Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్స్‌కు కత్తి మీద సామేనట.. పద్మవ్యూహం దాటాల్సిందేనా?

రియాలిటీ షోలకే బాబు లాంటి బిగ్‌బాస్-8 తెలుగు సీజన్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కంటెస్టెంట్స్ ఎవరైనా హోస్ట్‌ మాత్రం కింగ్ నాగార్జునే. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారానికి స్టార్ మా తెరదించింది. వరుసగా ఆరోసారి బిగ్‌బాస్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 8 సీజన్లలో కేవలం రెండు సార్లు మాత్రమే నాగ్ ఈ షోకు సారథ్యం వహించలేదు. ఒకసారి జూనియర్ ఎన్టీఆర్, మరోసారి నాని హోస్ట్‌లుగా వ్యవహరించారు. మరి ఈ సీజన్‌ను ఎవరు నడిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరదించేలా బిగ్‌బాస్ 8 తెలుగు ప్రోమోను రిలీజ్ చేశారు. మీకు అన్ లిమిటెడ్ వినోదం పంచేందుకు తిరిగి వస్తున్నామంటూ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు నాగార్జున.

ఈ ప్రోమోను జాగ్రత్తగా గమనిస్తే సెట్ డిజైన్ కూడా మారినట్లుగా కనిపిస్తోంది. బిగ్‌బాస్ రివ్యూవర్స్ సైతం ఈసారి సీజన్‌పై రకరకాలుగా అనాలిసిస్ చేస్తున్నారు. బిగ్‌బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ వీళ్లేనంటూ రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో బిగ్‌బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి కూడా ఎక్కువ మంది బుల్లితెర నటీనటులు, యాంకర్స్, పోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, యూట్యూబర్లు , కొందరు వివాదాస్పద వ్యక్తులు హౌస్‌లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బర్రెలక్క, కుమారి ఆంటీ, యాదమ రాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, పొట్టి రమేష్ తదితరుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

makers planning different games and tasks for bigg boss telugu 8

గతంలో బిగ్‌బాస్ ఓటీటీ వచ్చిన రెండు మూడు నెలల గ్యాప్‌లోనే మెయిన్ బిగ్‌బాస్ రావడంతో ఆడియన్స్‌ నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు. అయితే గత సీజన్‌కి మాత్రం నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఉల్టా పల్టా పేరుతో వచ్చిన ఆ సీజన్ ప్రేక్షకులకు మంచి మజా అందించింది. కంటెస్టెంట్స్ ఎవరన్నది కూడా చివరి వరకు రివీల్ చేయకుండా గోప్యత పాటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పవర్ అస్త్ర, ఫినాలే అస్త్ర వంటి కాన్సెప్ట్స్‌, రకరకాల మైండ్ గేమ్స్‌తో బిగ్‌బాస్ ఆకట్టుకున్నాడు. అలాగే 14 మందితో లాంచింగ్ ఎపిసోడ్ నిర్వహించి.. సీజన్ మధ్యలో మరో ఐదుగురిని హౌస్‌లోకి పంపించడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరగడంతో పాటు షోలోనూ వేగం పెరిగింది.

ఈసారి కూడా టీఆర్పీల మోత మోగించాలనుకుంటున్న నిర్వాహకులు.. షోని కొత్తగా డిజైన్ చేసినట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్‌బాస్ ప్రారంభమైన నాటి నుంచి ఒకే ఫార్ములాను ఫాలో అవుతుండటంతో ఆడియన్స్ బోర్ ఫీలవుతారనే అంచనాల మధ్య బిగ్‌బాస్ 8ని గత సీజన్‌కి భిన్నంగా రూపొందిస్తున్నారనే వాదన మొదలైంది. ఈసారి బిగ్‌బాస్ షోలో రెండు హౌసులు ఉంటాయని.. ఒకటి మెయిన్ హౌస్ అయితే, రెండోది లూప్ హౌస్. మైండ్ గేమ్‌లో తెలివివాడి, ఫిజికల్ టాస్కుల్లో బాడీ చూపిస్తే ఫైనల్‌కి చేరుకోవాలనుకుంటే అది కలే అవుతుందట. కంటెస్టెంట్స్ కష్టపడి గేమ్స్, టాస్క్‌ల్లో సత్తా చాటిన వారే మెయిన్ హౌస్‌లోకి ఎంటరై.. టైటిల్ రేసులో నిలుస్తారట.

ఈ రెండు హౌస్‌ల మధ్య ఓ పద్మవ్యూహం లాంటి కాన్సెప్ట్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారట. చివరి వరకు ఎవరు నిలుస్తారో వారే బిగ్‌బాస్-8 టైటిల్ విజేతగా నిలుస్తారట.. ఎప్పటిలాగే ఆడియన్స్ ఓటింగ్ కూడా అంతే కీలకం. ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే , అసలు ఈసారి బిగ్‌బాస్ 8 ఎలా ఉంటుందనేది నిర్వాహకులకు మాత్రమే తెలిసిన విషయం. మరి ఇది ప్రచారమా.. లేక బిగ్‌బాస్ సెట్ నుంచి ఏమైనా ఫిలర్లు బటయకు వచ్చాయా అనేది త్వరలోనే తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X