టెలివిజన్ చరిత్రలో మహేష్ బాబు మరో రికార్డ్

మహేష్ బాబు చిత్రం అతడు మా టీవీ లో రెగ్యులర్ గా వేస్తూంటారు. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని భారీ మొత్తం ఇచ్చి రెన్యువల్ చేయించుకోవటం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇది తెలుగు టీవీ చరిత్రలో రికార్డు అంటున్నారు. ఎందుకంటే ఓ సినిమా రైట్స్ పీరియడ్ అయ్యిపోయిన తర్వాత అదే ఛానెల్ వారు దాన్ని రిపీట్ చెయ్యటానికి ఇష్టపడదు. కానీ 'అతడు' చిత్రం వేసేటప్పుడు వచ్చే యాడ్ రెవెన్యూ చూసి మా టీవి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు.
ఇక మాటీవికి తగ్గట్లే అతడు చిత్రం కూడా ఫ్యామిలీలను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కుటుంబం అంతా కూర్చుని చూసేటట్లు కుటుంబ భావోద్వేగాలు,యాక్షన్,కామిడీ సినిమాను అన్నివర్గాలకు నచ్చే విధంగా ఉండటం ప్లస్ అయ్యింది. ఇక అతడు సినిమా రిలీజైనప్పుడు ఈ చిత్రం చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్కువైందని,అంతరేటుకు బిజినెస్ లేదని అప్పట్లో నిర్మాత మురళీ మోహన్ కంప్లైట్ చేసి ఇక సినిమాలు తీయనని ప్రకటించారు.
ఆయన అన్నట్లే ఆ తరవాత సినిమాలు కూడా తీయలేదు. అయితే ఇప్పుడు ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంసమైంది. ఇక ప్రస్తుతం మహేష్ తన నేనొక్కడినే చిత్రం హడావిడిలో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం కూడా మంచి రేటుకే శాటిలైట్ రైట్స్ అమ్ముడయినట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











