‘మహర్షి’ పార్టీలో మహేష్ బాబుతో విజయ్ దేవరకొండ, అల్లరి నరేష్ మిస్సింగ్
మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మహర్షి'. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మించిన ఈ చిత్రం మే 9న విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది.
సినిమా సూపర్ సక్సెస్ ఖాయం అనే సంకేతాలు రావడంతో 'మహర్షి' చిత్ర బృందం గురువారం రాత్రి వేడుక చేసుకున్నారు. ఈ పార్టీలో హీరో హీరోయిన్లు మహేష్ బాబు, పూజా హెగ్డేతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఇతర టెక్నీషియన్లు పాల్గొన్నారు.

అయితే ఈ పార్టీలో అల్లరి నరేష్ మిస్సయ్యారు. చిత్ర బృందంతో పాటు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, అనిల్ రావిపూడి, అనిల్ సుంకర కూడా పాల్గొనడం గమనార్హం. మహేష్ బాబు తన తర్వాతి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.
మే9న 'మహర్షి' మూవీ విడుదలతో పాటు విజయ్ దేవరకొండ పుట్టిరోజు కూడా కావడంతో బర్త్ డే వేడుక కూడా జరిగినట్లు సమాచారం. విజయ్‌తో కలిసి డియర్ కామ్రెడ్ చిత్రంలో నటిస్తున్న రష్మిక కూడా ఇందులో జాయిన్ అయ్యారు.

కాగా... 'మహర్షి' చిత్రం తొలి రోజు సంచలన వసూళ్లతో బాక్సాఫీసు వద్ద అదరగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 24.6 కోట్ల షేర్ వసూలు చేయడంతో పాటు పలు నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. సమ్మర్ హాలిడేస్ కావడం, భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేయడం మరింత కలిసొచ్చే అంశం.
ఈ చిత్రంలో ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.


Click it and Unblock the Notifications











