టీవీ షోలకు ఎక్కువ, జనానికి తక్కువ సమయం.. రోజాకు జాఫర్ దిమ్మతిరిగే ప్రశ్న

జబర్దస్త్ షో జడ్జిగా రోజా పంచే నవ్వులు ఏరేంజ్‌లో ఫేమస్ అందరికీ తెలిసిందే. అయితే రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజా మాత్రం బుల్లితెరను వదలడం లేదు. జబర్దస్త్ షోతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు వస్తూనే ఉంది. ఈ మధ్య జబర్దస్త్ విషయాలు సోషల్ మీడియాలో ఎంతగా ఫేమస్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే.

జబర్దస్త్‌ను నాగబాబు వీడటం..

జబర్దస్త్‌ను నాగబాబు వీడటం..

జబర్దస్త్ షోను నాగబాబు వీడటమే ఓ సంచనలం అయితే.. బయటకు వచ్చాక దానిపై విమర్శులు చేయడం మరింత సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటగా ఐడియాలజీలో వచ్చిన విభేదాల కారణంగా బయటకు వచ్చానని చెప్పడం, అక్కడ సరిగా ఫుడ్ కూడా తక్కువగా పెట్టేవారని, నితిన్-భరత్‌లను బయటకు గెంటేశారని ఇలా అన్ని విషయాలను పూసగుచ్చినట్టు చెప్పడం వైరల్ అయింది.

ఎఫెక్ట్ కానీ జబర్దస్త్..

ఎఫెక్ట్ కానీ జబర్దస్త్..

నాగబాబు లేని జబర్దస్త్ చూడటం కష్టమేనని మొదట్లో కొందరు అన్నా.. అలాంటిదేమీ లేదని తాజా టీఆర్పీ రేటింగ్‌లే చెబుతున్నాయి. వేరే చానెల్‌లో కొత్తగా పెట్టిన ప్రోగ్రామ్‌కే ఇంకా ఎలాంటి హైప్ క్రియేట్ కావడం లేదు. చూస్తుంటే అది క్లిక్ కావడం కష్టమేననిపిస్తోంది. నాగబాబు లేకపోయినా జబర్దస్త్ బాగానే నడుస్తోంది. నాగ బాబు వెళ్లడంతో ఏకచత్రాధిపత్యంతో రోజా కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

కొత్త ఏడాదికి కొత్త ప్రోగ్రామ్..

కొత్త ఏడాదికి కొత్త ప్రోగ్రామ్..

ప్రతీ పండుగకు ప్రత్యేకమైన ఈవెంట్‌లు చేసే మల్లెమాల సంస్థ.. ఈ న్యూ ఇయర్‌కు సరికొత్త కార్యక్రమంతో రాబోతోంది. ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే అనే ఈ కార్యక్రమంలో అంతా ఆడవారే పాల్గొనేలా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ షోకు వర్షిణి, హైపర్ ఆదిలు యాంకర్స్‌గా వ్యవహరించబోతున్నారు.

వైరల్‌గా మారిన ప్రోమో..

వైరల్‌గా మారిన ప్రోమో..

హైపర్ ఆది, వర్షిణి మధ్యజరిగిన సంభాషణ, పేలిన పంచులు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా అమాంతం ఆదిని వర్షిణి ఎత్తుకోవడం, అతను సంబరపడిపోవడం వెంటనే ఓ పంచ్ వేయడం, జానీ, యానీ మాష్టర్ దిమ్మతిరిగిపోయే స్టెప్పులు వేయడం ఇలా ప్రతీ ఒక్కటీ ఆకట్టుకున్నాయి.

రోజాకు జాఫర్ సూటి ప్రశ్న..

రోజాకు జాఫర్ సూటి ప్రశ్న..

ఇదే ప్రోగ్రామ్‌లో ముఖామఖి అనే ఇంటర్వూతో ఫేమస్ అయిన జాఫర్.. రోజాకు దిమ్మతిరిగిపోయే ప్రశ్నను సంధించాడు. ఇటీవలె బిగ్‌బాస్ షోతో ఫేమ్ సంపాదించుకున్న జాఫర్.. బుల్లితెరపై సందడి చేసేందుకు ఈ షోలో పార్టిసిపేట్ చేశాడు. అందులో భాగంగానే.. టీవీ షోలకు ఎక్కువ సమయం, ప్రజలకు తక్కువ సమయం కేటాయిస్తున్నారని బయట అనుకుంటున్నారని దీనిపై మీ స్పందన ఏంటని రోజాను సూటిగా అడిగేశాడు. దీనికి రోజా బాగానే సీరియస్ అయినట్టు ప్రోమోలో చూపిస్తున్నాడు. మరి ఆ ప్రశ్నకు రోజా చెప్పిన సమాధానమెంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X