Mahesh Babu: సర్కారు వారి పాట ఫస్ట్ టైమ్ టీఆర్పీ.. పవన్ కళ్యాణ్, బిచ్చగాడు సినిమాల కంటే దారుణంగా..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట ఈ ఏడాది మే 12న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. పరశురాం దర్శకత్వంలో తెరపైకి వీక్చ్చిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. ఇక విడుదల తర్వాత మాత్రం కాస్త భిన్నమైన టాక్ ను అందుకొని బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంది. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఈ సినిమా టెలివిజన్లో మొదటిసారి టెలికాస్ట్ కాగా ఊహించిన విధంగా అతి తక్కువ స్థాయిలో రేటింగ్స్ అందుకుంది. మహేష్ సినిమా ఇంత తక్కువ స్థాయిలో రేటింగ్ అందుకోవడం ఫాన్స్ ను కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

నాన్ థియేట్రికల్ గా..

నాన్ థియేట్రికల్ గా..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం ఓపెనింగ్స్ అందుకుంటూ ఉంటాయి. ఇక కేవలం థియేట్రికల్ గానే కాకుండా మహేష్ బాబుకు నాన్ థియేట్రికల్ కూడా మంచి మార్కెట్ అయితే ఉంది. ముఖ్యంగా ఓటిటి శాటిలైట్ హక్కులలో కూడా మహేష్ సినిమాలు భారీ స్థాయిలో లాభాలను అందిస్తూ ఉంటాయి.

విడుదలకు ముందు

విడుదలకు ముందు

ఇక సర్కారు వారి పాట సినిమా విడుదలకు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు పరశురామ్ మహేష్ బాబు కోసం ఎంతో ఇష్టంగా చేసిన సర్కారు వారి పాట సినిమా పరవాలేదు అనిపించింది. కానీ అనుకున్నంత స్థాయిలో లేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

శాటిలైట్ హక్కులు

శాటిలైట్ హక్కులు

ఇక సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడిన వెనక్కి తెచ్చింది. కానీ భారీ స్థాయిలో నిర్మాతలకైతే లాభాలను అందించలేకపోయింది. ఇక ఈ సినిమా కూడా నాన్ థియేట్రికల్ గా మంచి బిజినెస్ అయితే చేసింది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఓటిటిగా హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం.

అంతకంటే తక్కువగా..

అంతకంటే తక్కువగా..

ఇక రీసెంట్ గా మొత్తానికి ఈ సినిమా స్టార్ మా లో ఫస్ట్ టైమ్ ప్రసారం కాగా అతి తక్కువ స్థాయిలో రేటింగ్స్ అందుకుంది. ఒక విధంగా గతంలో వచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 19.12 టిఆర్పి కంటే అతి దారుణంగా వచ్చింది. అలాగే తమిక్ డబ్బింగ్ మూవీ బిచ్చగాడు సినిమా తెలుగులో 18.7 రేటింగ్ రాగా ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాకు అంతకంటే తక్కువ రావడం ఫాన్స్ ను కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

రేటింగ్ ఎంతంటే?

రేటింగ్ ఎంతంటే?

సర్కారు వారి పాట సినిమా స్టార్ మా లో మొదటిసారి ప్రసారమైనప్పుడు అందుకున్న రేటింగ్ 9.45 చాలా తక్కువ. గతంలో మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు కూడా 12 కంటే ఎక్కువ స్థాయిలోనే రేటింగ్స్ అందుకున్నాయి. కానీ ఈ తరహాలో మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు సర్కారు వారి పాట అందుకున్న రేటింగ్ అయితే చాలా బ్యాడ్ రికార్డు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X