For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘బిగ్ బాస్’ నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన కత్తి మహేశ్.. ఆందోళనలో ఫ్యాన్స్

  |
  Bigg Boss Telugu 3 : Kathi Mahesh Sensational Post On Bigg Boss Telugu 3 Elimination || Filmibeat

  తెలుగు సినీ విమర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు కత్తి మహేశ్. సినిమాలు విడుదలైన రోజు ఓ న్యూస్ చానెల్‌లో రివ్యూలు చెప్పేవారు. ఆ తర్వాత తెలుగు రియాలిటీ షో.. 'బిగ్ బాస్' సీజన్ - 1లో అవకాశం రావడంతో, ఆయన వ్యవహారమే మారిపోయింది. అప్పటి వరకు కొంత మందికే తెలిసిన కత్తి మహేశ్.. హౌస్‌లోకి ఎంటరైన తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అయిపోయారు. ఇక, అప్పటి నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులతోవివాదం, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు తదితర కారణాలతో ఆయన బాగా ఫేమస్ అయ్యారు.

  సోషల్ మీడియాలో హల్‌చల్

  సోషల్ మీడియాలో హల్‌చల్

  కత్తి మహేశ్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. తన వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి, సమాజంలో జరుగుతున్న ప్రతి విషయంపై ఆయన స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంత మందికి ఆయన శత్రువుగా మారిపోయారు. మరికొందరు మాత్రం కత్తికి సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాలపైనా తనదైన శైలిలో పోస్టులు పెడుతున్నారు.

  వివాదాలతో సహవాసం

  వివాదాలతో సహవాసం

  కత్తి మహేశ్ ఎక్కువగా వివాదాలతోనే సహవాసం చేస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులతో వివాదం, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడం, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి వాటితో ఆయన ఎంతో మంది నుంచి విమర్శలు తెచ్చుకున్నారు.

  ‘బిగ్ బాస్' వివాదంలో ఎంట్రీ

  ‘బిగ్ బాస్' వివాదంలో ఎంట్రీ

  ‘బిగ్ బాస్' షో నిర్వహకులు తమ పట్ట అనుచితంగా మాట్లాడారని శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపణలు చేస్తున్న సమయంలో కత్తి మహేశ్ కూడా ఓ పోస్ట్ చేశారు. ‘‘2017 లో.. బిగ్ బాస్ టీం వాళ్లు 70 రోజుకు సెక్స్ లేకుండా ఉండగలరా అని నన్ను ప్రశ్నించారు. దానికి నేను ‘బాత్రూమ్ లో కెమెరాలు ఉండవుగా! పర్లేదు మ్యానేజ్ చేసుకుంటాను' అని సమాధానమిచ్చాను. ఇదే ప్రశ్న, ఇదే టీం యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయిని ఇప్పుడు 2019లో అడిగితే...తప్పైపోతుందా?!? జస్ట్ ఆస్కింగ్!'' అంటూ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

  ఫస్ట్ ఎలిమినేషన్‌పై పోస్ట్

  ఫస్ట్ ఎలిమినేషన్‌పై పోస్ట్

  ప్రస్తుతం జరుగుతున్న ‘బిగ్ బాస్' సీజన్ -3లో మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై కత్తి మహేశ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘‘నోరుజారినోళ్లు మొదటివారంలోనే ఎలిమినేట్ అవుతారు. బిగ్ బాస్ సీజన్ 1లో జ్యోతి, రెండో సీజన్‌లో సంజన ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు సింగర్ రాహుల్ బయటికిపోయే ఛాన్స్ కనిపిస్తోంది'' అని ఆయన చెప్పుకొచ్చారు.

   కత్తి పోస్టుతో కలవరం

  కత్తి పోస్టుతో కలవరం

  కత్తి మహేశ్ గతంలో ‘బిగ్ బాస్' కంటెస్టెంట్‌గా ఉండడంతో ఆయన ఎలిమినేట్ అవుతాడని చెప్పిన రాహుల్ అభిమానులు కలవరపాటుకు గురవుతున్నారు. చాలా విషయాల్లో ఆయన అంచనా నిజమవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలా మంది రాహుల్‌కు అనుకూలంగా ఓట్లు కూడా వేయిస్తున్నారని తెలుస్తోంది.

  నూతన్ నాయుడు నిజం చెప్పాడు

  నూతన్ నాయుడు నిజం చెప్పాడు

  ‘బిగ్ బాస్' సీజన్ - 2లో కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు తాజాగా ఓ వీడియోతో బయటకు వచ్చాడు. ఇందులో సీజన్ - 3కి సంబంధించిన వివరాలను వెల్లడించడంతో పాటు ఈ సారి ఎవరెవరు కంటెస్టెంట్లుగా వస్తున్నారన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు విడుదల చేసిన వీడియోలు కొన్ని పేర్లు కూడా బయట పెట్టాడు. ఆయన ఏ పేర్లైతే చెప్పాడో వాళ్లే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో కత్తికి కూడా తెలిసే అన్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది.

  English summary
  Tollywood Film Critic Mahesh Kathi recently posted Sensational Comments On Telugu Actor Gayathri Gupta. Now He is another post In social media. But This time Bigg Boss Telugu season 3 elimination.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X