Bigg Boss Telugu 7: ఫినాలేకు గెస్టుగా స్టార్ హీరో.. పవన్ ఫ్రెండ్ కూడా.. చక్రం తిప్పిన నాగార్జున
ఎన్నో అనుమానాల నడుమ బుల్లితెరపైకి వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు అలవాటు అయిపోయిన ఏకైక షోనే బిగ్ బాస్. ఆరంభం నుంచే రికార్డు స్థాయిలో టీఆర్పీని అందుకుంటోన్న ఇది వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇక, ప్రస్తుతం నడుస్తోన్న ఏడో సీజన్ చివరి దశకు చేరడంతో మరింత వినోదాన్ని కూడా అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆదివారం ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. దీనికి గెస్టుగా ఎవరు రాబోతున్నారన్న దానిపై ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!
ఇప్పుడు హౌస్‌లో ఆరుగురు:ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన ఏడో సీజన్‌లోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో 14 వారాల్లో 13 మంది ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఆరంభంలో ఆరుగురు సభ్యులు మాత్రమే హౌస్‌లో ఉన్నారు. వారిలో శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్‌లు ఫైనలిస్టుగా నిలిచారు.

టైటిల్ విజేత ఆ ఇద్దరిలోనే:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో విజేత అయ్యేది ఎవరన్న దానిపై ఆరంభం నుంచీ ఎన్నో రకాల చర్చలు జరిగాయి. కానీ, చివరి దశకు చేరుకునే సరికి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఫినాలే వీక్‌లో అతడికే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయి. మరో టైటిల్ ఫేవరెట్ శివాజికి గెలిచే ఛాన్స్ కూడా ఉందని చెప్పొచ్చు.
ఆదివారమే గ్రాండ్ ఫినాలే:దాదాపు పదిహేను వారాల పాటు అలరించిన బిగ్ బాస్ ఏడో సీజన్ డిసెంబర్ 17 అంటే ఆదివారంతో పూర్తి కాబోతుంది. ఆరోజు సాయంత్రం ఆరు లేదా ఏడు గంటల నుంచి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. దీంతో స్పెషల్ ఎపిసోడ్‌ను ఎంతో సందడిగా జరపనున్నారు. దీని కోసం నిర్వహకులు భారీ ఖర్చు చేస్తూ ఎన్నో సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేశారు.

వాళ్లతో పాటు సెలెబ్రిటీలు:డిసెంబర్ 17 ఆదివారం జరగబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు మాజీ కంటెస్టెంట్లు రాబోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. అంతేకాదు, వీళ్లలో చాలా మంది ఆటపాటలతో అలరించబోతున్నారని కూడా తెలిసింది. ముఖ్యంగా కొందరు హీరోయిన్లు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
గెస్ట్ విషయంలో ప్రచారం:ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలేకు గెస్టుగా వచ్చేది ఎవరన్న దానిపై కూడా చాలా రకాల చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. బాలయ్య ఈ ఎపిసోడ్ కోసం వస్తారని అన్నారు. ఆ తర్వాత కూడా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, దీనిపై క్లారిటీ మాత్రం రావడం లేదు.

ఫినాలేకు సూపర్ స్టార్ హీరో:బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను గతంలో కంటే ఎక్కువ సర్‌ప్రైజ్‌లతో ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీని కోసం వీలైనంత ఎక్కువ మంది గెస్టులను తీసుకు రాబోతున్నారట. ఇందులో భాగంగానే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబును ఈ సీజన్ చీఫ్ గెస్టుగా తీసుకు వస్తున్నట్లు తెలిసింది. అతడితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వస్తున్నాడని సమాచారం.
చక్రం తిప్పిన నాగార్జున:గత సీజన్ల కంటే ఇప్పుడు ప్రసారం అవుతోన్నది ఎంతో సక్సెస్ అయింది. అందుకే దీన్ని అంతే గ్రాండ్‌గా ముగించాలని నాగార్జున పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసమే ఫినాలే కోసం గెస్టుగా వచ్చేందుకు మహేశ్ బాబును ఒప్పించాడని అంటున్నారు. 'గుంటూరు కారం' ప్రమోషన్స్‌లో భాగంగానే ఈ సూపర్ స్టార్ షోలోకి వచ్చి విజేతకు ట్రోఫీని అందిస్తాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











