మహేష్ కత్తిపై ఫొటోలతో దాడి.. వివాదంలోకి అల్లు అరవింద్
సినీ విమర్శకుడు కత్తి మహేష్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వివాదం తెలుగు టెలివిజన్ సీరియల్‌లా రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. సోషల్ మీడియాలో మాటల యుద్ధానికే పరిమితమైన ఈ వివాదంలో సరికొత్త అంశాలు చోటుచేసుకొంటున్నాయి. కత్తి మహేష్‌పై అభ్యంతరకరంగా ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ కత్తి తీవ్రంగా స్పందిస్తున్నారు.
Recommended Video


మహేష్ కత్తిపై ఫొటోల వార్
సోషల్ మీడియాలో రకరకాలుగా మహేష్ కత్తి గురించి రాతలతోపాటు మార్ఫింగ్ ఫొటోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. తన ఫొటోలను చాలా నీచంగా మార్ఫింగ్ చేయడం వెనుక గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుట్ర ఉంది అని మహేష్ కత్తి ఆరోపించినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లోనే
తన ఫొటోల మార్ఫింగ్ వ్యవహారం గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లోనే కొనసాగుతున్నట్టు ఓ వెబ్‌సైట్ కథనంలో పేర్కొన్నది. అయితే నియంత్రణ లేని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులకు ఎవరినీ బాధ్యులు చేయలేమనే మాట వినిపిస్తున్నది.

వివాదంలోకి అల్లు అరవింద్
తన ఫొటోల గురించే కాదు. తన వాట్సప్‌లో పవన్ ఫ్యాన్స్ చేస్తున్న దారుణమైన కామెంట్ల మహేష్ కత్తి పోస్ట్ చేసి తన గోడును వెల్లబుచ్చుకొంటున్నాడు. ఇప్పటి వరకు పరిమితమైన పవన్ కల్యాణ్, పవన్ ఫ్యాన్స్‌కే పరిమితమైన ఈ పంచాయితీ ఇప్పుడు అల్లు అరవింద్ కాంపౌండ్‌కు చేరింది.

పవన్ కల్యాన్ వ్యాఖ్యలపై కత్తి
నిర్మాత అల్లు అరవింద్‌పై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మహేష్ కత్తి ఇటీవల స్పందించారు. ప్రజారాజ్యం సమయంలో చిరంజీవికి అల్లు అరవింద్ ద్రోహం చేస్తే.. అతడిని భ్రష్టు పట్టించడానికి నా వద్ద చాలా ఆధారాలున్నాయని కత్తి అన్నారు.

అల్లు అరవింద్ స్పందిస్తాడా?
పవన్ ఫ్యాన్స్ వివాదంలోకి తనను లాగడంపై ఇంత వరకు అల్లు అరవింద్ కాంపౌండ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ వివాదంలోకి అల్లు అరవింద్‌ను లాగడానికి ఎవరైనా ఫొటోలను మార్ఫింగ్ చేసి పెడుతున్నారా అనే అనుమానం కూడా మీడియాలో వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











