సాహసం తో 'సాక్షి' ఛానెల్ ఈ రోజు నుంచే...

By Srikanya

హైదరాబాద్ : తెర వెనుక ఏం జరిగింది...అనేది అందరికీ ఆసక్తికమే. అలాంటి ఆసక్తిలోంచే మేకింగ్ ఆఫ్ మూవీస్ పుట్టుకొచ్చాయి. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వేరే కెమెరాతో ఆ షూటింగ్ జరిగే విధానాన్ని షూట్ చేసి, సినిమా విడుదల అయ్యాక వదులుతారు. మొదట్లో హాలీవుడ్ కి ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగులోకి వచ్చింది.. ఆ ఆసక్తిని టీఆర్పీల్లోకి మార్చుకోవటానికి సాక్షి ఛానెల్ ఓ పోగ్రాం ఈ రోజు నుంచి ప్రారంభిస్తోంది. అందులో భాగంగా సాహసం మేకింగ్ ని ఈ రోజు 2:30కి టెలికాస్ట్ చేస్తోంది. వారానికో మేకింగ్ ని చూపిస్తారు. ఈ పోగ్రాం మంచి విజయవంతమవుతుందని భావిస్తున్నారు.

గోపీచంద్ సరసన తాప్సీ హీరోయిన్. శక్తికపూర్, అలీతోపాటుగా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: శ్యామ్‌దత్ ఎస్, సంగీతం: శ్రీ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: సెల్వ, మాటలు: కె.కె.రాధాకృష్ణకుమార్, పాటలు: అనంత్‌శ్రీరామ్, సహ నిర్మాత: బోగవల్లి బాపినీడు, నిర్మాత: ఛత్రపతి ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి.

చిత్రం కథేమిటంటే... గౌతమ్‌ వర్మ (గోపీచంద్‌) ఓ సెక్యురిటీ గార్డ్‌. జీతం తక్కువ. కానీ ఖరీదైన కలలు కంటుంటాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలని ఆశ. లాటరీలు కొనడం హాబీ. అనుకోకుండా ఓసారి తన పూర్వీకుల గురించి తెలుస్తుంది. వాళ్లకు సంబంధించిన ఆస్తులు పాకిస్ధాన్ లో ఉన్న ఓ పురాతన దేవాలయం( హింగ్లాజ్ దేవి) సొరంగ మార్గం లోపల నిక్షిప్తమై ఉంటాయి. అయితే అక్కడ ఉన్న నిథి కోసం..అప్పటికే... పాకిస్దాన్ లో ఓ గ్రూప్ (శక్తి కపూర్) తీవ్రంగా ప్రయత్నిస్తూంటుంది. ఆ దేవాలయం దగ్గరకు వెళ్లిన గౌతమ్.. ఆ నిధిని ఎలా బయిటపెట్టాడు...విలన్స్ నుంచి ఎలా ఆ నిధిని రక్షించాడు.. అతనికి శ్రీనిధి (తాప్సి) ఎలా పరిచయం అయ్యింది...ఆమెతో ఉన్న రిలేషన్ ఏమిటి అనేది మిగతా కథ.

Making of SAHASAM movie on SAKSHI today

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X