రోడ్డున పడితే ఆరునెలలు ఫుడ్డు పెట్టాడు.. ప్రియురాలితో తిరుపతి మెట్లెక్కుతూ.. మహేష్ విట్ట

బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో 12వ రోజు చాలా భావోద్వేగాల మధ్య సాగింది. సెలబ్రిటీలు తాము తీసుకొన్న నిర్ణయాల వల్ల కోల్పోయిన వ్యక్తులను తలచుకొని కుమిలిపోయారు. జీవితంలో మళ్లీ రాబట్టుకొలేని విషయాలను చెప్పి విషాదంలో మునిగిపోయారు. శ్రీముఖి, శివజ్యోతి, పునర్నవి, మహేష్ విట్ట తదితరులు చెప్పిన తమ ఫ్లాష్ బ్యాక్ విషయాలు ప్రేక్షకులను సైతం ఎమోషనల్‌గా మార్చే విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

నేను సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకొనే క్రమంలో చాలా కష్టాలు పడ్డాను. ఓ రోజు జేబులో 20 రూపాయలు తప్ప ఏమీ లేదు. హాస్టల్‌లో ఫీజు కట్టలేని పరిస్థితిలో రోడ్డు మీద నిలబడ్డాను. అప్పుడు మొబైల్‌లో ఫోన్ నంబర్లు చెక్ చేస్తుంటే.. సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నా ఫ్రెండ్ చందు నంబర్ కనిపించింది. దాంతో అతడికి ఫోన్ చేసి నా పరిస్థితిని చెప్పాను. వెంటనే అతను నా రూమ్‌కు రమ్మని తీసుకెళ్లాడు. ఆ తర్వాత నాకు అతని రూమ్‌లో స్థానం కల్పించి నాకు ఫుడ్డు, బెడ్డు కల్పించాడు.

Mahesh Vitta about his friends death at Tirupati

ఓ రోజు నా పరిస్థితి బాగాలేదంటే నా రూమ్‌కు పిలిపించాను. నా స్నేహితులకు చెప్పి నేను ఉన్నా లేకపోయినా బాగా చూసుకోవాలని చెప్పాను. ఓ రోజు నీట్ తయారై చందు బ్యాగ్‌తో బయటకు వెళ్తూ కనిపించాడు. ఎక్కడికి వెళ్తున్నావురా అని అడిగితే చెన్నైకి వెళ్తున్నాను. నా గర్ల్‌ఫ్రెండ్ కలిసి వస్తానని వెళ్లాడు. ఆ తర్వాత అతనికి ఆరోగ్యం బాగుండటం లేదని నా ఫ్రెండ్ చెప్పాడు. నాలుగు అడుగులు నడిస్తే ఆయాస పడుతున్నాడు.. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాడు. దాంతో తిరిగి వచ్చిన తర్వాత హాస్పిటల్‌కు తీసుకెళ్లి చెకప్ చేయిద్దామని అనుకొన్నాను.

కొద్దిరోజులకు ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి చందు ఇక లేడు.. తన ప్రియురాలితో కలిసి తిరుపతి మెట్లు ఎక్కుతూ ఆయాసంతో మరణించాడని చెప్పగానే నేను షాక్ తిన్నాను. అతడు 7 వేలు సంపాదిస్తూ నన్ను 6 నెలలు చూసుకొన్నాడు. అతడి అండతోనే నేను ఈ రోజు లక్షలు సంపాదించుకొంటున్నాను. అలాంటి వ్యక్తి గురించి నీవు ఎలా ఉన్నావు అని ఒక్కరోజు అడుగలేకపోయాను. ఎంత సేపు సీన్లు, సినిమాల గురించే మాట్లాడాను. అది తలుచుకొంటే చాలా బాధగా ఉంటుంది. నా జీవితంలో ఎవరికైనా సారీ చెప్పాల్సి వస్తే అతడికే చెప్పాలి అని మహేష్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X