twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దొంగ సంతకాలతో ఇరుకున పడ్డ టీవీ తార.. ఫోర్జరి కేసులో వదిలేది లేదంటూ

    |

    బిగ్‌బాస్ 13 కంటెస్టెంట్ మహిరా శర్మ కష్టాల్లో పడింది. తాజాగా తాను ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకొన్నానని తన ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టు అత్యంత వివాదస్పదంగా మారడంతో కుడితిలో పడిన ఎలుకలా తయారైంది ఆమె పరిస్థితి. అవార్డు ప్రతిష్టకు భంగం కలిగించిందంటూ సదరు అవార్డు కమిటీ మహిరాపై భగ్గుమన్నది. వివరాల్లోకి వెళితే..

    వివాదంలోకి మహిరా ఇలా

    వివాదంలోకి మహిరా ఇలా

    బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన మహిరా శర్మ తాను దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డును సొంతం చేసుకొన్నట్టు ఓ పోస్టు పెట్టంది. దాంతో ఆ విషయం విస్త‌ృతంగా ప్రచారం జరిగి వివాదంగా మారింది. మహిరాకు అవార్డు ఎక్కడ నుంచి వచ్చిందని ఆరా తీస్తే తప్పని తేలింది. దాంతో ఫాల్కే అవార్డు కమిటీ లీగల్ నోటీసులు జారీ చేసింది.

    భేషరతుగా క్షమాపణ చెప్పాలి

    భేషరతుగా క్షమాపణ చెప్పాలి

    మహిరా శర్మ వివాదంపై ఫాల్కే అవార్డు కమిటీ స్పందిస్తూ.. ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టును తొలగించమని కోరాం. దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు వచ్చిందని చెప్పడం అవాస్తవం. ఈ విషయంలో మహిరా బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. అవార్డు ప్రతిష్టకు భంగం కలిగింది అని నిర్వాహకులు మండిపడ్డారు.

    ఇన్స్‌టాగ్రామ్‌లో వివాదాస్పద పోస్టుతో

    ఇన్స్‌టాగ్రామ్‌లో వివాదాస్పద పోస్టుతో

    అయితే లీగల్ నోటీసుల అందుకొన్న తర్వాత మహీరా స్పందిస్తూ.. తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పు అది. నేను పోస్టును ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టలేదు. థర్డ్ పార్టీ వల్ల ఆ తప్పు జరిగింది అంటూ అని అన్నారు. తాము ఆమెతో అనధికారికంగా సంప్రదింపులు జరుపుతున్నాం. 48 గంటల గడువు విధించాం. త్వరలో ఆమె స్పందన ఏంటో తెలుసుకొంటాం అని కమిటీ నిర్వాహకులు తెలిపారు.

    ఫోర్జరీకి పాల్పడిందంటూ..

    దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. అలాంటి అవార్డు పత్రాలను దొంగ సంతకాలతో సృష్టించారు. ఇలాంటివి క్రిమినల్ చర్యలకిందకు వస్తాయి. ఈ విషయంలో క్షమాపణలు చెప్పిందా సరే.. లేకపోతే ఆమెపై కేసు నమోదు చేస్తాం అని ఫాల్కే అవార్డు నిర్వాహకులు పేర్కొన్నారు.

    English summary
    Bigg Boss 13 contestants Mahira Sharma claims Dadasaheb Phalke International Film Festival award. Phalke Award organisers, said that Mahira was sent a legal notice on Sunday. Asked to apologise for the damage caused to the brand.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X