Don't Miss!
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- News
sister: శాడిస్టు సిస్టర్, కోట్ల రూపాయల ఆస్తి, అన్నను కిడ్నాప్ చేసి ఏం చేసిందంటే?, ఆంటీ కొడుకు!
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
దొంగ సంతకాలతో ఇరుకున పడ్డ టీవీ తార.. ఫోర్జరి కేసులో వదిలేది లేదంటూ
బిగ్‌బాస్ 13 కంటెస్టెంట్ మహిరా శర్మ కష్టాల్లో పడింది. తాజాగా తాను ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకొన్నానని తన ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టు అత్యంత వివాదస్పదంగా మారడంతో కుడితిలో పడిన ఎలుకలా తయారైంది ఆమె పరిస్థితి. అవార్డు ప్రతిష్టకు భంగం కలిగించిందంటూ సదరు అవార్డు కమిటీ మహిరాపై భగ్గుమన్నది. వివరాల్లోకి వెళితే..

వివాదంలోకి మహిరా ఇలా
బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన మహిరా శర్మ తాను దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డును సొంతం చేసుకొన్నట్టు ఓ పోస్టు పెట్టంది. దాంతో ఆ విషయం విస్తృతంగా ప్రచారం జరిగి వివాదంగా మారింది. మహిరాకు అవార్డు ఎక్కడ నుంచి వచ్చిందని ఆరా తీస్తే తప్పని తేలింది. దాంతో ఫాల్కే అవార్డు కమిటీ లీగల్ నోటీసులు జారీ చేసింది.

భేషరతుగా క్షమాపణ చెప్పాలి
మహిరా శర్మ వివాదంపై ఫాల్కే అవార్డు కమిటీ స్పందిస్తూ.. ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టును తొలగించమని కోరాం. దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు వచ్చిందని చెప్పడం అవాస్తవం. ఈ విషయంలో మహిరా బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. అవార్డు ప్రతిష్టకు భంగం కలిగింది అని నిర్వాహకులు మండిపడ్డారు.

ఇన్స్‌టాగ్రామ్‌లో వివాదాస్పద పోస్టుతో
అయితే లీగల్ నోటీసుల అందుకొన్న తర్వాత మహీరా స్పందిస్తూ.. తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పు అది. నేను పోస్టును ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టలేదు. థర్డ్ పార్టీ వల్ల ఆ తప్పు జరిగింది అంటూ అని అన్నారు. తాము ఆమెతో అనధికారికంగా సంప్రదింపులు జరుపుతున్నాం. 48 గంటల గడువు విధించాం. త్వరలో ఆమె స్పందన ఏంటో తెలుసుకొంటాం అని కమిటీ నిర్వాహకులు తెలిపారు.
Recommended Video

ఫోర్జరీకి పాల్పడిందంటూ..
దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. అలాంటి అవార్డు పత్రాలను దొంగ సంతకాలతో సృష్టించారు. ఇలాంటివి క్రిమినల్ చర్యలకిందకు వస్తాయి. ఈ విషయంలో క్షమాపణలు చెప్పిందా సరే.. లేకపోతే ఆమెపై కేసు నమోదు చేస్తాం అని ఫాల్కే అవార్డు నిర్వాహకులు పేర్కొన్నారు.