ఆ జ్యోతిష్యం ఎవడికి కావాలి .. బిగ్‌బాస్‌లోకి వేణుస్వామిని తేవొద్దు.. పబ్లిక్‌గా తేల్చేసిన కుర్రాడు
త్వరలో సీజన్ ప్రారంభం కానుండటంతో తెలుగునాట బిగ్‌బాస్ మేనియా స్టార్ట్ అయ్యింది. సెప్టెంబర్ ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌లో బిగ్‌బాస్ 8 తెలుగు ప్రసారమవుతుందని టాక్. ఇప్పటికే బిగ్‌బాస్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా.. దానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక్కడ ఒకసారి కమిటైతే లిమిటే లేదు.. అంటూ నాగ్ చెబుతున్న డైలాగ్ వైరల్ అయ్యింది. ఏం కావాలన్నా లిమిట్ లేకుండా ఇస్తానని.. కానీ అడిగే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని నాగార్జున చెబుతున్నాడంటే ఇదో తిరకాసు ఉంటోందని జనం భావిస్తున్నారు.
అన్నింటికి మించి బిగ్‌బాస్ 8 తెలుగులో కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. యాదమ్మరాజు, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బర్రెలక్క, కుమారి ఆంటీ, అబ్బాస్, రాజ్ తరుణ్, అంబటి రాయుడు, అంజనా సౌమ్య తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో చాలా మందికి ఇంటర్వ్యూలు కూడా అయిపోయాయని, రేపో మాపో అనౌన్స్‌మెంట్ పక్కా అంటూ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు వీడియోలు పెడుతున్నారు.

కంటెస్టెంట్స్ లిస్ట్‌లో సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు కూడా వినిపించింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఆయన హౌస్‌లో ఉంటే మంచి ఎంటర్‌టైన్మెంట్ పక్కా అని బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా ఫీలయ్యారు. అయితే వేణుస్వామి ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. ఊహాగానాలకు తెరదించుతూ అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్‌మెంట్ జరిగి జస్ట్ గంటలు గడవకముందే.. నేను ఇప్పుడే చైతూ- శోభితల జాతకం చూశాను, అస్సలు బాలేదు.. నిశ్చితార్ధం జరిగిన టైం కరెక్ట్ కాదని , ఓ అమ్మాయి కారణంగా వీరు కొద్దినెలల్లోనే విడిపోతారంటూ వేణుస్వామి వీడియో పెట్టాడు.
అయితే తెలుగు ఫిలిం జర్నలిస్టులు, డిజిటల్ మీడియా యూనియన్లు వేణుస్వామిపై తెలంగాణ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో కమీషన్ ఆయనకు నోటీసులు జారీ చేయడంతో పాటు 22వ తేదీన వ్యక్తిగతం హాజరుకావాలని ఆదేశించింది. కొద్దిరోజుల క్రితం 30 , 40 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను పిలిచి వారికి లావిష్ పార్టీ, కొంత డబ్బు ముట్టజెప్పి బిగ్‌బాస్‌లో తనకు ఓట్లు పడేలా , క్యాంపెయినింగ్ చేసిపెట్టమని కోరాడట. అయితే స్వయంగా హోస్ట్ నాగార్జున కొడుకు మీదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వేణుస్వామికి బిగ్‌బాస్ డోర్స్ క్లోజ్ అయిపోయినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇదిలాఉండగా .. బిగ్‌బాస్ 8లో కంటెస్టెంట్స్‌గా ఎవరుంటే బాగుంటుందని ఓ ఛానెల్ జనాన్ని ప్రశ్నించింది. దీనికి పబ్లిక్ తలో రకంగా స్పందించారు. ఈ క్రమంలో ఓ కుర్రాడు మాట్లాడుతూ.. వేణుస్వామిని బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకురావొద్దని , ఆయన వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదని చెప్పాడు. అక్కడ గేమ్స్, స్కిట్స్ చేయమంటే జ్యోతిష్యం చెప్పుకుంటూ గడిపేస్తాడని కామెంట్ చేశాడు. బిగ్‌బాస్ ఎవరు గెలుస్తారో ముందే చెబుతాడని.. అయితే ఇప్పుడు ఆయన జ్యోస్యం ఫలించడం లేదన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Public Expectations On Bigg Boss Season8 Telugu #BiggBoss8 #Nagarjuna #unlimitedfun #BiggBossSeason8 #BiggBossTelugu #bb8telugu #biggboss8telugu #biggbosstelugu8 #biggboss #telugumoviescenes #telugucomedytrolls #UpcomingMovie #MovieUpdates #Tollywood #TFCMedia pic.twitter.com/SMHkgjIeoO
— Tollywood Film City Media (@tfc_media) August 17, 2024


Click it and Unblock the Notifications











