మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. తొమ్మిదోసారి అదిరిపోయే టీఆర్పీ రాబట్టిన “మహర్షి”!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు.. గత ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఇప్పుడు గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే మహేష్ బాబు వరుసగా టెలివిజన్ రికార్డులు క్రియేట్ చేస్తూ వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

టెలివిజన్‌లో మహర్షి సినిమా తొమ్మిదోసారి

టెలివిజన్‌లో మహర్షి సినిమా తొమ్మిదోసారి

మహేష్ బాబు కెరీర్ మొత్తంగా చూస్తే ఆయన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఇలా మూడు సినిమాలు వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. అలానే ఆ మూడు సినిమాలు బుల్లితెర ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మహర్షి సినిమా టెలివిజన్‌లో తొమ్మిదోసారి ప్రదర్శించగా అనూహ్యమైన స్పందన సాధించింది.

తొమ్మిదో సారి కూడా మహేష్ దుమ్ము రేపాడు

తొమ్మిదో సారి కూడా మహేష్ దుమ్ము రేపాడు

అసలు విషయానికి వస్తే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమా రూపొందింది. సందేశాత్మక సినిమాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. సందేశాత్మక సినిమానే అయినా ఎక్కడా అలా అనిపించకుండా కమర్షియల్ గా కూడా హిట్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. అయితే ఈ సినిమా బుల్లితెర మీద ఎన్ని సార్లు టెలికాస్ట్ అయిన అన్ని సార్లు రికార్డు స్థాయి టిఆర్పి తెచ్చుకుని ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమా మొత్తం మీద జెమినీ టీవీలో తొమ్మిది సార్లు టెలికాస్ట్ అయ్యింది. తాజాగా తొమ్మిదో సారి టెలికాస్ట్ అయినప్పుడు కూడా రికార్డుగా 4.92 టిఆర్పి తెచ్చుకుంది..

మహేష్ కి కొత్త ఏమీ కాదు

మహేష్ కి కొత్త ఏమీ కాదు

అయితే బుల్లితెర విషయంలో రికార్డులు సాధించడం మహేష్ కు ఇది కొత్త ఏమీ కాదు. ఎందుకంటే గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా టెలివిజన్ లో టెలీకాస్ట్ అయిన సమయంలో కూడా సత్తా చాటింది. మొట్టమొదటి సారిగా లాక్డౌన్ సమయంలో టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా రికార్డు స్థాయిలో 29.4 రేటింగ్ సాధించింది.. అలాగే తెలుగు సినిమాల జాబితాలో నెంబర్ వన్ టీ ఆర్ పి రేటింగ్ సాధించిన సినిమాగా కూడా రికార్డ్ సృష్టించింది.

రెండోసారి రేటింగ్

రెండోసారి రేటింగ్

అలాగే ఈ సినిమా రెండోసారి ప్రసారం అయిన సమయంలో కూడా 17.40 రేటింగ్ అందుకుని గత ఏడాదికి గాను మొత్తం టిఆర్పి రేటింగ్ లిస్ట్ లో మూడో సినిమాగా నిలిచింది. తాజాగా మహర్షి సినిమాకి వచ్చిన రేటింగ్ చూస్తే మహేష్ బాబు స్టామినా ఏమాత్రం తగ్గలేదు అనే విషయం క్లారిటీ వస్తుంది.

సర్కారు వారి పాట విషయంలో కన్ఫ్యూజన్

సర్కారు వారి పాట విషయంలో కన్ఫ్యూజన్

ఇక మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ దుబాయ్ లో పూర్తయింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ చేయాలని భావిస్తున్నా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేస్తూ వస్తోంది

Recommended Video

Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
దుబాయ్‌‌లో సర్కార్ వారీ పాట

దుబాయ్‌‌లో సర్కార్ వారీ పాట


ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు వారి పాట షూటింగ్ మళ్ళీ దుబాయ్ లో షూటింగ్ చేస్తారా ? లేక ఇండియా లోనే షూట్ చేస్తారా ? అనే అంశాలు కూడా సినిమా యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రకటించింది. కానీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X