టీవీ షో జడ్జిగా... కెవ్వుకేక పాప!

గత సీజన్లకు హీరోయిన్ సోనాలి బింద్రే జడ్జిగా వ్యవహరించే వారు. ఆమె స్థానంలో సన్నీ లియోన్ లేదా రితేష్ దేశ్ ముఖ్ వస్తారని ఆశించినా..... ఇతర కారణాలతో వారు నో చెప్పడంతో తాజాజా మలైకా అరోరాను లైన్లోకి దింపేందుకు రంగం సిద్ధం అవుతోంది. మలైకా ఇది వరకు 'నాచ్ బలియే' డాన్స్ రియాల్టీ షోకి జడ్జిగా వ్యవహరించింది.
దీని గురించి మలైకా మాట్లాడుతూ... నేను చాలా డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించాను. అందులో కేవలం డాన్స్ టాలెంట్ మాత్రమే చూస్తాం. 'ఇండియాస్ గాట్ టాలెంట్' లో రకరకాల టాలెంట్స్‌ను చూస్తూ జడ్జిమెంట్ చేయబోతున్నా. చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది.


Click it and Unblock the Notifications











