టీవీ ఛానెల్ లో మల్లికా షెరావత్ స్వయంవరం
మళ్లీ ఇంతకాలానికి మల్లిక ఓ బుల్లితెర రియాలిటీ షోతో అభిమానుల్ని అలరించడానికి వస్తోంది. క్రైమ్ నేపథ్యంలో ఈ షో రెడీ అవుతోందని సమాచారం. ఇక బుల్లితెరని మల్లిక ఏలడం ఖాయం.. అని బాలీవుడ్‌లో అనుకోవడం విశేషం. ''ది బ్యాచిలరెట్ ఇండియా - మేరే ఖయాలో కీ మల్లికా'' అనే టివి షోతో తన కలల రాకుమారుడు మిస్టర్ రైట్ కోసం అన్వేషణ ప్రారంభించనున్నది.
అంతర్జాతీయంగా పాపులర్ అయిన ''ది బ్యాచిలర్'' టివి షో పోలికతో వస్తున్న ఈ డేటింగ్ రియాలిటీ షో అనే స్వయంవరంలో 30 మంది పోటీ పడుతున్నారు. లైఫ్ ఓకె చానల్‌లో అక్టోబర్ 7న ప్రారంభం కానున్న ఈ టీవీ షోకు నటుడు రోహిత్ రాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 30 మంది పోటీదారులలో 15 మందిని ఆయన పరిచయం చేశారు.
ఇంతకుముందు మల్లికా శరావత్ ఎప్పుడూ ఏదో ఒక న్యూసెన్స్‌తో నిత్యం వార్తల్లో నిలిచేది. కానీ ఇప్పుడు టచ్‌లోనే లేదు. ఇటీవలి కాలంలో మీడియాకి అమ్మడు పూర్తిగా దూరమైపోయింది. చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో ఈవిడని అంతా మర్చిపోయారు. అప్పట్లో హిస్ సినిమా టైమ్‌లో ప్రమోషన్ కోసం ముంబై, హైదరాబాద్, గోవా అంటూ అన్నిచోట్లా తిరిగింది. అప్పుడు మీడియా అంతా ఈవిడ వెంట తిరిగింది. ఇప్పుడామెను పట్టింకునే వారే కరువయ్యారు. దాంతో ఇలా టీవీల వెంటబడిందంటున్నారు.
ఇక ప్రస్తుతం మల్లిక ...రాజస్థాన్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన 'భన్వరీదేవి' జీవితం ఆధారంగా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెండి తెరపై శృంగారాన్ని ఒలికించిన మల్లికా శెరావత్ ఈ చిత్రంలో పల్లెటూరు పడుచుగా కనిపించబోతోంది. గ్లామర్‌కి ఆస్కారం లేని పాత్రలో పిడకలు చేసుకొంటూ కెమెరా ముందు నటిస్తోంది. ఇక ఈ చిత్రం టైటిల్ 'డర్టీ పాలిటిక్స్'. రాజస్థాన్‌లో రెండేళ్ల కిందట వెలుగుచూసిన భన్వరీదేవి ఉదంతం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. కె.సి.బొకాడియా దర్శకత్వం వహిస్తున్నారు. పల్లెటూరికి చెందిన గృహిణిగా మల్లిక పాత్ర ఉంటుంది. కొందరు రాజకీయ నాయకుల మూలంగా ఆమె జీవితం ఎలా ఇబ్బందులు పాలైందో చూపించబోతున్నారు.


Click it and Unblock the Notifications












