండ్​ కుమార్​ పడగా, వారిని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు మహేశ్ బాబు. అలాగే ఇందులో పాల్గొన్న సితార సైతం వారి డ్యాన్స్​ పెర్ఫామెన్స్​ను ''ఇట్ వాస్​ మైండ్​ బ్లోయింగ్'' అంటూ పొగిడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X