మహేష్ విట్టా బిగ్‌బాస్ నుంచి బయటకు.. షాక్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్
బిగ్‌బాస్.. బిగ్‌బాస్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా అదే వినిపిస్తోంది. ఇష్టమైన కంటెస్టెంట్లు, నచ్చని హౌస్‌మేట్స్.. ఇలా ఎవరికి నచ్చింది వారు ముచ్చటించుకుంటూ ఉన్నారు. ఆ టాస్క్‌లో వారు అలా చేశారు.. ఆ సమయంలో వారు అలా చేయాల్సింది కాదంటూ ఏవేవో చర్చించుకుంటారు. మరి ఈ షోకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఏ ఇద్దరు కలిసిన బిగ్‌బాస్ షో గురించి మాట్లాడుకుంటారు. కాగా, బిగ్‌బాస్ తాజా ప్రోమోలో ఓ ట్విస్టు ఆసక్తిగా మారింది.

బిగ్‌బాస్‌ను ఎదురించినందుకేనా
గత కొద్దిరోజులుగా లగ్జరీ బడ్జెట్ టాస్క్, స్పెషల్ టాస్క్ సందర్భంగా మహేష్ విట్టా బిగ్‌బాస్‌పై ఘాటుగా కామెంట్స్ చేశారు. బూట్లు తుడిచి పాలిష్ చేయమనే శిక్షను పునర్నవి, మహేష్ మొండిగా వ్యతిరేకించారు. మహేష్ అయితే మేము ఇలాంటి చెత్త పనులు చేయడానికి వచ్చామా? నేను చేయను అంటే చేయను అని అన్నాడు. ఇలాంటి చెత్త పనులు చేయడానికి మేము బిగ్‌బాస్ ఆడిషన్ రాలేదు. అప్లికేషన్ పెట్టుకొంటే వచ్చాం. మాకు గతిలేక రాలేదు అంటూ మహేష్ గరం అయ్యాడు.

నామినేషన్‌లో ఉన్నది వీరే..
బిగ్‌బాస్ ఎనిమిదో వారానికి గానూ శిల్పా చక్రవర్తి, శ్రీముఖి, హిమజ, పునర్నవి భూపాలం, మహేష్‌లు నామినేట్ అయ్యారు. వీరందిలో ఎవరో ఒకరు ఈ వారం బయటకు వెళ్లాల్సిందే. అయితే ఇప్పటికే వినిపిస్తున్న టాక్ ప్రకారం శిల్పా చక్రవర్తి నిష్క్రమనం ఖాయమనిపిస్తోంది. సెంటిమెంట్ కూడా కలిసి వస్తుండటంలో ఇదే నిజమని అందరూ నమ్ముతున్నారు.
Recommended Video

సీక్రెట్ టాస్క్‌లో విజయం సాధిస్తాడా..
ఇంట్లో మొదటిసారి నామినేట్ అయిన హౌస్‌మేట్స్ ఎలిమినేట్ అవుతుండటంలో శిల్పా బయటకు రావడం తథ్యమనిపిస్తోంది. అయితే నేటి ఎపిసోడ్‌లో మహేష్‌కు బిగ్‌బాస్ ఓ సీక్రెట్ ఇచ్చాడు. తాను ఇంట్లోంచి ఎలిమినేట్ అయినట్లు అందర్నీ నమ్మించాల్సి ఉంటుందని తెలిపాడు. దీనిలో భాగంగా తాను లగేజ్ ప్యాక్ చేసుకుని బయటకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు. బిగ్‌బాస్ ఆదేశాలనుసారమే.. చేస్తున్న మహేష్ అందర్నీ నమ్మించి సీక్రెట్ టాస్క్‌లో సఫలమయ్యాడా లేదా అన్నది చూడాలి.

వైరల్ అవుతున్న ప్రోమోలు
నేడు బిగ్‌బాస్ షోకు సంబంధించి విడుదల చేసిన ప్రోమోలు వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి-వరుణ్‌ల మధ్య గొడవలు, కన్ఫెషన్ రూమ్‌లో ఇంటి సభ్యులు పడే పాట్లు వైరల్‌గా మారుతున్నాయి. రాహుల్ గుంజీలు తీయడం, రవి-హిమజలు కేక్ తినడం.. మధ్యలో దాచుకోవడం.. బిగ్‌బాస్ హెచ్చరించడం లాంటి ఫన్నీ మూమెంట్స్ హైలెట్‌గా నిలవనున్నాయి.


Click it and Unblock the Notifications











