1500 సార్లు టెలికాస్ట్ అయిన మహేశ్ బాబు మూవీ.. ఆ సినిమా ఏంటో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఎంతటి కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ కు ధీటుగా మహేష్ బాబుకు కూడా భక్తులు ఉంటారనేది తెలిసిందే. కాగా మహేష్ బాబు కూడా తన కెరీర్ లో ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించారు. విభిన్న పాత్రలు పోషిస్తూ అంతకంతకు క్రేజ్ సంపాదించుకున్నారు. మురారి, టక్కరి దొంగ, బాబీ, ఒక్కడు, నిజం, అతడు, పోకిరి, ఖలేజా, దూకుడు, బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలతో పాటు చివరిగా ' గుంటూరు కారం' వరకు విభిన్న కథలతో తన అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ను కూడా అలరించారు.
ప్రస్తుతం మహేష్ బాబు వరల్డ్ ఆడియన్స్ ని అలరించేందుకు బిగ్ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ భారీ చిత్రానికి ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఎప్పుడు ఎప్పుడు ప్రారంభమవుతుందనుకున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో ప్రారంభమై ఎస్ఎస్ఎంబీ 29 వర్క్ టైటిల్ తో రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం జక్కన్న ఈ ప్రాజెక్టును ఎంతో రహస్యంగా షూట్ చేస్తున్నారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ శరవేగంగా జరుగుతుంది. ఒడిశా కు జక్కన్న టీం బయలుదేరిన సంగతి తెలిసిందే.

అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ టెలివిజన్ లో 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డ్ చేసింది. ఇప్పటివరకు ఏ చిత్రం కూడా మహేష్ బాబు నటించిన ఆ బ్లాక్ బస్టర్ మూవీని దాటలేకపోయింది. టాలీవుడ్ నుంచి వచ్చిన ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇప్పటివరకు 1000 సార్లు మాత్రం సినిమాలు కూడా ఉండడం కష్టమేనని అంటున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏమిటి? ఎవరు దర్శకత్వం వహించారు? ఏ సంవత్సరంలో రిలీజ్ అయింది? బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్లు కురిపించింది అనే విషయాలు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ఇప్పటివరకు మూడు చిత్రాల్లో నటించారు. ఖలేజా, అతడు, గుంటూరు కారం. ఈ మూడు చిత్రాలు కూడా ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఖలేజా రిలీజ్ అయ్యి కమర్షియల్ హిట్టు అందుకోలేకపోయినా ఒక కల్ట్ మూవీ గా నిలిచిపోయింది. ఆ మూవీలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ కు ఇప్పటికే ఆడియన్స్ ఫిదా అవుతుంటారు. అయితే ఈ చిత్రం తర్వాత వచ్చిన 'అతడు'.. మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ ఫీలింగా నిలిచిపోయింది. ఇప్పటికీ ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు.
మహేష్ బాబు త్రిష జంటగా నటించిన 'అతడు' చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ అందుకుందో తెలిసిందే. ఈ చిత్రానికి నంది అవార్డులు, బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా అందింది. కాగా ఈ చిత్రమే 'స్టార్ మా' లో ఏకంగా 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ చిత్రం కూడా 1000 సార్లు ప్రసారమైనట్టుగా రికార్డు లేదు. మహేష్ బాబు నటించిన అతడు సినిమా రేర్ రికార్డును సెట్ చేసింది. దీంతో అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు. తెలుగులో 2005లో వచ్చిన అన్ని చిత్రాల్లో కంటే ఈ చిత్రమే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం గా నిలిచింది. ఇక ఈ చిత్రం హిందీ బెంగాలీ లోను రీమేక్ అయింది.


Click it and Unblock the Notifications











