వరుణ్ తేజ్‌ని నేనే పెళ్లి చేసుకుందామనుకున్నా.. భర్త ముందే నటి షాకింగ్ కామెంట్స్
మెగా కుటుంబం నుంచి వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ముకుంద మూవీతో హీరోగా సినీ ప్రయాణం ప్రారంభించాడు వరుణ్ తేజ్. అనంతరం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కాన్సెప్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ వాటిలో కొన్ని ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఇటీవల బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠిని నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. అయితే లావణ్య త్రిపాఠితో ఎంగేజ్ మెంట్ చేసుకోకుంటే తానే వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకునేదాన్నని ఏకంగా భర్త ముందే షాకింగ్ కామెంట్స్ చేసింది ఓ సీరియల్ నటి.
మాలిని పాత్రకు:తెలుగు ప్రేక్షకులు సీరియల్స్, అందులోని నటీనటులను ఎంతగా ఇష్టపడతారో తెలిసిందే. అలాగే అందులోని నటీమణులు కూడా హీరోలను ఇష్టపడటం సహజమే. అలా ఓ నటి వరుణ్ తేజ్ పై ఉన్న ఇష్టాన్ని తాజాగా చెప్పుకొచ్చింది. స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న మల్లి (Malli Nindu Jabili) సీరియల్ లో మాలిని పాత్రకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా చీరలో ఆమె అందానికి ఫిదా కానీ వారు ఉండరు.

ప్రేమించి పెళ్లాడి:అందం, అభినయంతో ఆకట్టుకునే మాలిని అసలు పేరు దీప జగదీష్ (Deepa Jagadeesh). కర్ణాటకకు చెందిన ఈ ముద్దుగుమ్మ కన్నడ ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాగర్ ని (Sagar Puranik) ప్రేమించి పెళ్లాడింది. అయితే కన్నడలో సాగర్ తండ్రి బ్యానర్ లోనే దీపా జగదీష్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అదే సీరియల్ లో దీపాకు జోడీగా సాగర్ నటించగా.. అక్కడ వారి స్నేహం ప్రేమగా మారింది.

పెద్దలను ఒప్పించి:పెద్దలను ఒప్పించి మరి గతేడాది పెళ్లి పీటలు ఎక్కి భార్యాభర్తలుగా మారారు దీపా జగదీష్-సాగర్. ప్రస్తుతం నీతోనే డ్యాన్స్ అనే షోలో కంటెస్టెంట్లుగా పార్టిస్ పేట్ చేస్తూ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకుందామనుకున్నట్లు షాకింగ్ విషయాలు తెలిపింది.
నేనే అనుకున్నా:"మొన్న ఎంగేజ్ మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫిదా సినిమా చూసి నేను నిజంగానే ఆయనకి ఫిదా అయిపోయాను. ఆయన హైట్ నాకు చాలా ఇష్టం. లావణ్య త్రిపాఠితో ఎంగేజ్ మెంట్ అయిపోయింది. కానీ, లేదంటే.. నేనే చేసుకుందాం అనుకున్నా (నవ్వుతూ). అల్లు అర్జున్, మహేశ్ బాబు అంటే ఇష్టం. ఆర్య సినిమా నుంచి అల్లు అర్జున్ ఇష్టం. అందులో పాటలు చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చింది దీపా జగదీష్.
అప్పుడే పెళ్లి:అయితే తన ముందే వరుణ్ తేజ్ గురించి నటి దీపా జగదీష్ చెప్పడంతో ఆమె భర్త సాగర్ రియాక్ట్ అయ్యారు. "చూస్తున్నా.. చూస్తున్నా.. నాతోపాటు ఆడియెన్స్ కూడా చూస్తున్నారు" అని సాగర్ సెటైర్ వేశాడు. దీంతో దీపా జగదీష్ పెద్దగా నవ్వేసింది. ఇదిలా ఉంటే జూన్ 9న నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీ నవంబర్ లేదా డిసెంబర్ లో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారని టాక్.


Click it and Unblock the Notifications











