Mahesh Babu: డ్యాన్స్​ షోలో మెరిసిన మహేశ్​ బాబు.. రెమ్యునరేషన్​ ఎంతంటే?

సూపర్ స్టార్ మహేశ్​ బాబు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ లైఫ్​ను ఎంజాయ్​ చేస్తారు. రెండింటిని బ్యాలెన్స్​డ్​గా మెయింటేన్​ చేస్తూ ఆశ్చర్యపరుస్తాడు. ఇలా అటు సినిమాలు, ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్​ చేయడం వాళ్ల నాన్న కృష్ణ నుంచే నేర్చుకున్నానని పలు సందర్భాల్లో తెలిపాడు. అయితే మహేశ్​ బాబు బుల్లితెరకు కాస్త దూరంగా ఉంటాడనే చెప్పవచ్చు. ఇటీవల అన్​స్టాపబుల్ షోలో పాల్గొన్న మహేశ్​ బాబు తాజాగా జీ తెలుగు ఛానెల్​లో ఓ డ్యాన్స్ షోలో కనిపించనున్నాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ షోలో కనిపించినందుకు మహేశ్​ బాబు తీసుకున్న రెమ్యునరేషన్​ హాట్​ టాపిక్​గా మారింది.

సితారతో కనువిందు..

సితారతో కనువిందు..

బుల్లితెరకు దూరంగా ఉండే మహేశ్​ బాబు తాజాగా జీ తెలుగు ఛానెల్ ప్రసారమయ్యే డ్యాన్స్​ ఇండియా డ్యాన్స్ షోలో మెరిశారు. ఎంతోమంది తమ డ్యాన్స్​తో ఆకట్టుకునే ఈ షోకి మహేశ్​ బాబు గెస్ట్​గా హాజరయ్యారు. అంతేకాకుండా మహేశ్​ బాబుతో పాటు ఆయన కుమార్తె సితార కూడా ఈ షోలో కనువిందు చేయనుంది. ఈ షో షూటింగ్​కు సంబంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

హాట్​ టాపిక్​గా రెమ్యునరేషన్​..

హాట్​ టాపిక్​గా రెమ్యునరేషన్​..

అలాగే తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రొమో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఇందులో తన కూతురు సితార చేయి పట్టుకోని స్టేజ్​పైకి ఎంట్రీ ఇచ్చాడు మహేశ్​ బాబు. ఇందులో భాగంగా సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్​కు స్టెప్పులేసింది సితార. అయితే ప్రస్తుతం సితారతో కలిసి మహేశ్​ బాబు ఈ షోకి అతిథిగా రావడం, అలాగే ఇందుకు అతను తీసుకునే రెమ్యునరేషన్ హాట్​ టాపిక్​గా మారింది.

అన్ని కోట్లా?

అన్ని కోట్లా?

ప్రముఖ టీవీ ఛానెల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్యాన్స్ ఇండియా డ్యాన్స్​ షోకి అతిథిగా ఎంట్రీ ఇచ్చినందుకు గాను మహేశ్​ బాబు రూ. 9 కోట్లు తీసుకున్నాడని టాక్​ వినిపిస్తోంది. ఇంత భారీ మొత్తాన్ని ఆఫర్​ చేయడంతోనే మహేశ్​ బాబు ఈ డ్యాన్స్ షోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అనేక కంపెనీలకు మహేశ్​ బాబు బ్రాండ్​ అంబాసిడర్​గా ఉన్నారు. పలు యాడ్స్​లలో నటించి హయ్యేస్ట్ పెయిడ్​ యాక్టర్స్​లో ఒకరిగా నిలిచారు.

కంటెస్టెంట్లకు అవకాశం..

ఈ క్రమంలోనే ఈ డ్యాన్స్ షోకు అంత మొత్తం పారితోషికం ఇచ్చి మహేశ్​ బాబను గెస్ట్​గా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాగా ఈ షోలో పార్టిస్​పేట్ చేసే బాబు అండ్ కుమార్​ కంటెస్టెంట్ల డ్యాన్స్​ చూసి మహేశ్​ బాబు ఫిదా అయ్యారు. వారికి డ్యాన్స్​కు మెస్మరైజ్​ అయిన మహేశ్​ బాబు.. అతను నటించే సినిమాలో గానీ, తీసే సినిమాలో గానీ కచ్చితంగా అవకాశం కల్పిస్తానని మాట కూడా ఇచ్చారు.

కెరీర్​లోనే భారీ బడ్జెట్​ చిత్రం..

కెరీర్​లోనే భారీ బడ్జెట్​ చిత్రం..

ఇక మహేశ్​ బాబు చిత్రాల విషయానికొస్తే.. ఇటీవల సర్కారు వారి పాటతో హిట్ అందుకున్న మహేశ్​ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వెంటనే దర్శక ధీరుడు రాజమౌళితో ఓ మూవీ చేయనున్నాడు మహేశ్​ బాబు. ఈ చిత్రం మహేశ్​ బాబు కెరీర్​లోనే అత్యధికంగా రూ. 300 కోట్ల బడ్జెట్​తో రూపొందించనున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X