twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొంప ముంచిన కార్తీక దీపం: ఆ కోపంతో అమాంతం వేలు కొరికేసి.. ప్రాణం మీదకు తెచ్చిన సీరియల్ పిచ్చి

    |

    తెలుగు టెలివిజన్‌పై ఎన్నో సీరియళ్లు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణను అందుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అయిన 'కార్తీక దీపం' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి కారణం ఈ సీరియల్ దాదాపు ఐదేళ్లకు పైగానే ప్రసారం అవడంతో పాటు టాప్ రేటింగ్‌తో నేషనల్ రికార్డులను బ్రేక్ చేయడమే. ఇక, ఇటీవలే ఈ ధారావాహిక ప్రయాణం ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో 'కార్తీక దీపం' సీరియల్‌పై ఉన్న పిచ్చి ఒకరిని జైలుకు పంపించింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

     అలా వచ్చిన ‘కార్తీక దీపం'

    అలా వచ్చిన ‘కార్తీక దీపం'


    ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రారంభమై.. తక్కువ సమయంలోనే నెంబర్ వన్ సీరియల్‌గా మారిపోయింది 'కార్తీక దీపం'. తెలుగులోకి రావడానికి ముందే మలయాళంలో 'కరుతముత్తు' అనే పేరుతో ఇది ప్రసారం అయింది. దీన్ని టాలీవుడ్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర తెలుగులోకి రీమేక్ చేశారు. కానీ, మలయాళం కంటే ఎక్కువ కాలం నడిపించారు.

    శృంగార తారలా మారిన బిగ్ బాస్ దివి: వాటిని చూపిస్తూ అందాల ఆరబోతశృంగార తారలా మారిన బిగ్ బాస్ దివి: వాటిని చూపిస్తూ అందాల ఆరబోత

    వంటలక్క.. డాక్టర్ బాబుదే

    వంటలక్క.. డాక్టర్ బాబుదే


    'కార్తీక దీపం' సీరియల్ ఇంత సక్సెస్ అవడానికి అందులో దీప అలియాస్ వంటలక్క, డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ పాత్రలు చేసిన ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరూ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రేమీని తెలుగు ప్రేక్షకులు సొంత మనిషిని చేసేసుకుని ప్రత్యేకమైన స్థానాన్ని అందించారు.

    టీఆర్పీలో రికార్డులు బ్రేక్

    టీఆర్పీలో రికార్డులు బ్రేక్


    ఇప్పటికే తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లు వచ్చాయి. కానీ, అవేమీ భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకోలేదు. అయితే, 'కార్తీక దీపం' మాత్రం రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోయింది. ఇలా 1500కి పైగా ఎపిసోడ్లతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవడంతో పాటు భారీ రేటింగ్ అందుకుంది. దీంతో తెలుగులోనే కాకుండా ఇండియాలోనే నెంబర్ వన్ సీరియల్‌ అయింది.

    టూ పీస్ బికినీలో ప్రగ్యా సోకుల విందు: హాట్ షోతో ఫుల్ మీల్స్ పెట్టేసిందిగా!టూ పీస్ బికినీలో ప్రగ్యా సోకుల విందు: హాట్ షోతో ఫుల్ మీల్స్ పెట్టేసిందిగా!

     కార్తీక దీపం ముగిసిందిగా

    కార్తీక దీపం ముగిసిందిగా


    దాదాపు ఐదేళ్లకు పైగా నిరంతరాయంగా ప్రసారం అవడంతో పాటు నేషనల్ రేంజ్‌లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన 'కార్తీక దీపం' సీరియల్ జనవరి 23వ తేదీతో ప్రయాణాన్ని ముగించుకుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ ఎంతో ఎమోషనల్‌గా సాగుతూ మెయిల్ లీడ్ కలవడంతో సుఖాంతమైంది. దీంతో ఈ సీరియల్‌ను ఫాలో అయ్యే వాళ్లంతా నిరాశకు లోనవుతూనే ఉన్నారు.

    కొంప ముంచిన క్లైమాక్స్

    కొంప ముంచిన క్లైమాక్స్

    తెలుగు రాష్ట్రాల్లో 'కార్తీక దీపం' సీరియల్‌కు ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా దీని క్లైమాక్స్ ఎపిసోడ్‌ను బుల్లితెర ప్రియులంతా ఆసక్తిగా వీక్షించారు. కార్తీక దీపం క్లైమాక్స్ వల్ల ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్న న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఊహించని సంఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.

    Neha Shetty ఓవర్ డోస్ హాట్ షో: డీజే టిల్లు హీరోయిన్ గీత దాటేసి మరీ టెంప్ట్ చేస్తోందిగా!Neha Shetty ఓవర్ డోస్ హాట్ షో: డీజే టిల్లు హీరోయిన్ గీత దాటేసి మరీ టెంప్ట్ చేస్తోందిగా!

    సీరియల్ కోసం కొరికేసి

    సీరియల్ కోసం కొరికేసి


    ములుగు జిల్లా వెంకటాపూర్‌ పరిధిలోని పాలంపేటకు చెందిన గట్టు మొగిలి కిరాణా దుకాణంలో మద్యం కూడా విక్రయిస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన తాళ్లపెల్లి వెంకటయ్య జనవరి 23న రాత్రి ఆ దుకాణానికి వచ్చి మద్యం కొని తాగాడు. ఆ తర్వాత మరికొంత మద్యం అరువుకు కావాలని విసిగించాడు. ఈ తరుణంలో కార్తీకదీపం సీరియల్‌ చూస్తున్న మొగిలి సహనం కోల్పోయి వెంకటయ్యపై దాడి చేసి అతని కుడి చేతి చూపుడు వేలిని కొరికేశాడు.

    కేసు నమోదు చేయగా

    కేసు నమోదు చేయగా


    వేలు కొరకేసిన ఘటనపై బాధితుడు వెంకటయ్య తర్వాతి రోజు వెంకటాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మొగిలిని స్టేషన్‌కు పిలిచి విచారణ జరపగా.. కార్తీక దీపం చూస్తోన్న సమయంలో విసిగించడంతోనే దాడి చేశానని సమాధానం చెప్పాడు. దీంతో అవాక్కైన పోలీసులు ఐపీసీ 290, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిసింది.

    English summary
    Karthika Deepam Is Top Serial in Telugu Television History. Now This Serial Got 21.10 TRP Rating and Create National Record in Television History.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X