70 రోజులు సెక్స్ లేకుండా ఉంటావా అని అడిగారు.. అమ్మాయిలను అడిగితే తప్పేంటి.. కత్తి మహేశ్

'బిగ్ బాస్'.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్‌గా నడుస్తున్న వ్యవహారం ఇదే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోకు సంబంధించిన మూడో సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి, 'ఫిదా' ఫేమ్ గాయత్రి గుప్తా ఈ షోపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఏ చానెల్‌లో చూసినా.. ఎక్కడ విన్నా ఈ షో గురించే చర్చించుకోవడం కనిపిస్తోంది.

వివాదంలోకి కత్తి మహేశ్ ఎంట్రీ

వివాదంలోకి కత్తి మహేశ్ ఎంట్రీ

‘బిగ్ బాస్' మొదటి సీజన్ ద్వారా తెలుగు ప్రజలందరికీ అత్యంత సుపరిచితుడాయ్యారు ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్. ఈ షోను మధ్యలోనే బయటకు వచ్చేసినా సోషల్ మీడియా ద్వారా తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ సంచలనం అవుతుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో వివాదాల్లోకి ఎంటరయ్యారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన ‘బిగ్ బాస్' కాస్టింగ్ కౌచ్‌ గురించి స్పందించారు.

సంచలన పోస్ట్

సంచలన పోస్ట్

గాయత్రి గుప్తా ఆరోపణలపై స్పందిస్తూ.. ‘‘2017 లో.. బిగ్ బాస్ టీం వాళ్లు 70 రోజుకు సెక్స్ లేకుండా ఉండగలరా అని నన్ను ప్రశ్నించారు. దానికి నేను ‘బాత్రూమ్ లో కెమెరాలు ఉండవుగా! పర్లేదు మ్యానేజ్ చేసుకుంటాను' అని సమాధానమిచ్చాను. ఇదే ప్రశ్న, ఇదే టీం యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయిని ఇప్పుడు 2019లో అడిగితే...తప్పైపోతుందా?!? జస్ట్ ఆస్కింగ్!'' అంటూ కత్తి మహేశ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

గాయత్రి ఏమన్నదంటే..

గాయత్రి ఏమన్నదంటే..

‘బిగ్ బాస్' ఆఫర్ గురించి తాజాగా ఓ న్యూస్ చానెల్ డిబెట్‌లో మాట్లాడింది గాయత్రి గుప్తా. ‘‘నాకు లాస్ట్ ఇయర్‌లో జరిగిన ‘బిగ్ బాస్' సీజన్ -2లో ఆఫర్ వచ్చిన విషయం నిజమే. అందుకోసం నేను స్టార్ మా వాళ్లతో మాట్లాడడానికి కూడా వెళ్లాను. అప్పుడు నన్ను ‘బిగ్ బాస్' షో వాళ్లు ‘హౌస్‌లోకి వస్తే వంద రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా..? నీ సెక్స్ జీవితాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటావు..?' అని ప్రశ్నించారు'' అంటూ చెప్పుకొచ్చింది.

మరోవైపు శ్వేతా రెడ్డి.

మరోవైపు శ్వేతా రెడ్డి.

యాంకర్ శ్వేతా రెడ్డి కూడా ‘బిగ్ బాస్' షో నిర్వహకులపై ఆరోపణలు చేసింది. షోకు తనను తీసుకున్నామని చెప్పిన కొందరు వ్యక్తులు తనకు పదే పదే ఫోన్లు చేసేవారని శ్వేతారెడ్డి చెప్పింది. అంతేకాదు, ‘‘మిమ్మల్ని షోకు సెలెక్ట్ చేశాము.. మరి మీరు మా బాస్‌ను ఎలా ఇంప్రెస్ చేస్తారు'' అని కొందరు అడిగారని శ్వేతా రెడ్డి ఆరోపణలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X