'1-నేనొక్కడినే' టీవీ ప్రీమియర్ షో...వివరాలు
హైదరాబాద్ : మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్ లో రూపొంది సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం '1-నేనొక్కడినే' . ఈ చిత్రం మార్నింగ్ షో నుంచీ డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీ పెద్దల నుంచి,మేధావుల నుంచి ఈ చిత్రానికి ప్రశంసల వర్షం కురిసింది. ఈ చిత్రం ఇప్పుడు టీవీలో టెలీకాస్ట్ అవ్వనుంది. జెమినీ టీవీ లో జూన్ 8 వ తేదీ సాయింత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది. ఈ చిత్రానికి మంచి టీఆర్పీలు వస్తాయని ఛానెల్ భావిస్తోంది.
ఇండస్ట్రీ మొత్తం నుంచి ఈ సినిమాకి సపోర్ట్ వచ్చింది. ఎన్నో కాల్స్ వచ్చాయి. రవితేజ, రామ్, నాని సహా చాలా మంది హీరోలు, రాజమౌళి, పూరి జగన్నాథ్, సురేందర్‌రెడ్డి సహా చాలా మంది డైరెక్టర్లు, చోటా కె. నాయుడు వంటి టెక్నీషియన్లు సినిమా చాలా బాగుందంటూ ప్రశంసించారు.

మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో రాక్ స్టార్ గా నటించిన చిత్రం '1-నేనొక్కడినే'. మోడల్ కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించగా సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఫస్ట్ టైమ్ దేవిశ్రీ ప్రసాద్ మహేష్ సినిమాకు సంగీతం సమకూర్చాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా క్లాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











