మహేష్, నమ్రత టిప్స్ ఇచ్చారా? బిగ్‌బాస్‌లో సల్మాన్ ప్రశ్నకు శిల్పా శిరోద్కర్ జవాబు ఏంటో తెలుసా?
బాలీవుడ్ నటి, నమత్ర శిరోద్కర్ సోదరి శిల్ప శిరోద్కర్ బిగ్‌బాస్ రియాలిటీ షోలోకి అడుగుపెట్టారు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్ హిందీ సీజన్ 18లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. తాను నటించిన సినిమాల్లోని పాటలపై డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ వేదికపైన సల్మాన్ వద్దకు చేరుకొన్నది. ఆ తర్వాత సల్లూభాయ్‌ను చూసి సిగ్గుపడింది. ఎట్టకేలకూ మీతో కలిసి నటించలేకపోయాను. కానీ బిగ్‌బాస్ ద్వారా మిమల్ని మరోసారి కలిసే అవకాశం దక్కిందన్నారు. శిల్పా శిరోద్కర్ ఎలా ఎంట్రీ ఇచ్చిందంటే?
శిల్పా శిరోద్కర్ కెరీర్ విషయానికి వస్తే.. బ్రష్టాచార్ అనే సినిమాలో అక్షయ్ కుమార్, రేఖతో కలిసి ఆమె నటించి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి దాదాపు 60 సినిమాలకుపైగా నటించింది. తెలుగులో బ్రహ్మ సినిమా, అలాగే అమితాబ్ నటించిన ఖుదా గవా, గోపి కిషన్, బేవఫా సనమ్, గజ గామిని, బాద్మాష్ లాంటి సినిమాల్లో నటించింది.

సల్మాన్‌తో శిల్పా మాట్లాడుతూ.. 80, 90 దశకంలో నీతో కలిసి నటించలేకపోయాను. అలా ఎందుకు జరిగిందో తెలియదు. కానీ ఈ రోజు మాత్రం మిమ్మల్ని ఇలా బిగ్‌బాస్ స్టేజ్‌పై కలుసుకోవడం హ్యాపీగా ఉంది అని శిల్పా చెప్పింది. అయితే బిగ్‌బాస్ అంటే యూత్‌కు సంబంధించింది. ఇక్కడ యువతీ, యువకులు చేసే పనులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. నీవు అడ్జస్ట్ కాగలవా? అని అడిగితే.. నాకు అలాంటివి ఇబ్బంది కాదు అని చెప్పింది.
బిగ్‌బాస్ వేదికపై సల్మాన్ మాట్లాడుతూ.. సినిమాల్లో ఎలాగు నటించలేకపోయాం. కానీ కలిసి బిగ్‌బాస్ స్టేజ్‌పై ప్రయాణం చేద్దాం అని.. అంటూ ఓ ఆర్టిఫిషియల్ కారును తయారు చేసి.. తన పక్కన సీటులో కూర్చోపెట్టుకొని డ్రైవింగ్ మొదులపెట్టారు. మై నే ప్యార్ కియా సినిమాలోని పాటను ప్లే చేసి.. నా పక్క సీట్లో ఎవరో ఒక్కరు చివరకు కూర్చొన్నారు అంటూ చిలిపిగా కామెంట్ చేశాడు.

బిగ్‌బాస్‌లో వస్తున్న సమయంలో నా 20 ఏళ్ల కూతురు, నా భర్త, నా సోదరి నమ్రత, నా బావ, నా ఫ్యామిలీ అందరూ నాకు సపోర్టుగా ఉంటారు. నేను ఇష్టపడి ఈ షోలోకి వస్తున్నాను. దానికి అందరూ సపోర్టుగా ఉంటామని చెప్పారు. అలాంటి ప్రోత్సాహంతో ఇంటిలోకి అడుగుపెట్టాను అని శిల్పా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
మీ బావ సూపర్ స్టార్ మహేష్ బాబు, సోదరి నమత్ర శిరోద్కర్ నుంచి ఎమైనా టిప్స్ వచ్చాయా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నా సోదరి, బావ నుంచి ఎలాంటి టిప్స్ తీసుకోలేదు. మేము ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోం. ఒకరిని ఒకరు ప్రోత్సాహించుకొంటాం అని శిల్ప శిరోద్కర్ సమాధానం ఇచ్చారు. అలా ఆమె ఇంటిలోకి అడుగుపెట్టింది.


Click it and Unblock the Notifications











